Switch to English

‘టక్‌ జగదీష్‌’ మూవీ రివ్యూ

Critic Rating
( 2.50 )
User Rating
( 3.60 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow
Movie టక్ జగదీష్
Star Cast నాని, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్
Director శివ నిర్వాణ
Producer సాహు గరపాటి, హరీష్ పెద్ది
Music తమన్
Run Time 2 hr 23 mins
Release సెప్టెంబర్ 10 2021

నాని గత ఏడాది ‘వి’ సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సమయంలో నాని ముందు మరో ఆప్షన్‌ లేకుండా పోయింది కనుక పర్వాలేదు అనుకున్నారు. కాని ఈసారి కూడా టక్ జగదీష్ ను కూడా ఓటీటీ ద్వారా విడుదల చేయడం పట్ల విమర్శలు వ్యక్తం అయ్యాయి. నాని ని డబ్బు కోసం కక్కుర్తి పడ్డాడు అంటూ విమర్శించారు. ఎన్ని విమర్శలు వచ్చినా తన నిర్ణయాన్ని సమర్థించుకున్న నాని అభిమానులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఇన్ని విమర్శల మద్య భారీ అంచనాల నడుమ అమెజాన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన టక్ జగదీష్‌ ఎలా ఉన్నాడు అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ

భూదేవిపురంకు చెందిన కథ ఈ సినిమా. ఆ గ్రామ పెద్ద ఆదిశేషు నాయుడు(నాజర్‌) చిన్న కొడుకు జగదీష్ నాయుడు(నాని). ప్రతి విషయంలో కూడా ఆదిశేషు నాయుడు గ్రామస్తులకు అండగా ఉంటాడు. గ్రామంలోని కొందరి వల్ల ప్రజలు ఇబ్బంది పడటంతో తన భూములను గ్రామస్తులకు ఇచ్చేందుకు సిద్దం అవుతాడు. ఆ సమయంలోనే ఆదిశేషు నాయుడు అనారోగ్యంతో చనిపోతాడు. కుటుంబ బాధ్యతను చనిపోయే ముందు పెద్ద కొడుకు బోసుబాబు(జగపతిబాబు) కు అప్పగిస్తాడు. ఆస్తి మొత్తం తనకే కావాలని బోసుబాబు భావించి కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఇవ్వకూడదని అనుకుంటాడు. కుటుంబంను దూరం చేసుకోవడంతో పాటు తమ్ముడు జగదీష్ ను కూడా దుర్మార్ఘులతో కలిసి చంపించేందుకు ప్రయత్నిస్తాడు. విడిపోయిన కుటుంబంను జగదీష్ నాయుడు ఎలా కలిపాడు.. భూదేవిపురంలో భూ తగాదాలు లేకుండా ఎలా చేశాడు అనేది కథ.

తెరమీద స్టార్స్‌

నాని టక్ జగదీష్‌ పాత్రకు ప్రాణం పోశాడు. నాచురల్‌ స్టార్‌ నాని అన్నందుకు మరోసారి నిరూపించుకున్నాడు. సినిమాలో నాని కాకుండా టక్ జగదీష్ కనిపించాడు. కుటుంబం కోసం.. జనాల కోసం.. గ్రామం కోసం అతడు పడే తాపత్రయంను చూడవచ్చు. నాని అద్బుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. రొమాంటిక్ సన్నివేశాలు లేకపోవడం కాస్త లోటు అయినా యాక్షన్‌ సన్నివేశాల్లో ఇరగదీశాడు. ఇక తనదైన శైలిలో కామెడీ పంచ్ లతో ఆకట్టుకున్నాడు. మొత్తంగా టైటిల్ ను ఎలా అయితే మోశాడో అలాగే సినిమా మొత్తంను కూడా తన భుజాల మీద మోశాడు. ఇక హీరోయిన్స్‌ రీతూ వర్మ మరియు ఐశ్వర్య రాజేష్ లు ఉన్నంతలో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ట్యాలెంటెడ్‌ హీరోయిన్ అయిన ఐశ్వర్య రాజేష్ ను పూర్తిగా వాడుకోవడంకు లేకుండా పోయింది. జగపతిబాబుకు కూడా తన స్థాయికి తగ్గ పాత్ర దక్కలేదు. బోసుబాబు పాత్ర కు ఆయన పూర్తిగా న్యాయం చేయలేక పోయాడేమో అనిపించింది. ఇంకా సినిమాలో చాలా మంది ఉన్నారు. వారుం అంతా కూడా సినిమాలో అలా వచ్చి ఇలా వెళ్లే వారు. ఎవరికి పెద్దగా నటించే స్కోప్‌ దక్కలేదు.

