Switch to English

వైఎస్సార్‌ జయంతి: రాజన్నా నిను మరువలేము ఏనాటికీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

రాజకీయాల్ని పక్కన పెడితే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. ముఖ్యమంత్రిగా ఆయన అమల్లోకి తెచ్చిన సంక్షేమ పథకాలు అలాంటివి. సంక్షేమ పథకాలనగానే ముందుగా అందరికీ ‘ఓటు బ్యాంకు రాజకీయాలు’ గుర్తుకొస్తాయి. అయితే, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి అందుకు పూర్తి భిన్నం. స్వతహాగా వైద్యుడు కావడంతో, ఆయనకి ‘పేదోడి నాడి’ బాగా తెలుసు. అందుకే, ఆరోగ్యశ్రీ అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తీసుకొచ్చిన ఈ ఆరోగ్య పథకం ఎన్నో పేద ప్రాణాల్ని నిలబెట్టింది.. నిలబెడుతూనే వుంది. పేదోడికి సైతం పెద్దోడితో సమానంగా వైద్యం.. అనే కాన్సెప్ట్‌ని ఆరోగ్య శ్రీ ద్వారా అమల్లోకి తెచ్చారు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి.

వైద్యంతోపాటుగా పేదోడికి విద్య కూడా ఎంతో అవసరమని గురించిన ‘డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి’, ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకొచ్చారు. ఖరీదైన వైద్యం ఎలాగైతే పేదోడికీ దక్కుతోందో అలాగే, ఖరీదైన చదువులు కూడా పేదోడికి ‘ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్‌’ పథకం ద్వారా దక్కుతున్నాయి. జలయజ్ఞంపేరుతో అవినీతి జరిగిందన్న రాజకీయ విమర్శలు పక్కన పెడితే, దశాబ్దాలుగా మూలన పడిపోయిన, వార్తలకే పరిమితమైన చాలా ప్రాజెక్టులు వైఎస్‌ హయాంలో జీవం పోసుకున్నాయి. వాటిల్లో ఎన్ని పూర్తయ్యాయన్నది వేరే చర్చ. కానీ, వైఎస్‌ కారణంగానే ఆయా ప్రాజెక్టులు తిరిగి లైవ్‌ులైట్‌లోకొచ్చాయి. అందులో పోలవరం ప్రాజెక్టు ఒకటి. ఉచిత విద్యుత్‌ వంటి పథకాలపై ఎన్ని విమర్శలొచ్చినా, వైఎస్సార్‌ తన పని తాను చేసుకుపోయారు.

తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనంలా కన్పించే పంచెకట్టు.. దాన్ని మించి చెరగని చిరునవ్వు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని రాజకీయాల్లో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చాయి. రాజకీయ విమర్శలు చేసే క్రమంలో పదునైన మాటలు ఉపయోగించినా, రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలకు చెందిన నేతల్నీ గౌరవించడంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తర్వాతే ఎవరైనా. ఇక, హెలికాప్టర్‌ ప్రమాదంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణించాక ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రాజకీయాలు ఎంతలా దిగజారాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

‘వైఎస్సార్‌ జీవించి వుంటే, రాష్ట్రం విడిపోయేది కాదేమో..’ అన్న భావన ఇప్పటికీ చాలామందిలో వుంది. వైఎస్‌ కారణంగా రాజకీయాల్లోకొచ్చిన చాలామంది ప్రస్తుతం వేరే వేరే పార్టీల్లో వున్నా, ఆయన మీద అభిమానం మాత్రం వాళ్ళకి ఇప్పటికీ, ఎప్పటికీ తగ్గదుగాక తగ్గదు. తెలుగునాట రాజకీయాల్లో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి. ఆయన జయంతి అనగానే, ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ది పొందినవారికీ, ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్‌ ద్వారా ఉన్నత విద్య అభ్యసించినవారికి ప్రత్యేకమైన రోజు.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...