మే 30 నుండి ఆరంభం కానున్న క్రికెట్ ప్రపంచ కప్ కి దాదాపు అన్ని జట్లు సన్నద్ధం అయ్యాయి. ఇటీవల ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ కప్ కి ఎంపికైన ఆటగాళ్లతో ఆస్ట్రేలియా ప్రపంచ కప్ కొత్త జెర్సీ లో ఫోటో లు తీసి బయటకి విడుదల చేసింది. ఇంగ్లాండ్ లో జరిగే ప్రపంచ కప్ తరువాత ఆసీస్ జట్టు ఇంగ్లాండ్ తో యాషెస్ సిరీస్ ఆడనుంది. ఈ రెండు జట్ల అభిమానులు ఎప్పుడు తమ ప్రత్యర్థి జట్ల ఆటగాళ్ల పైన ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ సారి ప్రపంచ కప్ కి ముందే ట్రోలింగ్ ఆరంభించారు.
గతేడాది బాల్ ట్యాంపరింగ్ వివాదం లో చిక్కుకొని ఏడాది పటు నిషేధానికి గురైన వార్నర్ ని లక్ష్యంగా చేసుకొని ఇంగ్లాండ్ జట్టు ని సపోర్ట్ చేసే బర్మీ ఆర్మీ సోషల్ మీడియా లో వార్నర్ ఫోటో ని మార్ఫింగ్ చేసి అప్లోడ్ చేసారు. ఆ ఫోటో లో వార్నర్ జెర్సీ మీద ఉన్న ఆస్ట్రేలియా పేరుకి బదులుగా CHEATS (చీట్స్) అని రాసుంది. ప్రస్తుతం ఈ ఫోటో క్రికెట్ అభిమానుల మధ్య వైరల్ అవుతుంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో స్యాండ్‌పేపర్‌తో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన కామెరూన్ బెన్‌క్రాఫ్ట్‌ను గుర్తు చేస్తూ ఆసీస్ స్టార్ బౌలర్లు మిచెల్ స్టార్క్, లియాన్ నాథన్‌లు చేతిలో బంతితో పాటు సాండ్ పేపర్ కూడా పట్టుకున్నట్లు ఫొటో షాప్ చేశారు. దీనిపైనా ఆస్ట్రేలియా జట్టు కోచ్ అయినా జస్టిన్ లాంగర్ స్పందిస్తూ ఇలాంటి ట్రోలింగ్ వ్యవహారాలు తమ జట్టు ని ఏమి చేయలేవని ప్రతిదానికి తమ ఆటతో సమాధానం చెప్తామని పేర్కొన్నాడు.
? @cricketcomau release their #CWC19 player portraits! pic.twitter.com/J1wBV5tK5w
— England's Barmy Army (@TheBarmyArmy) May 8, 2019