తెలంగాణ సీఎం దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. దేశ వ్యాప్తంగా ఉన్న మోడీ వ్యతిరేకులను ఏకం చేసేందుకు కేసీఆర్ చేయబోతున్న ప్రయత్నాలు ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో సీఎం కేసీఆర్ దేశ వ్యాప్త పర్యటన కోసం సిద్దం అయ్యారు. ఎనిమిది రోజుల పాటు దేశ వ్యాప్తంగా కేసీఆర్ పర్యటించేందుకు నేడు ఢిల్లీ వెళ్లబోతున్నారు.
అక్కడ పలు పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలతో పాటు అన్నా హజారే ను కూడా కలువబోతున్నట్లుగా టీఆర్‌ఎస్ వర్గాల వారు చెబుతున్నారు. ఢిల్లీ, పంజాబ్ సీఎంలను కూడా కేసీఆర్ కలవబోతున్నాడు. బెంగళూరు మరియు బీహార్ లో కూడా కేసీఆర్ పర్యటించబోతున్నారు. మొత్తానికి వారం రోజుల పాటు దేశ వ్యాప్తంగా కేసీఆర్ చక్కర్లు కొట్టబోతున్నాడు. ఆయన ఈ రాజకీయ పర్యటన ఎంత మేరకు ఫలితాన్ని ఇస్తుంది అనేది చూడాలి.