Switch to English

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం ఎలాంటి పదవీ లేదు.!

కొంత కాలం క్రితం ఆయన జనసేన పార్టీలో వుండేవారు. ఏ కారణాలతో ఆయన జనసేన పార్టీకి దూరమయ్యారన్నది, ఆయనకు సంబంధించిన విషయం. ఆయన ఏనాడూ ఫలానా కారణంతో పార్టీకి దూరమయ్యానని చెప్పలేదు. జనసేన పార్టీ కూడా కళ్యాణ్ దిలీప్ సుంకర విషయమై ఎలాంటి ప్రకటనా ఇటీవలి కాలంలో చేసింది లేదు.

యూ ట్యూబ్ వేదికగా కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీకి మద్దతుగా మాట్లాడుతుండేవారు. కాపు సామాజిక వర్గం తరఫున వకాల్తా పుచ్చుకుని, వైసీపీని విమర్శిస్తుండేవారు. టీడీపీ అను‘కుల’ మీడియాని ఏకిపారేస్తుండేవారు. చంద్రబాబుపైనా మంటెక్కిపోయేవారాయన.!

టీడీపీ – జనసేన – బీజేపీ.. ఈ మూడు పార్టీలూ కూటమి కట్టడం బహుశా కళ్యాణ్ దిలీప్ సుంకరకి నచ్చకపోయి వుండొచ్చు. నచ్చినా, నచ్చి వుండొచ్చు కూడా.! గత కొద్ది రోజులుగా కళ్యాణ్ దిలీప్ సుంకర, వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతూ వస్తున్నారు.

గతంలో, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద నానా రకాల విమర్శలూ చేసి, ఇప్పుడు వైఎస్ జగన్ పొలిటికల్ గ్రాఫ్ గురించీ, ఆయన పొలిటికల్ ఇమేజ్ గురించీ పాజిటివ్ వ్యాఖ్యలతో కూడిన వీడియోల్ని విడుదల చేస్తున్నారు కళ్యాణ్ దిలీప్ సుంకర.!

జనసేన పార్టీలో కళ్యాణ్ దిలీప్ సుంకర లేరు గనుక, ఆయన తాజా వ్యవహార శైలిపై జనసేన పార్టీ నుంచి ఎలాంటి కామెంట్ వచ్చే అవకాశం లేదు. కానీ, జనసేన సింపథైజర్స్.. మరీ ముఖ్యంగా, ఇన్నాళ్ళూ కళ్యాణ్ దిలీప్ సుంకర వీడియోల్ని అమితంగా మెచ్చుకున్న కొందరు జనసేన మద్దతుదారులు, ఇప్పుడాయన తీరుపై ఆశ్చర్యపోతున్నారు.

సినీ నటుడు అలీ, కోన వెంకట్.. వీళ్ళంతా పవన్ కళ్యాణ్‌కి ఒకప్పుడు అత్యంత సన్నిహితులు. రాజకీయంగా వాళ్ళంతా వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. కళ్యాణ్ దిలీప్ సుంకర విషయంలోనూ అంతకు మించి ఏమీ అనుకోవడానికి వీల్లేదు. పిఠాపురంలో జనసేన తరఫున కళ్యాణ్ దిలీప్ సుంకర ఎన్నికల ప్రచారం చేస్తారనే ప్రచారం జరిగింది. జనసేన ఈ విషయంలో ఎలాంటి అదికారిక ప్రకటనా చేయలేదు కదా.!

కళ్యాణ్ దిలీప్ సుంకర వ్యవహార శైలిపై సహజంగానే పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి ఘాటైన కామెంట్లు వస్తాయ్. సోషల్ మీడియా యుగం ఇది. ఎవర్నీ ఎవరూ ఆపలేరు. వాటిని పట్టుకుని, జనసేన పార్టీ బాగోతాలేవో బయటపెట్టేస్తానన్నట్లుగా కళ్యాణ్ దిలీప్ సుంకర మాట్లాడటమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

ఒకప్పుడు కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన రాజకీయ ప్రత్యర్థులపై ఎలా విరుచుకుపడిపోయారో, అలా కళ్యాణ్ దిలీప్ సుంకర వ్యవహార శైలిపై.. ఇతరులూ మండిపడతారు కదా.!

పవన్ కళ్యాణ్ అభిమాని, జనసేన సింపథైజర్.. అన్న గుర్తింపు లేకపోతే, అసలు కళ్యాణ్ దిలీప్ సుంకర ఎవరు.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంటుంది.! అందులో వింతేముంది.? ఏమో, పోతిన వెంకట మహేష్‌లా ముందు ముందు కళ్యాణ్ దిలీప్ సుంకర కూడా, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తాడేమో.! నడుస్తున్న రాజకీయం అదే కదా.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...