ఇటీవలే తెలంగాణాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెరాస పార్టీ భారీ విజయం సాధించింది. 120 మున్సిపాలిటీలకుగాను వందకు పైగా మున్సిపాలిటీలను గెలుచుకొని తమకు తిరుగులేదని మరోసారి రుజువుచేసుకుంది. 9 కార్పొరేషన్లను కైవసం చేసుకొని సత్తా చాటింది. గెలవడం వరకు బాగానే ఉన్నది. పురపాలక ఎన్నికల్లో గెలిచేందుకు ఆ పార్టీ ఇచ్చిన హామీలు అన్నీఇన్నీ కావు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని పురపాలక శాఖామంత్రి, తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.
కేటీఆర్ ఇచ్చిన హామీకి అనుగుణంగా ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రచారం నిర్వహించారు. ప్రజలు కూడా ఈ హామీలను దృష్టిలో పెట్టుకొని ఓటు వేశారు. ఇదంతా ఒకెత్తు.. ఇప్పుడు ఇచ్చిన హామీలకు తగ్గట్టుగా అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయాలి అంటే మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వాలి. తెరాస గెలిచిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధి కోసం ఇప్పటికిప్పుడు నిధులు కేటాయించాలి అంటే తడిసిమోపెడు అవుతుంది.
వీటికోసం భారీ బడ్జెట్ కేటాయించాల్సి వస్తుంది. ఆ స్థాయిలో బడ్జెట్ ఇప్పుడు తెలంగాణ వద్ద ఉన్నదా అంటే లేదని చెప్పాలి. ఫిబ్రవరి మూడో వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ బడ్జెట్ లో మున్సిపాలిటీల అభివృద్ధి కోసం బడ్జెట్ కేటాయించాలి. మున్సిపాలిటీలకు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు ఏంటి అనే విషయాలపై ఎమ్మెల్యేలు కేటీఆర్ చుట్టూ తిరుగుతున్నారట.
తెలంగాణ భవన్ లో ప్రస్తుతం దీనిగురించి చర్చ జరుగుతున్నది. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం తగినంత బడ్జెట్ ను కేటాయించని పక్షంలో మున్సిపాలిటీ మేయర్లు, కౌన్సిలర్ల నుంచి ఎమ్మెల్యేల వరకు ఒత్తిడి పెరుగుతుంది. తెరాస పార్టీపై ప్రజల్లో అనుమానాలు మొదలౌతాయి. అందుకే ఎలాగైనా రాబోయే బడ్జెట్ లో వీలైనంత ఎక్కువగా మున్సిపాలిటీల అభివృద్ధికి సంబంధించిన బడ్జెట్ ను కేటాయించాలని కేటీఆర్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు ఎమ్మెల్యేలు.
280901 103706You got a really superb website, Glad I noticed it by means of yahoo. 517957
732916 680686I like what you guys are up too. Such smart function and reporting! Carry on the superb works guys Ive incorporated you guys to my blogroll. I believe it will improve the value of my website 828660
709712 884769Keep up the fantastic piece of function, I read couple of posts on this internet internet site and I believe that your weblog is genuinely interesting and holds bands of amazing details. 501817
862028 799540Thank you for sharing with us, I conceive this website really stands out : D. 577780
689744 27991The posh distributed could be described as distinctive; customers are really yearning for bags can be a Native aspirations. Which strange surroundings is built that is to market diversity furthermore importance with travel and leisure market trends. hotels particular offers 873837