తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా అక్కినేని కుటుంబం ఉత్సవాలు నిర్వహిస్తోంది. తెలుగు సినిమా వైభవాన్ని చాటిన మహా నటుల్లో అయన కూడా అగ్రభాగాన నిలుస్తారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు గొప్పదనాన్ని వివరిస్తూ ట్వీట్ చేశారు. అక్కినేని నాగార్జున వారి కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి చిరంజీవి మెకానిక్ అల్లుడు సినిమాలో నటించారు.
శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాను.
ఆయన తెలుగు సినిమా కే కాదు భారతీయ సినీ చరిత్ర లోనే ఓ దిగ్గజ నటుడు. ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనా పటిమ, తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. తెలుగు సినిమా బ్రతికినంత వరకు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచి వుంటారు.
ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా శ్రీ అక్కినేని కుటుంబంలోని ప్రతి ఒక్కరికి , నా సోదరుడు @iamnagarjuna కి, నాగేశ్వరరావుగారి కోట్లాది అభిమానులకు, సినీ ప్రేమికులందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు !!
శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాను. 🙏🙏
ఆయన తెలుగు సినిమా కే కాదు భారతీయ సినీ చరిత్ర లోనే ఓ దిగ్గజ నటుడు. ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనా పటిమ, తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని… pic.twitter.com/yrAxhk7pgb
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 20, 2023