Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాళీ దొరికితే కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తూ ఉంటాడు. తాజాగా తన భార్య రితికాశర్మ సోదరుడి పెళ్లి వేడుకలో సందడి చేశాడు. సంగీత్ వేడుకలో ఓ బాలీవుడ్ పాటకు స్టెప్పులేస్తూ హుషారుగా కనిపించాడు.ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. రోహిత్ శర్మా ను ఇలా చూడటం ఇదే తొలిసారి అంటూ అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు టీమ్ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఈరోజు నుంచి వన్డే సిరీస్ ప్రారంభమైంది. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ సిరీస్ కు సారథ్యం వహిస్తాడు. వ్యక్తిగత కారణాలవల్ల వన్డే సిరీస్ కు రోహిత్ అందుబాటులో ఉండడంటూ ఇదివరకే బీసీసీఐ ప్రకటించింది. అప్పుడు సరైన కారణాలేవి వెల్లడించలేదు.
ఫ్యామిలీతో సమయం గడపడానికి రోహిత్ ఈ సిరీస్ కు దూరమై ఉంటాడని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
Rohit Sharma and co dancing during his Brother-in-law marriage function. pic.twitter.com/p6IsnFYUf1
— Johns. (@CricCrazyJohns) March 17, 2023