Switch to English

జైలు నుంచి చంద్రబాబు బయటకు వచ్చే దారేదీ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,470FansLike
57,764FollowersFollow

రోజులు గడుస్తున్నాయ్.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుకి ఇంకా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ వ్యవహారంలోనే న్యాయస్థానం నుంచి ఊరట దక్కలేదు.! ఈలోగా మరికొన్ని కేసులు ఆయన కోసం ఎదురు చూస్తున్నాయ్.!

‘చంద్రబాబుని కుట్రపూరితంగా అరెస్టు చేశారు.. ఏపీ సీఐడీ ఆయన్ని విజయవాడకు తరలించేలోపు, ఈ కేసు నుంచి ఆయన బయటపడతారు..’ అని అప్పట్లో బలంగా చెప్పిన తెలుగు తమ్ముళ్ళు, జరుగుతున్న పరిణామాలపై ఎలా విశ్లేషించాలో అర్థం కాక జుట్టుపీక్కుంటున్నారు.

ఇదేమీ వేల కోట్ల స్కామ్ కాదని చిన్నగా మాట్లాడలేం. స్కామ్ అంటూ జరిగి వుంటే, లక్ష రూపాయలైనా, కోటి రూపాయలైనా.. వంద కోట్లైనా.. వెయ్యి కోట్లయినా.. ఒక్కటే. కానీ, మన దేశంలో వ్యవస్థలు, ఆయా కేసుల్ని సాగదీయడమనేదొకటి వుంది కదా.! సో, ఏళ్ళ తరబడి నిందితులుగానే వుంటారు తప్ప, దోషులుగా తేలడం కావొచ్చు.. క్లీన్ చిట్ రావడం కావొచ్చు అంత తేలిక కాదు.

క్రమంగా టీడీపీ క్యాడర్‌లో నిస్తేజం అలముకుంటోంది. రేపు ఈ కేసులో చంద్రబాబుకి ఊరట లభిస్తుందా.? లేదా.? అన్నదానిపై ఎటూ చెప్పలేకపోతున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇరు పక్షాల వాదనలూ విన్న న్యాయస్థానం, తీర్పుని రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తీర్పు చంద్రబాబుకి అనుకూలంగా వచ్చినా, ఆ వెంటనే ఆయన్ని అరెస్టు చేయడానికి ఏపీ సీఐడీ రెడీగా వుంది.. ఇందుకోసం ఫైబర్ నెట్ స్కామ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది ఏపీ సీఐడీ.

ఆ ఫైబర్ నెట్ వ్యవహారంలోనూ చంద్రబాబు అరెస్టయితే.. ఆ కేసు కూడా ఇలాగే సాగుతూ సాగుతూ వుంటే.. ఆ తర్వాత మరో కేసు.. అదీ ఇలాగే సాగతీతకు గురైతే పరిస్థితి ఏంటి.? ఇదే ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళ టెన్షన్. చంద్రబాబు లోపల వుంటే, లోకేష్ బయట వున్నా టీడీపీకి పెద్దగా ప్రయోజనం వుండదు.

ఒకవేళ నారా లోకేష్ కూడా అరెస్టయితే, తెలుగుదేశం పార్టీకి దిక్కెవరు.? ఎలాగోలా వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుని, బయటకు వచ్చే పరిస్థితి టీడీపీ అధినేత చంద్రబాబుకి ఇప్పుడు లేదు. మరెలా.? అంతా అగమ్యగోచరం.! టీడీపీలో ఇప్పుడంతా ఒకటే చర్చ, చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చే దారేదీ.? అనే.!

సినిమా

“జూనియర్‌” కిరీటికి శివన్న ఆశీర్వాదం

గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతోన్న సినిమా ‘జూనియర్’. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని రాధా కృష్ణ తెరకెక్కించగా, శ్రీలీల...

మెగా ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన తెలుగు వెబ్ సైట్

ఈరోజు కోట శ్రీనివాసరావు మరణం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వెళ్ళి ఆయన పార్ధీవ దేహాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు.. ఈ వార్తను ఒక తెలుగు వెబ్...

Kota Srinivasa Rao: ‘కోటన్నా..’ ఇదైతే నేను ఖండిస్తున్నా..!

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు.. తెలుగు చిత్రసీమ మర్చిపోలేని పేరు. విలక్షణమైన నటన అనే పదానికి నూరు శాతం న్యాయం చేసిన నటుడు ఆయన....

