పున్నూ ఆటిట్యూడ్‌: కొంచెం ఇష్టం కొంచెం కష్టం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,218FansLike
57,764FollowersFollow

‘నాగార్జునగారూ.. పునర్నవిగారూ..’ ఇలా సాగుతోంది బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌ పునర్నవి భూపాలంకీ, బిగ్‌ హోస్ట్‌ అక్కినేని నాగార్జునకీ మధ్య సరదా సంభాషణ. వీకెండ్‌ ఎపిసోడ్స్‌కి సంబంధించి తొలి ఎపిసోడ్‌ శనివారం చాలా హాట్‌గా సాగుతుందని ప్రోమో ఇచ్చి, చప్పగా మార్చేసిన బిగ్‌బాస్‌ టీమ్‌, రెండో రోజైన ఆదివారం అంతకన్నా డల్‌గా స్టార్ట్‌ చేసింది.

కంటెస్టెంట్స్‌తో మొత్తంగా నాలుగు స్కిట్స్‌ చేయించాడు హోస్ట్‌ నాగార్జున. ఒక్కటంటే ఒక్కటి కూడా ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేయలేదు. నిన్న శ్రీముఖికి గట్టిగా క్లాస్‌ తీసుకున్న నాగార్జున, ఆమెను కూల్‌ చేయడానికి శ్రీముఖి చేసిన టాస్క్‌ సూపర్‌.. అని కితాబులిచ్చేసినట్టుంది.. అంతకు మించి ఆ స్కిట్‌ని మెచ్చుకోవడానికి మరో రీజన్‌ లేదు. అలా శ్రీముఖిని మెచ్చుకుని, ఎలిమినేషన్‌ నుంచి ఆమె సేఫ్‌ అయినట్లు ప్రకటించేశాడు హోస్ట్‌ నాగార్జున.

Also Read: నాగార్జునగారు, పునర్నవిగారు.. ఓ చిరిగిపోని ఇన్విటేషన్‌.!

హిమజ ఏదో వంటకం తయారు చేసింది.. దాని టేస్ట్‌ దారుణంగా వుందని నాగ్‌ తేల్చేశాడు. మరోపక్క, జింగిల్స్‌ ఎపిసోడ్‌ మాత్రం బాగా వర్కవుట్‌ అయ్యింది. ఇందులో పునర్నవి ఆటిట్యూడ్‌ జింగిల్‌ కెవ్వు కేక. మిగతావన్నీ కూడా బాగా డిజైన్‌ చేశారు. వారం మొత్తం ఎపిసోడ్స్‌ అన్నీ చూస్తే, అందులో ఈ ఒక్క జింగిల్స్‌ టాస్క్‌ ఒక్కటే బావుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.

శిల్పా చక్రవర్తి ఎలిమినేషన్‌ నిన్ననే కన్‌ఫామ్‌ అయిపోయిన విషయం విదితమే. ఆ అంచనాలు తప్పు కాలేదు. శిల్పా చక్రవర్తి ఎలిమినేట్‌ అయిపోయింది. కేవలం ఎలిమినేషన్‌ కోసమే వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీస్‌ని తీసుకొస్తున్నట్లుంది. మొన్న తమన్నా సింహాద్రి.. ఇప్పుడు శిల్పా చక్రవర్తి.. అలాగే వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చి, కేవలం రెండు వారాల్లోనే బిగ్‌ హౌస్‌ నుంచి బయటకు వెళ్ళిపోయారు.

ఆ సంగతి పక్కన పెడితే, తొలిసారి నామినేట్‌ అయినవారు హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిపోవడం.. అనే ఆనవాయితీ కొనసాగుతోంది. కొత్తగా వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు ఏమన్నా వుంటాయా.? అంటే, ‘వచ్చి మాత్రం ఏం చేయగలరు.?’ అని జనం అభిప్రాయపడుతున్నారు. హోస్ట్‌గా నాగార్జునలో ఎనర్జీ అస్సలేమాత్రం కన్పించకపోవడం ఈ షోకి పెద్ద మైనస్‌గా మారింది. టాస్క్‌లు మరీ దారుణంగా వుంటున్నాయి. వీకెండ్‌ ఎపిసోడ్స్‌ కూడా డల్‌గా వుంటోన్న దరిమిలా, నిర్వాహకులు కొత్తగా ఆలోచిస్తే బెటరేమో. స్కిట్స్‌ కోసం జబర్‌దస్త్‌ టీమ్‌ సలహాలు తీసుకుంటే కొంతైనా ప్రయోజనం వుంటుందన్నది బిగ్‌బాస్‌ అభిమానులు ఆవేదనతో చేస్తున్న సూచన.

