Switch to English

రవితేజ ‘డిస్కో రాజా’ మూవీ రివ్యూ 

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

నటీనటులు: రవితేజ, పాయల్ రాజ్పుత్, నాభ నటేష్, తన్య హోప్
నిర్మాత: రమేష్ తాళ్లూరి
దర్శకత్వం: విఐ ఆనంద్
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
మ్యూజిక్: థమన్ ఎస్
ఎడిటర్‌: శ్రవణ్ కటికనేని
రన్ టైం: 2 గంటల 29 నిముషాలు
విడుదల తేదీ: జనవరి 24, 2020

వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న మాస్ మహారాజ్ రవితేజ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్ డైరెక్షన్ లో చేసిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా ‘డిస్కో రాజా’.  రవితేజ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో నభ నటేష్, పాయల్ రాజ్పుత్ లు హీరోయిన్స్ గా నటించారు. రవితేజ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా ప్రేక్షకులకి ఎంత వరకూ నచ్చింది? రవితేజకి కావాల్సిన హిట్ ని ఇచ్చిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

ఓపెన్ చేస్తే.. రవితేజ వాయిస్ ‘గేమ్ ఇప్పుడే మొదలైంది’.. ఇక కథలోకి వెళితే.. ఒక స్నో మౌంటైన్ లో పడి బ్రెయిన్ డెడ్ అయిన వాసు(రవితేజ)ని అక్కడ ఉన్న బయో కెమికల్ ల్యాబ్ వారు తీసుకొచ్చి తనపై ప్రయోగం చేస్తారు. దాంతో వాసు బతుకుతాడు. అక్కడి నుంచి తప్పించుకొని తన గతం, తన వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఒక ఎంపితో పబ్లిక్ లో గొడవ పెట్టుకుంటాడు. దాంతో వాసుకి కావాల్సిన వాళ్ళతో పాటు చెన్నైకి చెందిన రౌడీ సేతు(బాబీ సింహా) కూడా వాసుని వేసెయ్యడానికి వస్తాడు. దానికి కారణం వాసుకి డిస్కో రాజ్ కి సంబంధం ఉందనుకోవడం. ఇక అక్కడి నుంచి కథ ఎన్ని మలుపులు తిరిగింది? ఇంతకీ ఈ డిస్కో రాజ్ ఎవరు? డిస్కో రాజ్ కి వాసు కి ఉన్న గొడవలు ఏమిటి? అసలు వాసుని ఎవరు మౌంటైన్స్ లో పడేసింది? ఇంతకీ ఆ బయో కెమికల్ ల్యాబ్ లో జరిగిన ప్రయోగం ఏమిటి? దాని వలన వాసు పడిన ఇబ్బందులేమిటి? ఇలాంటి అన్ని సమాధానాల సమూహారమే ‘డిస్కో రాజా’.

తెర మీద స్టార్స్..

డిస్కో రాజ్ గా రవితేజ నటన ఎలా ఉంది అంటే.. గత్తరలేపినవ్..  చింపేసినవ్ పో అని చెప్పాలి. డిస్కో రాజ్ గా యాటిట్యూడ్, మ్యానరిజమ్స్, డైలాగ్ మాడ్యులేషన్, స్టెప్స్ సింప్లీ సూపర్బ్.. స్పెషల్ గా ఇంగ్లీష్ లో చూపిన కొన్ని కొన్ని డైలాగ్స్ ఇక అందరినోటా మారుమ్రోగుతాయ్.  వాసు పాత్రలో కూడా మెప్పించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రవితేజ కోసం, రవితేజ మాత్రమే చేయగలిగిన పాత్ర డిస్కో రాజ్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పేరుకి ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నప్పటికీ కథకి అవసరమున్న పాత్రలో కనిపించింది మాత్రం పాయల్ రాజ్ పుత్. తను వింటేజ్ స్టైల్లో చాలా బాగుంది, అలాగే తన పాత్రలో చాలా బాగా చేసింది. నభ నటేష్ కి పెద్ద పాత్ర లేదు, ఉన్నంతలో ఓకే. ఇక సైంటిస్ట్ గా తన్య హోప్ ఉన్నంతలో బాగా చేసింది. తన్య హోప్ – వెన్నెల కిషోర్ మధ్య సీన్స్ కొన్ని నవ్వులు పూయిస్తాయి.

