Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: సోలో హీరోగా తొలి శతదినోత్సవ సినిమా ‘కోతలరాయుడు’

91,428FansLike
56,272FollowersFollow

కెరీర్ తొలినాళ్లలో చిరంజీవి సినిమా అంటే.. ఈ కుర్రాడు ఎవరు..? బాగా నటిస్తున్నాడు.. కళ్లలో ఫైర్ ఉంది.. అంటూ ఆసక్తిగా చూశారు. విలన్ గా చేసినా.. చిన్న పాత్రల్లో నటించినా.. నలుగురిలో ఒకరిగా నటించినా పరిశ్రమ, ప్రేక్షకుల చూపు తనవైపే ఉండేలా నటించి చిరంజీవి తన ప్రత్యేకత చాటుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి సినిమా అంటే మినిమమ్ కలెక్షన్లు గ్యారంటీ, ఆపై 100 రోజులు.. ఇప్పుడు 100 కోట్లు కలెక్షన్లు.. ఇలా కొనసాగుతోంది చిరంజీవి స్టామినా. ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలు కూడా 100 రోజులు ఆడినవి చిరంజీవికి మాత్రమే ఉన్నాయి. కెరీర్లో ఎన్నో శతదినోత్సవ సినిమాలు ఉన్న చిరంజీవికి సోలో హీరోగా తొలి 100 రోజుల సినిమా.. ‘కోతలరాయుడు’.

ప్రేక్షకుల నాడిని పట్టి..

అప్పటికే తన నటనలోని ప్రత్యేకతతో పరిశ్రమ, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిరంజీవికి ‘కోతలరాయుడు’ కెరీర్లో పదో సినిమా. 1979 సెప్టెంబర్ 15న విడుదలైన ఈ సినిమాలో చిరంజీవి సోలో హీరోగా పూర్తిస్థాయిలో నటించారు. అప్పటికి ఒకట్రెండు సినిమాలు మరో హీరోతో కలిసి నటించారు. కానీ.. కోతలరాయుడు ప్రత్యేకత ఏంటంటే.. చిరంజీవికి సోలో హీరోగా తొలి 100 రోజుల సినిమా కావడమే. కెరీర్లో ఎన్నో 100 రోజుల సినిమాలు చేసిన చిరంజీవికి ఇదే తొలి అడుగు. ఇటువంటి ఘనత ఎవరికైనా సంబరమే. అయితే.. ఆ రికార్డును నిలబెట్టుకోవడంలో.. సరైన కథల ఎంపికలో.. ప్రేక్షకులను మెప్పించేలా నటించడమే అసలైన సవాలు. దానిని చిరంజీవి చాలా శ్రద్ధతో చేశారు. ప్రేక్షకుల నాడిని పట్టారు.

సోలో హీరోగా తొలి శతదినోత్సవ సినిమా ‘కోతలరాయుడు’

విలన్ గా.. హీరోగా..

సినిమాలో చిరంజీవి రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. అప్పటివరకూ విలన్ గా.. నలుగురిలో ఒక హీరోగా నటించిన చిరంజీవి.. ఈ సినిమాలో మొదట విలన్ గా తర్వాత హీరోగా మారే పాత్రలో నటించి వైవిధ్యం చూపించారు. ఇదే కథలో కీలకం. అదే సినిమా సక్సెస్ కు ఫార్ములా అయింది. ఒకే సినిమాలో చిరంజీవిని రెండు రకాలుగా ఆయన నటనను చూశారు. అమ్మాయిలను ఆటపట్టించే ఆకతాయిగా.. వారి జీవితాలతో ఆడుకునే విలన్ పాత్ర ఒకటి.. తర్వాత పరిస్థితుల దృష్ట్యా మారిపోయి.. జీవితంలో మంచివాడిగా మారే హీరో పాత్ర. ఇదే ప్రేక్షకులకు నచ్చింది. ఈ సినిమాతో చిరంజీవికి మంచి పేరు వచ్చింది. ఆయనలో హీరో మెటీరియల్ తోపాటు ఆయనతో సినిమాలకు పెట్టుబడి పెట్టొచ్చు అనే నమ్మకాన్ని ఇచ్చింది ఈ సినిమా.

సోలో హీరోగా తొలి శతదినోత్సవ సినిమా ‘కోతలరాయుడు’

 

రోజంతా ఎండలో..

ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ సారధ్యంలో కె.వాసు దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది. చిరంజీవిలోని వినయం, నటన వారికి నచ్చడంతో తమ్మారెడ్డి తన సినిమాలో హీరోగా తీసుకున్నారు. ఓరోజు షూటింగ్ కు లేట్ గా వచ్చిన చిరంజీవిని రోజంతా ఎండలో నిలబెట్టారని.. తనవల్లే షూటింగ్ ఆలస్యం కావడంతో నిర్మాత చెప్పినట్టే చిరంజీవి చేశారని ఓ ఇంటర్వ్యూలో తులసి చెప్పుకొచ్చారు. తమ్మారెడ్డి కూడా చిరంజీవి నిబద్ధతే ఆయన్ను నిలబెట్టిందని అంటారు. చిరంజీవికి సోలో హీరోగా తొలి 100 రోజుల సినిమా ఇచ్చిన ఘనత తనదేనని కూడా ఓ సందర్భంలో చెప్పారు తమ్మారెడ్డి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్‌ బాస్ 6 అభినయ శ్రీ గురించి ఆసక్తికర విషయాలు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో తొమ్మిదవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన అభినయ శ్రీ కనీసం ఐదారు వారాలు అయినా ఉంటుందని చాలా...

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

రాజకీయం

మునుగోడు పంచాయితీ.! అన్నీ జాతీయ పార్టీలేనా.?

తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడో ఖాయమైపోయింది. ఇప్పుడు ఉప ఎన్నిక నగారా కూడా మోగేసింది. నవంబర్ మొదటి వారంలో ఫలితం కూడా తేలిపోతుంది. కాంగ్రెస్, బీజేపీ తరఫున అభ్యర్థులు ఖరారైపోయారు....

అమరావతి రైతుల పాదయాత్రపై వైసీపీ ఉక్కుపాదం: ఉత్తరాంధ్ర వరకూ వెళ్ళదా.?

అమరావతి రైతుల పాదయాత్రపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉక్కు పాదం మోపనుందా.? అటు ప్రభుత్వం తరఫున, ఇటు పార్టీ తరఫున ఆటంకాలు సృష్టించేందుకు వ్యూహాలు సిద్ధమవుతున్నాయా.? ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున నానా...

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

ఎక్కువ చదివినవి

బిగ్‌ బాస్ 6 శ్రీ సత్య గురించి ఆసక్తికర విషయాలు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో ఆరవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన తెలుగు అమ్మాయి క్యూట్ ముద్దుగుమ్మ శ్రీ సత్య. హౌస్ లో కి ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే తనకు...

అభిమానులు తడుస్తున్నారని.. తానూ వర్షంలో తడిసిన మెగాస్టార్..

ఆసక్తి గా సాగుతోన్న గాడ్ ఫాదర్ ప్రీ రిలీస్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడటానికి ముందు వర్షం ప్రారంభమైంది. వెంటనే చిరు ను మాట్లాడమని స్టేజి మీదకు పిలిచారు. చిరంజీవి మాట్లాడుతూ తను...

మహేష్ బాబు ఇంట్లో దొంగతనంకు ప్రయత్నం.. సీన్‌ రివర్స్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో ఒరిస్సాకు చెందిన వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించిన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి పొద్దు పోయిన తర్వాత ఒరిస్సా కు చెందిన కృష్ణ...

పూరిని కావాలని కెలుకుతున్న బండ్ల గణేష్‌

పూరి జగన్నాథ్ తనయుడి సినిమా యొక్క ప్రమోషనల్ ఈవెంట్ కు వెళ్లి అక్కడ పూరి జగన్నాథ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్ తాజాగా మరోసారి వివాదాస్పదంగా మాట్లాడాడు. పూరి జగన్నాథ్‌...

సీత నిన్ను ఇంత త్వరగా ఇలా చూస్తాం అనుకోలేదు

ఉత్తరాది ముద్దుగుమ్మ మృనాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకు సీతారామం సినిమాతో పరిచయమైన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ దక్కించుకోవడంతో పాటు హీరోయిన్ గా కూడా మంచి పేరు ను సొంతం...