సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గార్గి. ఈ సినిమా మొదటి నుండి డీసెంట్ సినిమా అన్న భావన కలిగించింది. ప్రోమోలు కూడా ప్రామిసింగ్ గా అనిపించాయి. ఇక ప్రీమియర్ టాక్ కూడా పాజిటివ్ గా వచ్చింది. ఈరోజు విడుదలైన గార్గి ఎలా ఉందో చూద్దామా.
కథ:
గార్గి (సాయి పల్లవి) ఒక స్కూల్ టీచర్ గా పనిచేస్తుంటుంది. అయితే ఒక అపార్ట్మెంట్ వద్ద సెక్యూరిటీ గార్డ్ గా చేస్తోన్న తన తండ్రి బ్రహ్మానందంను పోలీస్ లు అరెస్ట్ చేసారని తెలుసుకుని షాక్ కు గురవుతుంది.
ఇంతకీ బ్రహ్మానందంను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేసారు? బ్రహ్మానందం చేసిన తప్పేంటి? గార్గి ఈ కేసులో ఎలా పోరాడింది? చివరికి ఎలాంటి తీర్పు వచ్చింది?
నటీనటులు:
సాయి పల్లవి ఎలాంటి నటి అన్నది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్ర పడిందంటే సాయి పల్లవి ఏ రేంజ్ లో పెర్ఫర్మ్ చేస్తుంది అనడానికి గార్గి ఒక ఉదాహరణ. తన తండ్రిని అరెస్ట్ చేసారు అని తెలిసిన దగ్గర నుండి సాయి పల్లవి పాత్ర ఈ చిత్రంలో పడిన స్ట్రగుల్ తో మనం కనెక్ట్ అవుతాం. టిపికల్ మిడిల్ క్లాస్ యువతి పాత్రలో ఒదిగిపోయింది సాయి పల్లవి. ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకుంది.
లాయర్ పాత్రలో కాళీ వెంకట్ చక్కగా నటించాడు. ఆడియన్స్ కు ఈ పాత్ర బాగా కనెక్ట్ అవుతుంది. ఐశ్వర్య లక్ష్మి చేసిన పాత్ర కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇక మిగతా కీలక పాత్రల్లో నటించిన వారు కూడా ఇంప్రెస్ చేస్తారు.
సాంకేతిక నిపుణులు:
గౌతమ్ రామచంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఒక సెన్సిటివ్ ఇష్యూ ఆధారంగా రూపొందింది. ఇలాంటి కథను ఎగ్జిక్యూట్ చేసినందుకు కచ్చితంగా దర్శకుడ్ని అభినందించాలి. గోవింద్ వసంత అందించిన సంగీతం చాలా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో ఒక ఫీల్ ఉంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ ఓకే.
లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్ర నిర్మాణ విలువలు బాగున్నాయి.
పాజిటివ్ పాయింట్స్:
- సాయి పల్లవి
- కాన్సెప్ట్
- కాళీ వెంకట్
నెగటివ్ పాయింట్స్:
- కమర్షియల్ యాంగిల్ మిస్ అవ్వడం
- నరేటివ్ మొత్తం సీరియస్ గా సాగడం
విశ్లేషణ:
గార్గి అనేది సెన్సిటివ్ ఇష్యూ చుట్టూ అల్లుకున్న ఒక సీరియస్ సోషల్ డ్రామా. అన్ని వర్గాల ప్రేక్షకులకు రుచించేది కాదు. అయితే సాయి పల్లవి, కాళీ వెంకట్ ల పెర్ఫార్మన్స్, ఎక్కడా చిత్రాన్ని డీవియేట్ అవ్వకుండా తెరకెక్కించిన విధానాన్ని మెచ్చుకోవాలి. ఇంటెన్స్ సోషల్ డ్రామాలు ఇష్టపడే వారికి గార్గి కచ్చితంగా ఒక మంచి ఛాయస్.
తెలుగు బులెటిన్ రేటింగ్: 2.75/5