ఇకపోతే రవితేజకి ధీటుగా పెర్ఫార్మన్స్ తో సూపర్బ్ అని విజిల్స్ వేయించుకున్న నటుడు బాబీ సింహా. నెగటివ్ షేడ్స్ లో అదరగొట్టాడు. అలాగే మరో సర్ప్రైసింగ్ పెర్ఫార్మన్స్ అంటే సునీల్ దని చెప్పాలి. అటు కామెడీ, ఇటు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మరియు వాయిస్ లో అద్భుతమైన వేరియేషన్స్ చూపించాడు. సునీల్ కి నటుడిగా మరో టర్నింగ్ పాయింట్ ఈ సినిమా అని చెప్పుకోవాలి. రాంకీ, సత్య మిగిలిన నటీనటులు ఉన్నంతలో బాగానే చేశారు.

 
తెర వెనుక టాలెంట్..

డైరెక్టర్ విఐ ఆనంద్ అనుకున్నదానికంటే ఎక్కువగా, అద్భుతమైన వర్క్ తో మెప్పించిన వారు ముగ్గురు ఉన్నారు. వాళ్ళే మ్యూజిక్ డైరెక్టర్ థమన్, సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని అండ్ ఆర్ట్ డైరెక్టర్ శ్రీనాగేంద్ర తంగల. కార్తీక్ విజువల్స్ అండ్ సెట్స్ సినిమాలో పూర్తిగా లీనమయ్యేలా చేస్తే థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది. ముఖ్యంగా డిస్కో రాజ్ పాత్ర కోసం వీళ్ళు తీసుకున్న కేరింగ్ వల్లే ఆన్ స్క్రీన్ వండర్ఫుల్ గా అనిపిస్తుంది. సాంగ్స్ ఎంత హిట్ అయ్యాయో విజువల్ గా అంతకు మించి ఉండేలా షూట్ చేశారు. ఇక అబ్బూరి రవి డైలాగ్స్ బాగున్నాయి. మరీ రవితేజ గత సినిమాల్లాంటి మాస్ డైలాగ్స్ కాదు, కానీ మాస్ అనిపించేలా డిస్కో రాజ్ పాత్రకి డైలాగ్స్ రాసారు. ఇక ఎడిటర్ శ్రవణ్ కటికనేని ఓవరాల్ గా ఓకే అనిపించినా అక్కడక్కడా కొంతవరకూ కత్తెర వేసి ఉండచ్చు. బోరింగ్ సీన్స్ ఎక్కువైనప్పుడు ఆయన మాత్రం ఏం చేయగలడు.

ఇక కెప్టెన్ అఫ్ ది షిప్ విఐ ఆనంద్ విషయానికి వస్తే.. రెగ్యులర్ కమర్షియల్ కథలకి ఏదో ఒక కొత్త పాయింట్ ని జత చేసి ఇది కమర్షియల్ కథ కాదు అని కలర్ కోటింగ్ ఇచ్చి చెప్పడం విఐ ఆనంద్ ట్రిక్.. అదే ట్రిక్ ని ఇక్కడా ఫాలో అయ్యాడు. అందరికీ సైన్స్ ఫిక్షన్ కథ అని చెప్పి ఒక రెగ్యులర్ రివెంజ్ డ్రామాని చెప్పారు. అలా అని సైన్స్ ఫిక్షన్ టచ్ చేయలేదని కాదు, టచ్ చేసి మరీ రెగ్యులర్ కాదులే అనిపించి వదిలేసాడు. ‘ది ఏజ్ ఆఫ్ అడలిన్’ అనే కథలోని కీ పాయింట్ ని ఇక్కడ సైన్స్ ఫిక్షన్ ద్వారా చెప్పాడు. కానీ అంత డిఫరెంట్ అండ్ యూనిక్ పాయింట్ ని ఎంచుకోవడంలో, డిస్కో రాజ్ పాత్రని  కొత్తగా డిజైన్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు కానీ కథని మాత్రం అదే పాత పద్దతిని ఫాలో అయ్యాడు. దాంతో దెబ్బైపోయాడు. సినిమాలో డిస్కో రాజ్ పాత్ర కనిపిస్తున్నంత సేపు సినిమా ఫుల్ ఎనర్జీగా ఉంటుంది, అదే లేకపోతే గాలి తీసేసిన బెలూన్ లా తుస్ అంటూ చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో డిస్కో రాజ్ తో క్రియేట్ చేసిన మేజిక్ ని ప్రెజంట్ డిస్కో రాజ్ పాత్రలో చూపించలేకపోవడం మరో మైనస్. స్క్రీన్ ప్లే లో దాదాపు 20 నిమిషాలు చెప్పే సైన్స్ ఫిక్షన్ విషయానికి కథలో పెద్ద ఉపయోగం లేకపోవడం వలన ఇంతోటి కథకి స్టార్టింగ్ లో అంత సోది ఎందుకు చెప్పారబ్బా అనుకుంటారు. ఫస్ట్ హాఫ్ స్లోగా మొదలవుతుంది తర్వాత పికప్ అవుతుంది, ఇంటర్వల్ కి పీక్స్ కి వెళ్లి సెకండాఫ్ లో కొద్దిసేపు ఆ టెంపో కంటిన్యూ అవుతుంది. ఇక అక్కడి నుంచి డ్రాప్ అవుతుంది. అలాగే కథలో మెయిన్ విలన్స్ అయిన ఇద్దరికీ సరైన లక్ష్యం ఉండదు. అందుకే బాబీ సింహా, సునీల్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ కనబరిచిన పాత్రల్లో డెప్త్ లేక విలనిజం పెద్ద కిక్ ఇవ్వలేదు. విఐ ఆనంద్ డైరెక్టర్ గా 50-50 అని చెప్పాలి. రామ్ తాళ్లూరి ప్రొడక్షన్ డిజైనింగ్ మాత్రం విజువల్ వండర్ అనిపించుకుంది.

