రాష్ట్రంలో ఉన్న సమస్యలను పక్క దారి పట్టించేందుకు.. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇప్పుడు కొత్త జిల్లాల ప్రస్థావన తీసుకు వచ్చారంటూ తెలుగు దేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించాడు. ప్రస్తుతం ఉద్యోగ సంఘాల నాయకులు చేస్తున్న ఆందోళనతో పాటు రైతుల ఆత్మహత్యలు ఇంకా పలు సమస్యలు జనాల దృష్టికి రాకూడదు అనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం కొత్త జిల్లాలను తెరపైకి తీసుకు వచ్చిందని.. కొత్త జిల్లాల వల్ల జనాలకు కొత్తగా జరిగే అభివృద్ది ఏమీ లేదంటూ చంద్రబాబు నాయుడు పేర్కొన్నాడు.
ప్రస్తుతం ప్రజలకు కావాల్సిన మౌళిక వసతులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలంటూ చంద్రబాబు నాయుడు సూచించాడు. జగన్ ప్రభుత్వం మొదటగా ఉద్యోగస్తుల సమస్యల పట్ల శ్రద్ద పెట్టి వారిని మళ్లీ ఆఫీస్ ల్లో పని చేసేలా నిర్ణయం తీసుకోవాలంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు ప్రభుత్వం ను డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు కొత్త జిల్లాలను కొందరు తెలుగు దేశం పార్టీ నాయకులు స్వాగతిస్తున్నారు.