Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 10 సెప్టెంబర్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.5:51
సూర్యాస్తమయం: సా.6:07
తిథి: భాద్రపద శుద్ధ చవితి రా.12:26 వరకు తదుపరి పంచమి
సంస్కృతవారం: భృగువాసరః (శుక్రవారం)
నక్షత్రము: చిత్త సా.4:11 వరకు తదుపరి స్వాతి
యోగం: బ్రహ్మం రా.8:44 వరకు తదుపరి ఐంద్రం
కరణం: వనిజ మ.1:28 వరకు తదుపరి విష్టి
వర్జ్యం: రా.9:28 నుండి 10:58 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:18 నుండి 9:06 వరకు తదుపరి మ.12:21 నుండి 1:09 వరకు
రాహుకాలం: ఉ.10:30 నుండి మ.12:00 వరకు
యమగండం: మ.3:00 నుండి సా.4:30 వరకు
గుళికా కాలం : ఉ.7:38 నుండి 9:10 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:31 నుండి తె.5:19 వరకు
అమృతఘడియలు: ఉ‌.10:06 నుండి 11:37 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:48 నుండి మ.12:37 వరకు

ఈరోజు. (10-09-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వామితో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఉద్యోగాలలో ఆశించిన హోదాలు పొందుతారు.

వృషభం: ముఖ్యమైన వ్యవహారాలలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది ప్రముఖుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వస్తు వాహన లాభాలు ఉన్నాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

మిథునం: చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

కర్కాటకం: నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట ఆలోచనలు అంతగా కలిసి రావు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి వ్యాపారాలు సమర్థవంతంగా నిర్వహించలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు.

సింహం: సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పని చేసి ప్రశంసలు అందుకుంటారు.

కన్య: బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహారించాలి.

తుల: స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

వృశ్చికం: ఇంటా బయట పరిస్థితులు అంతగా అనుకూలించవు. వృధా ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో స్వల్ప మాటపట్టింపులుంటాయి. ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడుతాయి. వృత్తి వ్యాపారాలలో కొంత గంధరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.

ధనస్సు: వృత్తి వ్యాపారాలలో నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు. స్థిరస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. చేపట్టిన పనులు చకచకా పూర్తి అవుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా చేస్తారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

మకరం: చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు.కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

కుంభం: ఒత్తిడి అధికమైన నిదానంగా పనులు పూర్తి చేస్తారు. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. నూతన వ్యాపార పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

మీనం: ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు నూతన ఋణ ప్రయత్నాలు అంతగా అనుకూలించవు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి దూరప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...