విజిల్ మోమెంట్స్:  

– డిస్కో రాజ్ గా రవితేజ పెర్ఫార్మన్స్ అదిరింది.
– ఇంటర్వల్ బ్లాక్
– సెకండాఫ్ మొదటి 30 నిముషాలు
– బాబీ సింహా పెర్ఫార్మన్స్
– చిరు కటౌట్ సీన్స్
– థమన్ మ్యూజిక్
– కార్తీక్ ఘట్టమనేని విజువల్స్

బోరింగ్ మోమెంట్స్: 

– పేరుకే సైన్ ఫిక్షన్ కథ మాత్రం పరమ రొటీన్
– బోరింగ్ స్క్రీన్ ప్లే
– సెకండాఫ్ లో సెకండ్ పార్ట్ బాగా వీక్ అవ్వడం
– విలనిజంలో దమ్ము లేకవడం
– కామెడీ లేకపోవడం
– రవితేజ అభిమానులు కోరుకునే అంశాలు తక్కువ కావడం.
– వృధా అయినా గుడ్ కాన్సెప్ట్

విశ్లేషణ: 

సైన్స్ ఫిక్షన్ సినిమా, సెటప్స్, హాలీవుడ్ టెక్నీషియన్స్, గ్రాఫిక్స్ అవీ ఇవీ అని చెప్పుకుంటూ వచ్చిన ‘డిస్కో రాజా’ సినిమాలో టైటిల్ రోల్ అయిన డిస్కో రాజ్ పాత్ర మాత్రమే మెప్పించింది, మిగతా అంతా సర్వ మంగళ మేళమే అన్నట్లు ఉండడంతో ప్రేక్షకులు నిరాశపడతారు. మొదలు పెట్టిన సూపర్బ్ సైన్స్ ఫిక్షన్ పాయింట్ ని పక్కన పడేసి రొటీన్ పంథాలో కథని తీసుకెళ్ళడం బోరింగ్ గా అనిపిస్తుంది. డిస్కో రాజ్ పాత్రని రవితేజ అభిమానులు, సినీ ప్రేక్షకులు సూపర్బ్ ఎంజాయ్ చేస్తారు, కానీ అది సినిమాలో ఓవరాల్ గా గంట మాత్రమే ఉంటుంది, మిగతా దానిలో పెద్దగా మ్యాటర్ లేకపోవడం వలన ప్రేక్షకులు నిరాశతోనే బయటకి వస్తారు. ఓవరాల్ గా రవితేజ తన పంథా మార్చి చేసిన ఈ సినిమాలో డిస్కో రాజ్ గా కొంతవరకూ మెప్పించిన, అయన నుంచి కోరుకునే కామెడీ, మాస్ ఎలిమెంట్స్ లాంటివి మిస్ అవ్వడం వలన యావరేజ్ బొమ్మ ‘డిస్కో రాజా’ అనే టాక్ ని తెచ్చుకుంటుంది.

ఇంటర్వల్ మోమెంట్: ఇంటర్వల్ బ్లాక్ అదిరింది, కమాన్ డిస్కో రాజా సెకండాఫ్ కుమ్మేసుకుందాం.!

ఎండ్ మోమెంట్: పైన పటారం.. లోన లొటారం..!

చూడాలా? వద్దా?: రవితేజ ఫాన్స్ ఒకసారి చూడచ్చు.!

బాక్స్ ఆఫీస్ రేంజ్:

డిస్కో రాజ్ గా రవితేజ మెప్పించినప్పటికీ, మిగతా రెండు పాత్రలు పెద్దగా ఆకట్టుకోకపోవడం వలన ‘డిస్కో రాజా’ సినిమాకి సినీ ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ వస్తుంది. కానీ సంక్రాంతి తర్వాత సినిమాలు లేకపోవడం, సోలో రిలీజ్ కావడం, ఇప్పటికే ఆన్ లైన్ బుకింగ్ చాలా వరకూ అవ్వడం వలన తెలుగులో ఈ వీకెండ్ మంచి  కలెక్షన్స్  రాబట్టుకోవచ్చు. కానీ సోమవారం నుంచి కాస్త టఫ్ అవుతుంది. వీక్ డేస్ లో కంప్లీట్ డ్రాప్ అయితే మాత్రం 22 కోట్ల పైన షేర్ సాధించడం అనేది కష్టతరం అవుతుంది.

గమనిక: మా బాక్స్ ఆఫీస్ రేంజ్ అనేది సినిమా రేటింగ్ మీదే పూర్తిగా డిపెండ్ అవ్వకుండా హీరో స్టార్డం, భారీ రిలీజ్ మరియు రిలీజ్ అయిన సీజన్ ని కూడా కలుపుకొని చెబుతాం.

తెలుగుబుల్లెటిన్.కామ్ రేటింగ్: 2.5/5

Click Here for Live Updates

<<<<  ‘డిస్కో రాజా’ మూవీ యుఎస్ ప్రీమియర్ షో లైవ్ అప్ డేట్స్  >>>>

డిస్కో రాజా మూవీ యుఎస్ ప్రీమియర్ షో లైవ్ అప్ డేట్స్ ప్రత్యేకంగా తెలుగు లో మీకోసం తప్పక విజిట్ చెయ్యండి తెలుగుబుల్లెటిన్.కామ్..

03:45AM: ‘డిస్కో రాజా’ సెకండ్ హాఫ్ రిపోర్ట్ :

డిస్కో రాజ్ పాత్ర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో మొదలైన సెకండ్ హాఫ్ మొదట్లో చాలా రేసీగా అనిపిస్తుంది. డిస్కో రాజ్ గ్యాంగ్ స్టర్ గా ఎదిగిన వైనం, సేతుతో శత్రుత్వం.. ఇలా చాలా ఆసక్తికరంగా ముందుకు వెళ్తుంది. అయితే ఒక దశ దాటాక సినిమాలో ఎమోషనల్ కనెక్ట్ అంతగా లేని కారణంగా రెగ్యులర్ రివెంజ్ డ్రామా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోవచ్చు. రివ్యూ మరికొద్ది సేపట్లో మీ ముందుకు వస్తుంది.

03:32AM: డిస్కో రాజ్ విలన్ ను మట్టుబెట్టడంతో సినిమా ముగుస్తుంది. వాసు తన కుటుంబ బాధ్యతను తీసుకుంటాడు

03:25AM: కథలో కొత్త ట్విస్ట్. కథ ప్రీ క్లైమాక్స్ కు చేరుకుంది అనే లోపల కొత్త కారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. అంథోనీ దాస్ పాత్రలో నటుడు మిమ్మల్ని షాక్ కు గురి చేస్తాడు

03:20AM: వాసు, డిస్కో రాజా, సేతు ఒకరిపై ఒకరు పగతో రగిలిపోతుంటారు. మూవీ ప్రీ క్లైమాక్స్ కు చేరుకుంటోంది.

03:15AM: పాయల్ ను రవితేజ పెళ్లి చేసుకున్న తర్వాత ఇవన్నీ వదిలేసి లడఖ్ వెళ్ళిపోతారు. అయితే అక్కడ అనుకోని ట్విస్ట్ ఒకటి ఎదురవుతుంది.

03:10AM: డిస్కో రాజ్ ఉన్న సీన్స్ తప్ప మిగిలినవి బోరింగ్ గా అనిపిస్తాయి.

03:05AM: ఆల్బమ్ లో సూపర్ హిట్ అయిన మెలోడీ సాంగ్ నువ్వు నాతో ఏమన్నావో వస్తోంది. రవితేజ. పాయల్ మధ్య సీన్స్ ను చక్కగా చిత్రీకరించారు.

03:00AM: రవితేజ, పాయల్ మధ్య సన్నివేశాలు సో సో గా ఉన్నాయి.

02:58AM: సినిమాలోకి పాయల్ రాజ్ పుత్ ఇంట్రడక్షన్. రవితేజ హిందీ డైలాగులు బాగున్నాయి. అయితే అవి కేవలం మల్టీప్లెక్స్ ఆడియన్స్ కు మాత్రమే నచ్చే అవకాశముంది.

02:54AM: సేతు మీద డిస్కో రాజ్ రివెంజ్ తీసుకుని జైలుకు పంపించే విధానం ఆసక్తికరంగా ఉండడమే కాకుండా చాలా బాగుంది. కామెడీ, స్టైల్ కలగలిసి ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. దర్శకుడు ఈ సీన్ ను చాలా బాగా రాసుకున్నాడు. అదే లెవెల్లో తెరకెక్కించాడు కూడా.

02:49AM: బర్మా సేతు, డిస్కో రాజ్ మధ్య సీన్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. సేతు యాక్టింగ్ చాలా బాగుంది. అతను డిస్కో రాజ్ పై పైచేయి సాధించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు

02:46AM: కథ మళ్ళీ ప్రస్తుత కాలానికి వచ్చింది. డిస్కో రాజ్ తాను డాన్ గా ఎదిగిన చెన్నై చేరుకున్నాడు.

02:44AM: చిరంజీవి కటౌట్ సీన్.. మెగా ఫ్యాన్స్ కు నచ్చుతుంది. కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది ఈ సీన్ లో

02:40AM: రమ్ పమ్ సాంగ్ మొదలైంది. ఒక నోస్టాల్జిక్ ఫీల్ కలుగుతుంది. కెమెరా, మ్యూజిక్, ఆర్ట్ వర్క్, డ్యాన్స్ మూవ్స్ అన్నీ అప్పటికాలానికి సింక్ లో ఉన్నాయి.

02:35AM: సత్య, రాంకీ, సునీల్ అందరూ డిస్కో రాజ్ గ్యాంగ్. అతను గ్యాంగ్ స్టర్ గా ఎదుగుతాడు

02:30AM: 1980 బ్యాక్ డ్రాప్ తో సెకండ్ హాఫ్ మొదలవుతుంది. డిస్కో రాజ్ గురించి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్

02:28AM:  డిస్కో రాజా ఫస్ట్ హాఫ్ రిపోర్ట్:

అక్కడక్కడా బోర్ కొట్టే కొన్ని సీన్స్ ని పక్కన పెట్టేస్తే, కథ పరంగా సిఎంమా సూపర్ స్పీడ్ లో సాగింది. ముఖ్యమ్గా ఇంటర్వెల్ కి 15 నిమిషాల ముందు నుంచి డిస్కో రాజా పాత్ర ద్వారా సూపర్బ్ హై ఫీలింగ్ వస్తుంది. థమన్ అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేసాడు. ఓవరాల్ గా గుడ్ ఫస్ట్ హాఫ్..

02:26AM: బాబీ సింహాకి రవితేజ ఇచ్చిన ట్విస్ట్ తో ఇంటర్వెల్

02:12AM: డిస్కో రాజాగా రవితేజ ఎంట్రీ ఫెంటాస్టిక్.. తన లుక్, మ్యానరిజమ్స్, యాక్షన్ స్టైల్ అండ్ థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్ ఉంది.

02:08AM: రవితేజ పాత్ర ద్వారా కథలో మరో కిక్ ఇచ్చే ట్విస్ట్..ఇప్పటి వరకూ సాగిన 30 నిమిసాగాల సినిమా బాగుంది, కానీ రెగ్యులర్ గా ఆశించే మాస్ మహారాజ స్టైల్ అయితే కనిపించలేదు.

02:04AM: రవితేజ తన ఓన్ ఐడెంటిటీ తెలుసుకోవడం వేసే మాస్టర్ ప్లాన్ బాగుంది..

02:00AM: రాంకీ – బాబీ సింహా మధ్య వచ్చే సీన్ అందరికీ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది.. డిస్కో రాజ్ విజువల్స్ పాడడం అదిరింది.

01:58AM: ఓపెనింగ్ స్నో మౌంటైన్ సీక్వెన్స్ మరియు దాని చూస్త్తూ ఉన్న సస్పెన్స్ తో డైరెక్టర్ చాలా ఇంటరెస్టింగ్ గా కథని ముందుకు తీసుకెళ్తున్నారు..

01:53AM: కథ మళ్ళీ ప్రెజంట్ కి వచ్చింది. అక్కడ అందరికీ షాక్ ఇచ్చే ట్విస్ట్.. మరొకవైపు రవితేజ ఫామిలీ అండ్ నరేష్ రవితేజ కోసం వెయిట్ చేస్తున్నారు.

01:47AM: సాంగ్ తర్వాత రవితేజ – వెన్నెల కిశోరె మధ్య వచ్చే కొన్ని సీన్స్ ప్రేక్షకులకి కొన్ని నవ్వులు ఇస్తాయి.

01:40AM: ఫ్లాష్ బ్యాక్ లో రవితేజ చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే కుర్రాడు.. ఢిల్లీ వాలా సాంగ్ చాలా బాగుంది. కథ ని డ్రైవ్ చేసే ఈ సాంగ్ ని చాలా బాగా పిక్చరైజ్ చేశారు..

01:35AM: ఈ సయింటిస్ట్ ల ప్రయోగంతో రవితేజ బ్రతికాడు..

01:30AM: అసలైన స్టోరీ ఇప్పుడే మొదలైంది.. కొంతమంది సయింటిస్ట్ లు అందరు కలిసి బ్రెయిన్ డెడ్ పీపుల్ కి లైఫ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు.. స్ట్రోక్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది.. చూడాలి డైరెక్టర్ ఎలా తీసులకెళ్తాడో..

01:24AM: బాబీ సింహా ‘సేతు’ పాత్రలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ఎంట్రీ ఇచ్చాడు.. సేతు చెన్నైకి చెందిన వాడు.

01:20AM: మూవీ ఢిల్లీకి షిఫ్ట్ అయ్యింది.. యంగ్ రవితేజ వాసుగా తెరకి పరిచయం అయ్యాడు..

01:15AM: డిస్కో రాజా సినిమా ఓపెన్ చేస్తే.. మైండ్ బ్లోయింగ్ స్నో మౌంటైన్స్ ఐల్యాండ్ లో ఓపెన్ అయ్యింది.. ‘గేమ్ ఇప్పుడే మొదలయ్యింది’ అనే రవితేజ వాయిస్ తో టైటిల్స్ మొదలయ్యాయి..

149 నిమిషాల నిడివితో అనగా 2 గంటల 29 నిమిషాల రన్ టైంతో, కాసేపట్లో ‘డిస్కో రాజా’ వరల్డ్ ఫస్ట్ యుఎస్ ప్రీమియర్ షో మొదలు కానుంది..

లైవ్ అప్ డేట్స్ : డిస్కో రాజా మూవీ యుఎస్ ప్రీమియర్ షో

మాస్ మహారాజ్ రవితేజ ద్విపాత్రాభినయంలో, మూడు షేర్స్ ఉన్న పాత్రల్లో మొదటిసారి చేసిన సైన్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా ‘డిస్కో రాజా’..

 

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

రాజకీయం

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

ఎక్కువ చదివినవి

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...
నటీనటులు: రవితేజ, పాయల్ రాజ్పుత్, నాభ నటేష్, తన్య హోప్ నిర్మాత: రమేష్ తాళ్లూరి దర్శకత్వం: విఐ ఆనంద్ సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని మ్యూజిక్: థమన్ ఎస్ ఎడిటర్‌: శ్రవణ్ కటికనేని రన్ టైం: 2 గంటల 29 నిముషాలు విడుదల తేదీ: జనవరి 24, 2020 వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న మాస్ మహారాజ్ రవితేజ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్ డైరెక్షన్ లో చేసిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా 'డిస్కో రాజా'. ...రవితేజ 'డిస్కో రాజా' మూవీ రివ్యూ