కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప మనవరాలు సౌందర్య నీరజ్ ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు లో ఆమె నివాసం ఉంటున్న ఒక అపార్ట్ మెంట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి బతికించేందుకు ప్రయత్నించారు. కాని బెంగళూరు లోని ఒక ప్రైవైట్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. యడ్యూరప్ప పెద్ద కుమార్తె యొక్క కుమార్తె ఈ సౌందర్య. ఈమె మరణంకు కారణం ఏంటీ.. కుటుంబ పరిస్థితులు ఏంటీ అనే విషయాలను ప్రస్తుతం పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.
2019 లో ఈమె కు కుటుంబ సభ్యులు డాక్టర్ నీరజ్ తో వివాహం చేశారు. పెళ్లి అయిన రెండేళ్లకే ఇలా జరగడం పట్ల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్ల సౌందర్య ఆత్యహత్య తో కుటుంబం లో విషాద చాయలు అలుముకున్నాయి. గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలు ఉన్నాయని.. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని కొందరు భావిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు నీరజ్ ను విచారించేందుకు సిద్దం అవుతున్నారు. ఈ విషయమై మాజీ సీఎం యడ్యూరప్ప నుండి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. మనవరాలి మృతి తో బాధ లో ఉన్న యడ్డీ ని పలువురు ప్రముఖు లు పరామర్శించారు.