Switch to English

చికోటి క్యాసినో ‘స్కామ్’.! ఇది కూడా అంతేనా.?

91,318FansLike
57,013FollowersFollow

ఈ రోజుల్లో క్యాసినోలకు వెళ్ళడం ఓ సరదా వ్యవమారం మాత్రమే కాదు, స్టేటస్ సింబల్ కూడా అయి కూర్చుంది. సంపన్న వర్గాలే కాదు, సామాన్యులు కూడా క్యాసినో ‘కిక్కు’ని రుచి చూస్తున్నారు. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అయితే ప్రత్యేక విమానాలేసుకుని మరీ క్యాసినోల్లో ‘ఎంజాయ్’ చేస్తున్నారు.

క్యాసినో అనగానే ‘గోవా’ గుర్తుకొస్తుంటుంది చాలామందికి. గోవాలో క్యాసినో కార్యకలాపాలు సర్వసాధారణం. సముద్ర తీరంలో లంగరేసిన షిప్పుల్లో క్యాసినో వ్యవహారాలు అత్యద్భుతంగా జరుగుతాయ్. డ్రగ్స్ సహా జరగకూడని వ్యవహారాలన్నీ అక్కడ స్వేచ్ఛగా జరిగిపోతుంటాయ్.

అయినా, గోవా అనేది ఓల్డ్ ట్రెండ్.! ఎంచక్కా విమానమెక్కి విదేశాలకు వెళ్ళిపోతే.. ఆ కిక్కే వేరప్పా.! అలా విదేశాలకు కేవలం క్యాసినోల కోసం వెళ్ళేవారి సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతోంది. ఇప్పుడిదంతా ఎందుకంటే, చికోటి ప్రవీణ్ అనే వ్యక్తిపై ఈడీ దాడులు, ఈ కేసులో పలువురికి నోటీసులు.. వెరసి, దేశవ్యాప్తంగా ఇప్పుడు ‘క్యాసినో’ అంశపై పెద్ద రచ్చే జరుగుతోంది మరి.

‘క్యాసినో నిజమే.. కానీ, నేనేమీ నేరాలు చేయలేదు. తప్పులు అసలే చేయలేదు..’ అని చెబుతున్నాడు చికోటి ప్రవీణ్. ఆయన పార్టనర్ ఇంకొకాయన అయితే, ఏకంగా తెలంగాణకి చెందిన ఓ మంత్రిగారి ‘ఎమ్మెల్యే స్టిక్కర్’ని తన కారుకి వాడేస్తున్నాడు.

ఏపీలోనూ కొన్నాళ్ళ క్రితం గుడివాడ క్యాసినో వ్యవహారం జరిగింది. ‘ప్రతి యేడాదీ సంక్రాంతి నేపథ్యంలో ఇలాంటివి జరుగుతాయ్..’ అని నిస్సిగ్గుగా అధికార పార్టీ నాయకులు చెప్పుకున్నారు. ఆ క్యాసినోలకీ, చికోటి ప్రవీణ్‌కీ లింకులున్నాయన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న అనుమానాలు.

కోట్లాది రూపాయలు ఈ క్యాసినోల ద్వారా చికోటి ప్రవీణ్ చేతుల మీదుగా చేతులు మారినట్లు వార్తలొస్తున్నాయ్. చికోటి ప్రవీణ్.. ఓ సాధారణ వ్యక్తి స్థాయి నుంచి.. ఓ బలీయమైన శక్తిగా (ఆర్థికంగా) ఎదిగిన వైనం, ఆయన ప్రస్తుత సామ్రాజ్యం.. ఇవన్నీ చూస్తే, రాజకీయ ప్రముఖుల అండదండలు లేకుండా ఇవన్నీ ఆయన చెయ్యగలిగేవాడని అనుకోలేం.

ఓ మామూలు వ్యక్తి, ఓ ఇంటిని కట్టుకోవాలంటేనే, స్థానిక ప్రజా ప్రతినిథుల పేరు చెప్పి ఆమ్యామ్యాలు లాగేస్తున్న రోజులివి. అలాంటిది, ఓ సామాన్యుడు.. క్యాసినో ద్వారా కోట్లు గడిస్తే, అందులో రాజకీయ నాయకులకు భాగస్వామ్యం లేకుండా వుంటుందా.?

కానీ, అవన్నీ బయటకు వచ్చే వ్యవహారాలు కావు. డ్రగ్స్ స్కాం చూశాం. ఏం తేలింది అందులో.? ఇది కూడా అంతే. మీడియాకి ఈ వ్యవహారం ప్రస్తుతం జస్ట్ టైమ్ పాస్. రాజకీయ పార్టీలకైతే ఓ డైవర్షన్ వ్యవహారం.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాన్నగారు నాకు చాలా ఇచ్చారు.. సూపర్ స్టార్ మహేష్ బాబు

సూపర్‌స్టార్‌ కృష్ణ గారి పెద్దకర్మను ఆదివారం కుటుంబ సభ్యులు నిర్వహించారు. పెద్దకర్మకు భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్‌ బాబు...

మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారు: వివాదాస్పదమైన రామ్ దేవ్ వ్యాఖ్యలు

ప్రముఖ యోగ గురు రామ్ దేవ్ బాబా మహిళలపై చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారని అన్నారు. మహారాష్ట్రలోని ఠాణేలో పతంజలి...

కీర్తి భట్‌పై సింపతీ వేవ్.! బిగ్ బాస్ విన్నర్‌ని చేస్తుందా.?

కీర్తి భట్.! బుల్లితెర నటీమణి.! ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్‌లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. చేతి వేలికి...

కాంతారా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..! ఓటీటీలో ‘వరాహరూపం’లో ఒరిజినల్ వెర్షన్

సంచలన విజయం సాధించిన ‘కాంతారా’ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ‘వరాహరూపం’ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అయితే.. తమ...

మోక్షజ్ఞ ఎంట్రీ షురూ..! సినిమాపై.. దర్శకుడిపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

నందమూరి అభిమానుల ఎదురుచూపులకు తెర దించుతూ నటసింహం బాలకృష్ణ కీలక అనౌన్స్ మెంట్ చేశారు. తనయుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రానికి ముహూర్తం కుదిరిందనే కీలక అప్డేట్...

రాజకీయం

‘లేకి’ జర్నలిజం.! పవన్ కళ్యాణ్‌పై ఏడవడమే పాత్రికేయమా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కులాల ప్రస్తావన తెస్తున్నారు. ఏం, ఎందుకు తీసుకురాకూడదు.? పేరు చివర్న రెడ్డి, చౌదరి.. ఇలా తోకలు పెట్టుకున్న నాయకులు, కులాల పేరుతో రాజకీయాలు చేయొచ్చుగానీ, కులాల్ని కలిపే...

టీడీపీ ఎమ్మెల్యే గంటా వైసీపీలో చేరబోతున్నారా.?

మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో, సూచనలతో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. అసలు గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే వున్నారా.? చాలామందికి వస్తోన్న డౌట్ ఇది. 2019...

ఛాలెంజ్ విసురుతున్నా.. ఈసారి మీరెలా గెలుస్తారో చూస్తా..: పవన్ కల్యాణ్

‘ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తాం.. మాకు ఓట్లు వేసినా.. వేయకపోయినా అండగా ఉంటాం’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత బాధితులకు...

‘సీకే పల్లి పీఎస్ ముందు పరిటాల సునీత, శ్రీరామ్ బైఠాయింపు..’ పరిస్థితి ఉద్రిక్తత

సత్యసాయి జిల్లా సీకే పల్లి పోలిస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్ధసారధి...

ముఖ్యమంత్రి అజ్ఞానంలో వుంటారు.! జనసేనాని సంచలన వ్యాఖ్యలు.!

‘నేను ఉద్దానం ఎప్పుడు వెళ్ళానో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకపోవడం శోచనీయం. ఏమీ తెలియకుండానే ఆయన ఏవేవో మాట్లాడేస్తుంటారు నా గురించి. ఆయన అలా అజ్ఞానంలో వుంటారు....

ఎక్కువ చదివినవి

ఇప్పటం వివాదం: పవన్ కళ్యాణ్ అంత పెద్ద నేరం చేశారా.?

ఇప్పటం గ్రామ ప్రజలు, తమ ఇళ్ళను ప్రభుత్వం కుట్ర పూరితంగా ధ్వంసం చేసిందని ఆరోపించారు. బస్సులు తిరిగే పరిస్థితి లేని గ్రామంలో వున్నపలంగా 120 అడుగుల మేర రోడ్లను వెడల్పు చేయాల్సిన అవసరమేముంది.?...

యశోదకు దిమ్మతిరిగే షాక్.. ఎలా వాడుతారంటూ మొట్టికాయలు!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటించిన రీసెంట్ మూవీ ‘యశోద’ భారీ అంచనాల మధ్య ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకద్వయం హరి-హరీశ్‌లు తెరకెక్కించగా, పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో ఈ...

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం – బిలో యావరేజ్ రియలిస్టిక్ డ్రామా

నాంది చిత్రంతో సీరియస్ రియలిస్టిక్ డ్రామాతో సూపర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్ మరోసారి అలాంటి జోనర్ కు చెందిన చిత్రాన్ని ఎంచుకున్నాడు. ప్రోమోలతో ఇదేదో సీరియస్, హార్డ్ హిట్టింగ్ చిత్రంలా అనిపించిన...

‘ఫోన్ కాల్ వస్తే డొనేషన్లు కట్టలేదని చెప్పండి.. ప్లీజ్’ తల్లిదండ్రులకు ఫోన్లు

‘మీ అబ్బాయి/అమ్మాయి మా కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఎవరైనా ఫోన్ చేసి డొనేషన్ కట్టారా..? అంటే కట్టలేదని చెప్పండి..’ అని తల్లదండ్రులకు ఓ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. తెలంగాణ మంత్రి...

యూత్‌ఫుల్ అండ్ రొమాంటిక్ మూవీ ‘లెహరాయి’ ట్రైలర్ విడుదల

తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్న నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో యంగ్ టాలెంటెడ్ హీరో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం...