బాధ్యతగా ఉండాల్సిన తండ్రి తనకు సంబంధం లేదని వెళ్ళిపోయాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి తనకు కూడా సంబంధం లేదని వీధిలో వదిలేసి వెళ్ళిపోయింది. దీంతో ముగ్గురు చిన్నారులు యాదగిరిగుట్టలో అనాథలుగా తిరుగుతుండగా అనుమానం వచ్చిన ట్రాఫిక్ పోలీస్ కోటి యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు.
పోలీసులు ఆరా తీయగా ఆ ముగ్గురి పిల్లల వయసు 8, 7, 5 సంవత్సరాలుగా తెలిసింది. తమది సరూర్ నగర్ లోని భగత్ సింగ్ కాలనీ అని పెద్ద కుమారుడు తెలిపాడు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే తన తల్లి, ఒక ఆటో డ్రైవర్ తో ఆటోలో వచ్చి తమ చేతులు, కాళ్ళు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కేసి యాదగిరిగుట్టలో వదిలేసారు.
తండ్రి ముందరే వదిలేయగా, తన సహజీవనానికి అడ్డుగా ఉన్నారని తల్లి కూడా బిడ్డలను వద్దనుకుంది. ప్రస్తుతం వారు శిశు సంరక్షణ కేంద్రాలలో ఉన్నారు.