మిల్కి భామ తమన్నా అంటే సౌత్ లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో అందరికి తెలుసు. గ్లామర్ హీరోయిన్ గానే కాకుండా నటిగా కూడా ఇమేజ్ తెచ్చుకునేందుకు బాగానే కష్టపడుతుంది తమన్నా. ఈ మద్యే కాస్త సినిమాలు వరుసగా పరాజయాలు అవుతుండడంతో ఈ అమ్మడికి కాస్త బ్రేకులు పడ్డాయి. దాంతో కాస్త గ్యాప్ తీసుకుని మళ్ళీ జోరు ప్రదర్శించడం మొదలుపెట్టింది.
ప్రస్తుతం తమన్నా అభినేత్రి 2 తో ముందుకు వస్తుంది. ఈ సినిమాకు సంబందించిన టీజర్ ఇటీవలే విడుదలై సినిమాపై ఆసక్తిని పెంచింది. దాంతో పాటు ఓ హాట్ సాంగ్ లో తమన్నా డాన్స్ తో ఇరగదీసింది. ఈ పాటను చూసినవాళ్లంతా .. బాబోయ్ తమన్నా చాలా హాట్ గురు ? అంటున్నారు. ఇదంతా బాగానే ఉంది .. కానీ ఈ మధ్య తమన్నా వ్యవహారం చూస్తుంటే చాలా మందికి డౌట్ వస్తుంది ?
ముఖ్యంగా సోషల్ మీడియాలో తమన్నా పై పలు న్యూస్ ట్రోల్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్యే మరో గ్లామర్ హీరోయిన్ శృతి హాసన్ ను పెళ్లి చేసుకోవాలని ఉందంటూ ఘాటు కామెంట్ చేసింది. ఈ న్యూస్ విన్న శృతి హాసన్ కూడా తనకు తమన్నా అంటే చాలా ఇష్టమని తాను పెళ్ళికి రెడీ అంటే నేను కూడా రెడీ అంటూ రివర్స్ కౌంటర్ వేసింది. అంటే ఇద్దరి మధ్య అంత మంచి ఫ్రెండ్షిప్ ఉంది అది వేరే విషయం.
తాజాగా మరో గ్లామర్ హీరోయిన్ కాజల్ పై కూడా దాదాపు ఇలాంటి కామెంట్ చేసింది. నటి కాజల్ అంటే తనకు ఇష్టమని ఆమెతో కలిసి సినిమాలో నటించాలని ఉందంటూ చెప్పింది. ఈ విషయం తెలిసి అటు కాజల్ కూడా పాజిటివ్ గానే స్పందించింది. తనకు కూడా తమన్నా అంటే ఇష్టమని వీలయితే తనతో నటించే ఛాన్స్ వస్తే వదులుకోనని చెబుతుంది. మొత్తానికి తమన్నా పాజిటివ్ గానే స్పందిస్తున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం అది నెగిటివ్ గా మారుతుంది. మరి హీరోయిన్స్ పై తమన్నాకు ఇంత క్రష్ ఎందుకు అంటూ కౌంటర్లు పడుతున్నాయి.