Switch to English

ఇంటర్వ్యూ: పవన్ కళ్యాణ్ పవన్ గారు క్లాప్స్ కొట్టి నన్ను అప్లాజ్ చేయడం మర్చిపోలేను – హీరోయిన్ అంజలి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

మూడేళ్ళ తర్వాత ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ నుంచీ వస్తున్న ‘వకీల్ సాబ్‘ మూవీ ఏప్రిల్ 9న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం జోరుగా ఈ చిత్ర ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన అంజలి “వకీల్ సాబ్” గురించి, ఈ చిత్రంలో తన పాత్ర గురించి తెలిపిన విశేషాలు ఆమె మాటల్లోనే..

డైరెక్టర్ వేణు శ్రీరామ్ మార్పులు చేసి చెప్పిన వకీల్ సాబ్ కథ ఎలా అనిపించింది?

వేణుశ్రీరాం గారు కలిసినప్పుడు పింక్ సినిమా రీమేక్ ని తెలుగు నేటివిటీకి తగినట్లు మార్పులు చేస్తున్నాం, కొత్తగా ఉంటుంది అని చెప్పారు. మార్పులు చేసిన కాన్సెప్ట్ లు బాగా నచ్చాయి.

పవన్ కళ్యాణ్ గారితో మొదటిసారి పనిచేయడం ఎలా ఉంది?

పవన్ కళ్యాణ్ గారితో నటించడం మొదట్లో కొన్ని రోజులు ఇబ్బందిగానే ఉండేది. దానికి కారణం ఆయన వస్తుంటే సెట్ లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. నేనేమో ఎక్కువగా మాట్లాడుతాను. నా వల్ల ఏదైనా డిస్ట్రబ్ అవుతారా అని చాలా భయపడ్డాను. పవన్ గారు చాలా ఇన్ పుట్స్ ఇస్తూ సినిమా చేయించారు. అయన ఇన్ పుట్స్ విన్నాక మన క్యారెక్టర్ మనం సరిగ్గా చేస్తే సరిపోతుందనిపించింది.

వకీల్ సాబ్ లో మీ పాత్ర ఎలా ఉంటుంది? ఎంత ప్రాధాన్యత ఉంటుంది?

నా క్యారెక్టర్ గురించి ఇప్పుడు ఎలాంటి వివరాలు చెప్పలేను. మొదటగా పవన్ గారితో సినిమా అనగానే జంప్ చేశాను. ఆ తర్వాతే నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో అని ఆలోచించాను. చెప్పాలంటే పెద్ద హీరోతో పనిచేస్తున్నప్పుడు మన క్యారెక్టర్స్ కనపడవు. కానీ వకీల్ సాబ్ లో నా క్యారెక్టర్ కు ఒక స్థానం ఉంటుంది. నేను గతంలో కొన్ని గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేశాను. వాటిలో వకీల్ సాబ్ క్యారెక్టర్ తప్పకుండా ఉంటుందని చెప్పగలను.

కమర్షియాలిటీ కోసం వకీల్ సాబ్ లో చేసిన మార్పులు ఒరిజినల్ వెర్షన్ ఫీల్ ని ఎంత వరకూ క్యారీ చేస్తాయి?

వకీల్ సాబ్ ను పింక్ తో పోల్చితే, పింక్ కథలోని సోల్ అలాగే ఉంటుంది కానీ చేసిన మార్పులన్నీ ఆ మెయిన్ స్టోరీ చుట్టూ చేశారు. మహిళల మీద జరిగే అఘాయిత్యాల వార్తలు మనకు కామన్ అయి పోయాయి. మన ఇంట్లో ఇలాంటిది జరిగితే ఎలా రెస్పాండ్ అవుతాం అనేది చూపించడమే ఈ మూవీ హైలైట్.

కోర్టు సీన్స్ లో ప్రకాష్ రాజ్ గారితో పనిచేయడం ఎలా ఉంది?

వకీల్ సాబ్ ద్వారా ప్రకాష్ రాజ్ గారితో మరోసారి పనిచేసే అవకాశం వచ్చింది. నాకు – ప్రకాష్ రాజ్ కి మధ్య రెండు సీన్స్ ఉంటాయి. మన ఎదుట ఉన్న ఆర్టిస్ట్ బాగా నటిస్తేనే, మనకూ ఓ కసి వస్తుంది, అదే వాళ్లు ఫర్మార్మ్ సరిగా చేయకుంటే మనమూ డల్ అ‌వుతాం. ప్రకాష్ రాజ్ గారితో పనిచేసినప్పుడు మనకూ ఆ ఎనర్జీ వస్తుంది.

వకీల్ సాబ్ ద్వారా ఇస్తున్న మెసేజ్ ఏంటి?

మీకు ