Nani: ఇటివల ఓ చర్చా కార్యక్రమంలో దర్శకుడు వెంకటేశ్ మహా కేజీఎఫ్ ను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ పై హీరో నాని స్పందించారు. ఆ కార్యక్రమాన్ని తాను చూశానని వెంకటేశ్ మహా అలా మాట్లాడాల్సింది కాదన్నారు. ఆయన నటించిన దసరా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వివాదంపై స్పందిస్తూ..
‘సినిమా చూసి బయటకొచ్చి ఫ్రెండ్స్ తో ఓ రకంగా మాట్లాడతాం. ఇంటర్వ్యూల్లో మాత్రం అదే పాయింట్ ను మరోలా చెప్తాం. దురదృష్టావశాత్తూ అక్కడ సినిమాలపై జరుగుతున్న చర్చ ధియేటర్ బయట మాట్లాడుతున్నట్టు జరిగింది. దీంతో వెంకటేశ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కొంచెం జాగ్రత్తగా మాట్లాడి ఉండాల్సింది. వివాదంపై దర్శకుడు వివరణ ఇచ్చాడు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడను’.
‘అక్కడున్న దర్శకులు అందరితో నేను పని చేశాను. వాళ్లందరికీ కమర్షియల్ సినిమాలంటే చాలా ఇష్టం. ఓ వ్యక్తి తన అభిప్రాయం చెప్తున్నప్పుడు అక్కడున్న మిగిలినవాళ్లు నవ్వడం సహజం. చిన్న వీడియో క్లిప్ ద్వారా తప్పుగా తీసుకుని అందరినీ విమర్శించకూడదు’ అని అన్నారు.
97835 49328Thanks so considerably for yet another post. I be able to get that kind of data data. friend, and exactly. 42984