Switch to English

బిగ్‌ బాస్ 6 కీర్తి భట్‌ బ్యాక్ గ్రౌండ్ ఏంటో మీకు తెలుసా..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో మొదటి కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన కీర్తి భట్ జీవితం ఎంతో ఆసక్తికరం. ఆమె జీవిత కథని సినిమాగా తీస్తే ఒక భారీ హిట్ సినిమా అవ్వడం ఖాయం, అలాంటి జీవితాన్ని అనుభవించి ఎన్నో కష్టాలు.. ఇబ్బందులు ఎదుర్కొని ధైర్యంతో నిలిచి ప్రస్తుతం బిగ్బాస్ లో కొనసాగుతున్న కీర్తి ఎంతో మందికి ఆదర్శనీయ అనడంలో సందేహం లేదు. కీర్తి భట్ పూర్తి జీవిత విశేషాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి..

ఈమె 1992 సంవత్సరం జూన్ 2 తారీఖున కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో జన్మించింది. ఈమె చదువు మొత్తం బెంగళూరులోనే జరిగింది. 2017 సంవత్సరంలో యాక్టింగ్ గా కెరియర్ ని స్టార్ట్ చేయడం జరిగింది. కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఐస్ మహల్ అనే సినిమాతో యాక్టింగ్ కెరియర్ ని ఈమె స్టార్ట్ చేసింది. ఆ తర్వాత తెలుగు బుల్లి తెరపై అడుగు పెట్టింది. తెలుగులో పలు సీరియల్స్ లో నటించిన ఈమె అనూహ్యంగా ఒక కారు ప్రమాదంలో తల్లిదండ్రులను ఇంకా అన్నయ్య వదినలను మరియు అన్నయ్య పిల్లలను కోల్పోయింది.

ఆ కారు ప్రమాదంలో కేవలం కీర్తి భట్ మాత్రమే బతికి బయట పడింది. ఆ సమయంలో కీర్తి కూడా చాలా రోజులు కోమాలోకి వెళ్లింది. చాలా రోజుల పాటు కోలుకోలేదు. కీర్తి భట్ చనిపోతుందని అంతా భావించారు, కానీ ఆమె బతకాలనే గట్టి పట్టుదలతో చావుతో పోరాటం చేసి మరి కోమా నుంచి బయట పడింది. కోమా నుండి బయట పడిన తర్వాత కుటుంబ ఆస్తులు ఇతర విషయాల్లో కూడా సన్నిహితులు అనుకున్న వారే మోసం చేసి తనను రోడ్డున పడేశారు. దాంతో కన్నీళ్లు పెట్టుకోకుండా ధైర్యంగా పోరాడాలని నిర్ణయించుకుంది.

2019 సంవత్సరంలో మళ్ళీ తెలుగు టెలివిజన్ రంగంలో మనసిచ్చి చూడు అనే సీరియల్ తో రియల్ ఇచ్చింది. ఆ సమయంలోనే ఒక చిన్న పాపను దత్తత తీసుకుంది. కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ హేమ పాత్రలో నటించి మెప్పించింది. ఒంటరి జీవితం భరించలేక పాపను దత్తత తీసుకున్న కీర్తి భట్ కి ఆ ఆనందం కూడా దక్కలేదు. ఆ పాప కూడా ఇటీవల మృతి చెందినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ లో ఆమె జర్నీ ప్రస్తుతం ఆసక్తికరంగా సాగుతుంది. తప్పకుండా ఆమె టాప్ 6 లేదా 7 వరకు వెళ్లే అవకాశం ఉంది అంటూ బుల్లి తెర విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

భరతనాట్యంతో పాటు నటనలో మంచి ప్రావీణ్యం ఉన్న ఈమె ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా విశ్లేషించి మరీ నిర్ణయాన్ని తీసుకుంటుంది. కనుక బిగ్ బాస్ లో ఈమెకు అది కలిసి వస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బయట పెద్దగా మద్దతు లేకుండా కూడా లోపల తన ప్రవర్తనతో ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం చేస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ షో చాలా ఆసక్తికరంగా సాగుతుంది, అందులో కీర్తి ఉండడం ఆమె అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు. కీర్తి ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శనీయం.. ఆమె జీవితం చాలా మందికి ఒక గుణపాఠం, జీవితంలో అన్నీ కోల్పోయినా జీవితం ఉంది అనే ఆశతో జీవించాలి అని ఆమె జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. ఆల్ ది బెస్ట్ కీర్తి భట్.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు,. ఇప్పటికే రిలీజ్...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....