తెర వెనుక టాలెంట్

దర్శకుడు ఎంపిక చేసుకున్న కథ బాగుంది. కాని దాన్ని నడిపించిన తీరు విషయంలో కాస్త గతి తప్పినట్లుగా అనిపించింది. ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్‌ ను కాస్త ఎంటర్‌ టైన్మెంట్‌తో ఆకట్టుకునే ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో నడిపించే అవకాశాలు ఉన్నాయి. కాని ఆయన ఎమోషనల్‌ గా యాక్షన్‌ సన్నివేశాలతోనే నడిపించేందుకు ప్రయత్నించాడు. థమన్ అందించిన పాటలు బాగున్నాయి కాని గోపీ సుందర్‌ అందించిన బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ విషయంలో పెద్దగా చర్చించేందుకు ఏమీ లేదు అన్నట్లుగా ఉంది. కొన్ని సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ నిద్ర పుచ్చే విధంగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లె అందాలను సహజంగా చూపించాడు. డైలాగ్స్ కొన్ని బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. ముఖ్యంగా సెకండ్‌ హాఫ్‌ సన్నివేశాలు సాగతీసినట్లుగా ఉన్నాయి. నిర్మాణాత్మక విలువలు కథానుసారంగా బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్

  • నాని నటన,
  • ఫ్యామిలీ సన్నివేశాలు,
  • పాటలు.

బోరింగ్ మోమెంట్స్

  • సాగతీసినట్లుగా ఉన్న కథనం
  • సెకండ్ హాఫ్
  • కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం
  • క్లైమాక్స్ మరీ పేలవంగా ఉంది.

విశ్లేషణ

ఇప్పటికే నిన్ను కోరి వంటి విభిన్నమైన సక్సెస్ ను అందించిన శివ నిర్వానను నాని ఎక్కువగా నమ్మినట్లుగా ఉన్నాడు. కథనం విషయంలో ఇంకాస్త శ్రద్ద పెట్టించి సెకండ్‌ హాఫ్‌ సన్నివేశాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఖచ్చితంగా మరో నిన్ను కోరి అయ్యేది. నాని సినిమా మొత్తం తానై కనిపించాడు. కాని ఇతర కాస్టింగ్‌ కు ప్రాముఖ్యత లేకపోవడం.. అంత మంది ఉన్నా కూడా గందరగోళంగా ఉండటం.. కొన్ని సన్నివేశాలు మరీ అసహజంగా ఉండటం జరిగింది. సినిమా ఎంత జాగ్రత్తగా చూసినా కూడా ఆ కుటుంబ సభ్యుల మద్య రిలేషన్ ఏంటీ.. ఆస్తి గొడవ ఏంటీ ఎంత మంది ఆదిశేషు నాయుడుకు సొంత బిడ్డలు అనే కన్ఫ్యూజన్ సాదారణ ప్రేక్షకుడికి కలిగేలా ఉంది. మొత్తానికి ఫస్ట్‌ హాఫ్‌ సరదాగా సాగింది.. సెకండ్‌ హాఫ్‌ అలా అలా నడిచింది.. మొత్తంగా నాని కోసం చూడదగ్గ సినిమా.

చూడాలా? వద్దా?: ఓటీటీనే కనుక అమెజాన్‌ ఉంటే ఓ సారి చూసేయొచ్చు.

తెలుగు బుల్లెటిన్ రేటింగ్‌: 2.5/5

51 COMMENTS

  1. Нужна стяжка пола в Москве, но вы не знаете, как выбрать подрядчика? Обратитесь к нам на сайт styazhka-pola24.ru! Мы предлагаем услуги по устройству стяжки пола любой площади и сложности, а также гарантируем доступные цены и высокое качество работ.

  2. Hi! I know this is somewhat off-topic but I had to ask. Does operating a well-established blog like yours take a lot of work? I’m completely new to operating a blog but I do write in my diary daily. I’d like to start a blog so I will be able to share my own experience and views online. Please let me know if you have any suggestions or tips for new aspiring bloggers. Appreciate it!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

Raadhika : నటి రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంను బీజేపీ నటి రాధిక కు ఇవ్వడం జరిగింది. గత కొంత...

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ చరణ్ (Ram Charan) – క్రియేటివ్...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న టిల్లు స్క్వేర్ పై అంచనాలు పెరుగుతూనే...

Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ సందడి షురూ

Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఏప్రిల్‌ 5న విడుదల...