Kota Srinivasa Rao: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు కోట...

Kota Srinivasa Rao: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఇకలేరు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుఝామున ఫిల్మ్ నగర్ ఆయన నివాసంలో కన్నుమూశారు....

రష్మిక కొత్త సినిమా నుంచి ‘నదివే…’ పాట

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, యువ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమాను గీతా ఆర్ట్స్,...

రాజకీయం

చంద్రబాబు వయసెంత.? పేర్ని నాని వయసెంత.? ఎవరి భయాలేంటి.?

పేర్ని నాని వైసీపీ నేత, మాజీ మంత్రి కూడా.! 2024 ఎన్నికల్లో భయపడి, పోటీకి దూరంగా వున్నారు. అంతకన్నా ముందే, ‘ఎన్నికల్లో పోటీ చేయడంలేదు’ అని ప్రకటించేశారాయన. తనకెలాగూ టిక్కెట్ రాదు, తన...

వైసీపీ డైవర్షన్ రాజకీయం: కూటమి ఆ ట్రాప్‌లో ఇరుక్కుంటోందా.?

మొన్న ఎన్టీయార్ - పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియా వేదికగా నడిచిన ట్రోలింగ్ కావొచ్చు.. అంతకు ముందు బాలకృష్ణ మీద జరిగిన ట్రోలింగ్ కావొచ్చు, చంద్రబాబు - లోకేష్ చుట్టూ నడుస్తున్న...

హిందీ – ఆంధీ.! పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అసలెందుకీ రచ్చ.?

ఇంట్లో తెలుగు సరిపోతుంది.. బయటకు వెళితే, హిందీ అవసరం.! ఇదీ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తాజాగా ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల సారాంశం. సదరు కార్యక్రమం...

పేర్ని నానీ.! అందర్నీ చంపేశాక, స్మశానంలో ఓట్లు అడుక్కుంటారా.?

రాజకీయమంటే ప్రజా సేవ.. కానీ, వైసీపీ దృష్టిలో రాజకీయమంటే, మనుషుల్ని చంపడం. ‘రప్పా రప్పా’ నరకడం గురించి ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమ కార్యకర్తల్ని వెనకేసుకొచ్చిన వైనం...

హిందీ నేర్చుకోవడంలో తప్పేంటి? – పవన్ కళ్యాణ్

హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన రాజ భాషా విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హిందీ భాషపై తన అభిప్రాయాలను సరళమైన శైలిలో...

ఎక్కువ చదివినవి

దేవాడ మైనింగ్ లో అక్రమ తవ్వకాలపై పవన్ కల్యాణ్ స్పందన

విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని దేవాడ మైనింగ్ బ్లాక్‌లో అనుమతించిన పరిమితికి మించి మాంగనీస్ తవ్వకాలు జరుగుతున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చాయి. ఏడాదికి 10 లక్షల టన్నుల...

కృషి చేసినవారికే  పదవులు: లోకేష్

పనిచేసే వారికి మాత్రమే పదవులు ఇస్తామని, ఇందులో ఏమాత్రం రాజీపడబోమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. నెలాఖరులోగా మార్కెట్ యార్డులు, దేవాలయ కమిటీలు భర్తీ చేస్తామన్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి...

వైజాగ్‌ ఐటీ హబ్‌గా మారుతోంది – కూటమి ప్రభుత్వ కృషికి ఫలితాలు

ఏపీని ఐటీ రంగంలో ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం చురుకుగా పనిచేస్తోంది. రాష్ట్రాన్ని ఐటీ క్యాపిటల్‌గా తీర్చిదిద్దాలన్న దిశగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశేషంగా శ్రమిస్తున్నారు. గుజరాత్‌ తరహాలో ఇక్కడ...

హిందీ – ఆంధీ.! పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అసలెందుకీ రచ్చ.?

ఇంట్లో తెలుగు సరిపోతుంది.. బయటకు వెళితే, హిందీ అవసరం.! ఇదీ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తాజాగా ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల సారాంశం. సదరు కార్యక్రమం...

తలకాయ్.. మామిడికాయ్.! ఏదైనా సరే ‘వైసీపీ’ తొక్కుకుంటూ పోవడమే.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొన్నామధ్యన సత్తెనపల్లి వెళ్ళారు. అక్కడ ఓ పెద్దాయనని వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కారు ఢీకొంది. కారు కింద పడ్డాడు ఆ పెద్దాయన. కారు చక్రం కింద ఆ...