5 COMMENTS

సినిమా

Mohanlal: వివాదంలో హీరో మోహన్ లాల్..! అటవీశాఖ కీలక నిర్ణయం

Mohanlal: మలయాళ చిత్రసీమ అగ్రకథానాయకుడు మోహన్ లాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయనపై ఏనుగు దంతాలు కలిగి ఉన్నారనే కేసు ఉంది. వన్యప్రాణుల కొమ్ములు,...

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

రాజకీయం

పవన్‌పై ఫిర్యాదు.. నెటిజన్ల నుంచి కౌంటర్ల వర్షం!

సుగాలి ప్రీతి తల్లి పార్వతి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం రాజకీయంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నికలకు ముందు న్యాయం...

ఏపీలో డిస్‌ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయండి.. సియోల్ సెమీకండక్టర్స్‌కు లోకేష్ ఆహ్వానం

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యుంగ్ లీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో డిస్‌ప్లే...

జోసెఫ్ రావణ్‌కు బెయిల్.. యూఏపీఏ కేసులో ఊరట

యూఏపీఏ (UAPA) కింద నమోదైన కేసులో అంబేద్కరైట్ జర్నలిస్టు, స్వతంత్ర రాజకీయ వ్యాఖ్యాత జోసెఫ్ రావణ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) సంస్థకు, ఆ సంస్థకు చెందిన నాయకుడు...

శ్రీసిటీలో హ్యోసంగ్ యూనిట్‌కు లోకేష్ ఆహ్వానం

సౌత్ కొరియాలోని సియోల్ పర్యటనలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ PU ప్రెసిడెంట్ యోకోటా తకేషితో సమావేశమయ్యారు. హ్యోసంగ్...

ఏపీపై కొరియా స్టార్టప్‌లకు లోకేష్ ఆహ్వానం.. లక్ష ఉద్యోగాలే లక్ష్యం

దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో కొరియన్ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై కీలక...

ఎక్కువ చదివినవి

రోబో ఒక్కసారిగా రెచ్చిపోయిందా?.. వైరల్ వీడియోపై చర్చ

సాంకేతిక రంగంలో హ్యూమనాయిడ్ రోబోల వినియోగం వేగంగా పెరుగుతున్న వేళ, ఇండోనేషియాకు చెందినదిగా చెబుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ హ్యూమనాయిడ్ రోబో ఒక్కసారిగా...

ఏపీలో డిస్‌ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయండి.. సియోల్ సెమీకండక్టర్స్‌కు లోకేష్ ఆహ్వానం

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యుంగ్ లీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో డిస్‌ప్లే...

“జడ శ్రవణ్ గారు.. వారిని ఇవి కూడా అడగండి!”

మాజీ మేజిస్ట్రేట్ జడ శ్రవణ్ కుమార్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చేసిన...

అరకులో జల్ సించాయ్ పనుల పరిశీలన.. నాగబాబు ప్రశంసలు

అరకు పార్లమెంటరీ నియోజకవర్గంలో జల్ సించాయ్ జన భాగీదారి 2.0 కార్యక్రమం కింద చేపట్టిన నీటి సంరక్షణ పనులను శాసనమండలి సభ్యులు K. Nagababu మంగళవారం పరిశీలించారు. Chompi గ్రామంలో జాతీయ గ్రామీణ...

మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రూ.6.3 కోట్లతో అభివృద్ధి పనులు.. లోకేష్ శంకుస్థాపన

మంగళగిరిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.6.3 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు...