బోయపాటి బెంగ తీర్చిన బాలయ్య.. ముచ్చటగా మూడోది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,071FansLike
57,764FollowersFollow

నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా దర్శకుడు బోయపాటి శ్రీను గురించి చెబుతుంటారు. బాలయ్యతో ‘సింహ’, ‘లెజెండ్‌’ సినిమాలు చేసిన బోయపాటి, ఆ రెండు సినిమాలతోనూ సూపర్‌ హిట్స్‌ ఇచ్చాడు. ఈసారి ముచ్చటగా మూడో హిట్‌ కోసం ఈ కాంబినేషన్‌ సెట్‌ అయ్యింది. వాస్తవానికి ఈ ఏడాది మొదట్లోనే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళాలి. కానీ, ‘వినయ విధేయ రామ’ ఫ్లాప్‌ అవడంతో, బోయపాటిని బాలయ్య దూరం పెట్టేశాడు. అలా, ఇద్దరి మధ్యా గ్యాప్‌ పెరిగింది.

అయితే, టీడీపీ అధినేత చంద్రబాబుతో సాన్నిహిత్యం కారణంగా బాలయ్య – బోయపాటి మధ్య మళ్ళీ ‘కమ్యూనికేషన్‌’ సెట్‌ అయ్యిందంటారు చాలామంది. ఇందులో నిజమెంత.? అనే విషయం పక్కన పెడితే, బాలయ్యతో సినిమా చేసి.. మళ్ళీ హిట్టు కొట్టి, తన స్టామినా ఏంటో నిరూపించుకోవాలన్నది బోయపాటి ‘కసి’. ఆ కసితోనే, ప్రొడ్యూసర్‌ని సెట్‌ చేశాడు. మిర్యాల రవీందర్‌రెడ్డితో బాలకృష్ణ హీరోగా సినిమా ఖరారైంది. అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కబోతోంది.

Also Read: జూ. ఎన్టీఆర్‌పై బాలయ్య చిన్నల్లుడి సెన్సేషనల్‌ కామెంట్స్‌.!

డిసెంబర్‌లో సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళబోతోందని నిర్మాణ సంస్థ ద్వారక క్రియేషన్స్‌ ప్రకటించింది. ప్రస్తుతం బాలకృష్ణ, కెఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న విషయం విదితమే. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోంది. కేఎస్‌ రవికుమార్‌ సినిమా పూర్తవగానే, బోయపాటి శ్రీను సినిమాకి రెడీ అవుతాడు బాలకృష్ణ. మొత్తమ్మీద, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌కి బీభత్సమైన డిజాస్టర్‌ ఇచ్చిన బోయపాటి, నందమూరి బాలకృష్ణకి హిట్‌ ఇస్తాడా.? వేచి చూడాల్సిందే.

3 COMMENTS

సినిమా

“సీట్ ఎడ్జ్ సస్పెన్స్… ‘తిమ్మరాజుపల్లి టీవీ’పై దర్శకుడు మునిరాజు నమ్మకం”

హీరో Kiran Abbavaram న్యూ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ సుమైర స్టూడియోస్‌తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. తేజ వేల్పుచర్ల సహ...

“ఫస్ట్ హాఫ్ లాక్… అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్‌కు సూపర్ స్టార్ట్!”

దర్శకుడు Anil Ravipudi తన తదుపరి సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్‌ను పూర్తిగా లాక్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే కథనం దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్...

“టీజర్ లేదు… ‘డ్రాగన్’ ఫస్ట్ లుక్ ప్లాన్ ఫిక్స్!”

N. T. Rama Rao Jr. నటిస్తున్న డ్రాగన్ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మే 20న...

రొటీన్ కాదట… ‘పెద్ది’ క్లైమాక్స్ షాక్ ఇవ్వనుందా?”

పెద్ది సినిమా గురించి వస్తున్న తాజా అప్‌డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. దర్శకుడు Buchi Babu Sana ఈ చిత్రానికి సాధారణ కమర్షియల్ ముగింపుకంటే...

Jananayagan: ‘జననాయగన్’ లీక్ కేసులో పురోగతి.. ఆరుగురి అరెస్ట్..

Jananayagan: తమిళ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా లీక్ అంశం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా దక్షిణాది చిత్రసీమను కలవరపరచిందనే చెప్పాలి....

రాజకీయం

“ఆత్మాహుతి వ్యాఖ్యలు… వైసీపీలో కొత్త వివాదం”

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది YSR Congress Party. పార్టీ నేతల నుంచి వస్తున్న వ్యాఖ్యలు తాజాగా పెద్ద దుమారం రేపుతున్నాయి. టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన Mithun Reddy, తమ అధినేత...

“రక్త చరిత్రే రాజకీయం..!” వైసీపీపై నిమ్మల తీవ్ర ఆరోపణలు

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. రక్త చరిత్రనే రాజకీయం గా మార్చుకుని వైసీపీ ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ...

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“ట్రెండ్ కాదు.. లక్ష్యమే ముఖ్యం”: యువతకు లోకేష్ సందేశం

బెంగళూరులో నిర్వహించిన గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి...

ఎక్కువ చదివినవి

చెన్నకేశవరెడ్డి గెటప్‌లో కిరణ్ అబ్బవరం.. మాస్ పల్స్ బాగానే పట్టాడుగా!

తిమ్మరాజుపల్లి టీవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం చేసిన ఎంట్రీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి  గెటప్‌లో ఆయన కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని...

Allu Arjun: అల్లు అర్జున్.. ఇప్పుడు పేరు కాదు.. అదొక ‘బ్రాండ్’

Allu Arjun: సినీ పరిశ్రమలో హీరోల వారసులు చాలామందే ఉన్నారు. హీరోల కుమారులు కాకుండా పరిశ్రమలో నిర్మాత, దర్శకుల వారసులకూ కొదవలేదు. అటువంటి హీరోల్లో ఒకరు అల్లు అర్జున్. అగ్ర నిర్మాణ సంస్థగా...

“అమరావతి కల నెరవేరింది”: చంద్రబాబు కృతజ్ఞతలు

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అమరావతి రాజధాని కల సాకారం దిశగా మరో కీలక ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం–2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో రాష్ట్ర రాజకీయాల్లో,...

కాకినాడలో ఒక్క గుంత కూడా కనిపించకూడదు.. ప్రతి రెండు నెలలకు వస్తా: పవన్ కళ్యాణ్

కాకినాడ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి కాకినాడ జిల్లా, ముఖ్యంగా కాకినాడ మరియు పిఠాపురం...

మూడు రోజుల వర్ష హెచ్చరిక.. తెలుగు రాష్ట్రాలకు పిడుగు అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు, ఉరుములు, పిడుగులతో కూడిన వాతావరణం కొనసాగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా నేడు, రేపు మరియు ఎల్లుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు జిల్లాల్లో...