Switch to English

వయసు ఆరేళ్లు.. సంపాదన నెలకు రూ.21 లక్షలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,438FansLike
57,764FollowersFollow

సాధారణంగా ఆరేళ్ల పిల్లలు ఏం చేస్తారు? బాగా అల్లరి చేస్తారు.. నాన్న కొనిచ్చిన బొమ్మలతో ఆడుకుంటారు. కానీ దక్షిణ కొరియాకు చెందిన బోరం మాత్రం.. అవే బొమ్మలతో లక్షలు సంపాదిస్తోంది. ఎలా అంటారా? ఆ బొమ్మల గురించి యూట్యూబ్ లో రివ్యూస్ చెబుతుంది. ఇంకా రకరకాల వీడియోలు చేసి లక్షలు పోగేస్తోంది. ‘బోరం టాయ్ రివ్యూస్’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ చిన్నారి తన వీడియోలు పోస్ట్ చేస్తుంది.

ఈమెకు మొత్తం 3 కోట్లకు పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు. మొత్తం రెండు యూట్యూబ్ ఛానళ్లను ఈమె నిర్వహిస్తోంది. బోరం టాయ్ రివ్యూస్ ఛానల్ కు 1.36 కోట్ల మంది సబ్ స్క్రైబర్లు ఉండగా.. మరో వీడియో బ్లాగ్ కు 1.76 కోట్ల మంది ఖాతాదారులున్నారు. ఈమె వీడియో చేసిందంటే చాలు.. గంటల వ్యవధిలోనే లక్షలాది వ్యూస్ వచ్చేస్తాయి. బోరం వీడియో ఎప్పుడొస్తుందా అని చాలామంది ఎదురు చూస్తుంటారు. ప్లాస్టిక్ టాయ్ కిచెన్ లో బోరం చేసిన ఇన్ స్టంట్ నూడుల్స్ వీడియో ఎంత పాపులర్ అయిందో తెలుసా? ఏకంగా ఆ వీడియోను 37.6 కోట్ల మంది వీక్షించారు.

ఇలా ఈ చిన్నారి దక్షిణ కొరియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించేసింది. ఈ క్రమంలో కొన్ని వివాదాలకూ కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. బోరం వీడియోలు చిన్నారులపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయంటూ ‘సేవ్ ది చిల్డ్రన్’ అనే స్వచ్ఛంద సంస్థకు పలువురు పౌరులు ఫిర్యాదు చేశారు. నాన్న జేబులో నుంచి డబ్బులు కొట్టేసి రోడ్లపై కారు నడుపుతూ ఎలా తిరగాలో పేర్కొంటూ బోరం చేసిన వీడియోను ఉదాహరణగా చూపించారు. దీంతో ఆ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు కోర్టుకు వెళడంతో బోరం తల్లిదండ్రులను పిలిచి చీవాట్లు పెట్టింది.

ఈ నేపథ్యంలో అలాంటి వీడియోలను తమ యూట్యూబ్ ఛానల్ నుంచి తొలగించారు. లక్షలకు లక్షలు సంపాదిస్తున్న బోరం.. ఇటీవలే సియోల్ లోని ఖరీదైన ప్రాంతంలో ఏకంగా రూ.55 కోట్ల విలువ చేసే భవనం కూడా కొనుగోలు చేసింది. బోరం లాంటి బంగారు తల్లి మన ఇంట్లోనూ ఉంటే బాగుంటుందనిపిస్తోంది కదూ!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌...

రాజకీయం

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...