సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ వీరసింహారెడ్డి సక్సెస్ ను పురస్కరించుకుని చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెషన్ హాల్లో సెలబ్రేషన్స్ నిర్వహించింది. చిత్ర యూనిట్ పాల్గొన్న ఈ ఈవెంట్ సందడిగా జరిగింది. బాలకృష్ణ తనదైన శైలిలో హుషారు తెప్పించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు హరీశ్ శంకర్, యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ పాల్గొన్నారు. అయితే.. ఫంక్షన్ కు సంబంధించి ఓ పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఫంక్షన్ పూర్తయ్యాక చిత్ర యూనిట్ పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిత్రంలో ముఖ్య పాత్రలో నటించిన హనీ రోజ్ తో బాలకృష్ణ షాంపేన్ తాగుతున్న ఫొటో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ-హనీ రోజ్ ఒకరికొకరు.. తమ చేతులను కలిపుకుంటూ షాంపేన్ తాగుతూ చిల్ అవుతున్న ఫొటో బాగా వైరల్ అవుతోంది. బాలకృష్ణ ఫ్యాన్స్ ఈ పిక్ చూసి బాలయ్య స్పెషల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Really it is special treat for Bala krihna and his fans