ఈ ఐపీఎల్ లో అత్యంత దారుణమైన ఫామ్ లో కొనసాగుతున్న టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చినట్లుగా అనిపిస్తున్నాడు. తాజాగా గుజరాత్ పై జరిగిన లీగ్ మ్యాచ్ లో విజయాన్ని తన జట్టుకు అందించడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించారు. కోహ్లీ ఈసారి చాలా కసిగా ఆడినట్లుగా.. అదే సమయంలో ఓపికతో ఆడినట్లుగా అనిపించింది అంటూ క్రీడా పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కోహ్లీ నిలిచి జట్టును గెలిపించడంతో ప్లే ఆఫ్ ఆశలు బెంగళూరుకు సజీవంగా ఉన్నాయంటూ సమాచారం అందుతోంది. పాండ్య భారీగా కొట్టడంతో గుజరాత్ జట్టు 20 ఓవర్లకి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు 18.4 ఓవర్లలోనే లక్ష్యంను ఛేదించింది. విరాట్ కోహ్లీ 73 పరుగులు చేశాడు. అందులో రెండు సిక్స్ లు కూడా ఉండటం విశేషం. ఈ విజయంతో 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో బెంగళూరు నాల్గవ స్థానంలో నిలిచింది. దీంతో ఖచ్చితంగా బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశం ఉందంటున్నారు.