యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా ఆయన తదుపరి సినిమా కు సంబంధించిన ప్రీ లుక్ మోషన్ పోస్టర్ ను ఎన్టీఆర్ వాయిస్ తో విడుదల చేయడం జరిగింది. ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగ్ తో ఆ మోషన్ పోస్టర్ విడుదల అవ్వడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈఎన్టీఆర్ 30 సినిమా విడుదల విషయంలో స్పష్టత ఇచ్చారు. ఇప్పటి వరకు కొరటాల శివ పాన్ ఇండియా సినిమా చేసింది లేదు. ఎన్టీఆర్ కు ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా స్థాయి లో స్టార్ డమ్ వచ్చింది.
కొమురం భీమ్ పాత్రలో కనిపించిన ఎన్టీఆర్ అక్కడి వారిని ఆకట్టుకున్నాడు. అందుకే ఆయన తదుపరి సినిమాలకు అక్కడ మంచి బిజినెస్ ఉండే అవకాశం ఉందంటున్నారు. కేవలం తెలుగు లో కాకుండా ఎన్టీఆర్ 30 సినిమా ను హిందీ, కన్నడం, మలయాళం మరియు తమిళంలో కూడా విడుదల చేయబోతున్నట్లుగా సినిమా యొక్క మోషన్ పోస్టర్ విడుదల చేయడం నుండే క్లారిటీ ఇచ్చారు. అయిదు భాషల్లో కూడా ఎన్టీఆర్ డైలాగ్ తో మోషన్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. కనుక ఖచ్చితంగా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీగా విడుదల అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు.