Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన సినిమాను నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మించారు. 1980లో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఇప్పటికే విడుదలైన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసాయి. చిన్ననాటి నుంచే సమాజంపై అవగాహనతో పెరిగి సమాజానికేదో సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్న వ్యక్తి కథ. కాలేజీ ఎలక్షన్స్ లో నాయకుడిగా ఎదిగి, పోలీసు వ్యవస్థకే దీటుగా, సమాజంలో నక్సలైట్లు చేసే దోర్జన్యాలకు ఎదురు వెళ్లే పాత్ర జితేందర్ రెడ్డి. ట్రైలర్లో డైలాగులు, యాక్షన్ తో రాకేశ్ వర్రే ఆకట్టుకుంటున్నాడు.
మే10న ‘విడుదల కాబోతున్న జితేందర్ రెడ్డి అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించినట్టు మేకర్స్ తెలిపారు. రియా సుమన్, వైశాలి రాజ్, సుబ్బరాజు ఇతర పాత్రల్లో నటించారు.
