విదేశీ యువతిని బుక్ చేసుకుంటే.. స్వదేశీ అమ్మాయి ఫ్రీ..

విదేశీ యువతిని బుక్ చేసుకుంటే.. స్వదేశీ అమ్మాయి ఫ్రీ..

ఆకలి, అవసరం ఎన్ని తప్పులైనా చేయిస్తుంది. ఎంతదూరమైనా తీసుకెళ్తుంది. అవతలి వ్యక్తుల అవసరాలను, వీక్ నెస్ లను అడ్డం పెట్టుకొని దేశంలో కొంతమంది తప్పుడు మార్గంలోకి తీసుకెళ్తున్నారు. తప్పు అని తెలిసినా, ఆ సమయంలో అవసరం కాబట్టి చెప్పినట్టు చేస్తున్నారు. మహిళలను ఇలా వ్యభిచార రొంపిలోకి దించుతున్న ముఠాల ఆగడాలను పోలీసులు ఎప్పటికప్పుడు అరికాడుతున్నా, ఏదో ఒక రూపంలో వ్యభిచారం జరుగుతూనే ఉన్నది.

ఇప్పుడు వ్యభిచార ముఠాలు హైటెక్ మార్గాన్ని ఎంచుకున్నాయి. సాంకేతికతను వినియోగించుకొని గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారాలను చక్కబెడుతున్నాయి. ఒకప్పుడంటే వ్యభిచార గృహాలు ఉండేవి. అక్కడికే విటులు వచ్చేవారు. కానీ, ఇప్పుడు అంతా హైటెక్… బుక్ చేసుకుంటే చాలు… డైరెక్ట్ గా ఇంటికే వచ్చేస్తుంటారు. దీంతో ఇలాంటి వాటిని కనిపెట్టడం పోలీసులకు సవాల్ గా మారింది.

ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి, పండగలకు ఆఫర్లు ఇచ్చినట్టుగా ఈ వ్యభిచార ముఠా సంస్థలు ఆఫర్లు ఇస్తున్నాయి. ఒక విదేశీ అమ్మాయిని బుక్ చేసుకుంటే, మరో స్వదేశీ అమ్మాయి ఫ్రీ అని ప్రకటిస్తున్నారు. దీనికోసం రష్యా, ఉక్రెయిన్ వంటి దేశాల నుంచి యువతులను విజిటింగ్ వీసాలపై ఇండియాకు తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

అయితే, ఇటీవలే పక్కా ఆధారాలతో పోలీసులు పూణేలోని ఓ హోటల్ పై దాడి చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విటులు, యువతులు చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.