Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 27 నవంబర్ 2020

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉదయం 06:31
సూర్యాస్తమయం: సాయంత్రం 05:35
తిథి: ద్వాదశి ఉదయం 7 46 వరకు తదుపరి త్రయోదశి
వారం : భృగు వాసరం
నక్షత్రం: అశ్విని రాత్రి 12:21 వరకు
యోగం: వ్యతీపాత ఉదయం 8:21 వరకు
కరణం: బాలవ ఉదయం 7:46 వరకు తదుపరి కౌలవ 9:04 వరకు
వర్జ్యం: ఉదయం 11.09 నుండి మధ్యాహ్నం 12 57 వరకు
దుర్ముహూర్తం : ఉదయం 08:44 నుండి ఉదయం 9 28 వరకు తదుపరి మధ్యాహ్నం 12 25 నుండి 1 10 వరకు
రాహుకాలం: ఉదయం 10 40 నుండి మధ్యాహ్నం 12 3 వరకు
యమగండం: 02:49 నుండి 02:49 నుండి సాయంత్రం 4:12 వరకు
బ్రాహ్మీ ముహూర్తం : తెల్లవారుజామున 5:43 వరకు
అమృతఘడియలు: సాయంత్రం 04:28 నుండి సాయంత్రం 6.16 వరకు
అభిజిత్ ముహూర్తం : ఉదయం 11:41 నుంచి మధ్యాహ్నం 12 25 వరకు

27.11.2020 రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఉద్యోగ విషయమై పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. సంతానం విద్యా విషయాల పట్ల ఏకాగ్రత తగ్గుతుంది. బంధు మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వ్యక్తిగత వ్యవహారాలలో కొంత అసౌకర్యం . అవసరాలకు తగిన సహాయం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప ధన నష్టాలుంటాయి.

వృషభం: ఇతరుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసు కోవడం అవసరం. ఖర్చులు అదుపుచేయడం మంచిది. వృత్తి వ్యాపారాలు కొంత ప్రయోజనకరంగానూ ఉంటాయి. సోదరుల మధ్య ఆకస్మిక కలహ సూచనలు. కుటుంబ సభ్యులతో పుణ్య క్షేత్ర సందర్శనాలు. ఉద్యోగమున పనిభారం పెరుగుతుంది.

మిథునం: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు కలుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది నేర్పుతో పనులను పూర్తి చేస్తారు. విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగులకు పరీక్షా కాలం. భాగస్వామ్య వ్యాపారమున విభేదాలు కలుగుతాయి.

కర్కాటకం: ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తిచేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. సంఘమున గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారంలో కుటుంబ సభ్యుల నుండి స్వల్ప అసంతృప్తి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగమున అనుకూలత.

సింహం: ఉద్యోగ విషయమై సహా ఉద్యోగుల సహాయంతో పనులు పూర్తిచేసి ప్రశంసలు పొందుతారు. వస్త్ర, వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. కోపం అదుపులో ఉంచుకోవడం మంచిది . కొన్ని వ్యవహారాలు ఆందోళన, చికాకులను కలిగిస్తాయి. ధన సంబంధిత విషయాలలో స్థిరత్వం ఉండదు.

కన్య: ఆరోగ్య విషయమై జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో అవరోధాలు ఏర్పడినా విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగమున అదనపు పని భారం వలన ఒత్తిడి అధికమౌతుంది. చిరు వ్యాపారులకు నిరాశ తప్పదు. చెయ్యని పనికి ఇతరులతో నిందలు పడవలసి రావచ్చు. నిరుద్యోగులకు ప్రయత్నాలలో జాప్యం తప్పదు.

తుల: చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. దూర ప్రాంతాల బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఆస్తికి సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో కొత్త అవకాశములు లభిస్తాయి. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది.

వృశ్చికం: సమాజములో తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున హోదా పెరుగుతుంది. ప్రభుత్వ పరమైన చర్చలకు అనుకూలం.

ధనస్సు: సంఘములో నూతన పరిచయాల వలన కొత్త అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణమునకు కొత్త ఋణాలు చెయ్యవలసి రావచ్చు. వృత్తి, వ్యాపారాలలో అవరోధాలు ఎదురైనా అధిగమిస్తారు. అవసరానికి కుటుంబ సభ్యుల నుంచి సహాయం లభిస్తుంది. ఉద్యోగమున అధికారులతో అనుకూలత.

మకరం: దూర ప్రాంత బంధువుల రాకతో గృహమున సంతోష వాతావరణం. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. దీర్ఘకాలిక ఋణాలు తీర్చుటకు కొత్త అవకాశములు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

కుంభం: దీర్ఘకాలిక అనారోగ్యముల నుండి ఉపశమనం లభిస్తుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం వలన ధన సమస్యలు నుండి బయటపడతారు. దూర ప్రాంతాల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగమున అధికారులనుండి ప్రశంసలు పొందుతారు.

మీనం: ఇంటాబయటా అనుకూల వాతావరణం. పనులలో జాప్యం జరిగినా సకాలంలో పూర్తిచేస్తారు. ఋణ ఒత్తిడుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ద వహించాలి. సోదరుల సహాయ సహకారములతో గృహ నిర్మాణమునకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి జగన్నాధ్’

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో స్టయిల్స్, మేనరిజమ్స్ ఫాలో అవుతారు ఫ్యాన్స్....

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...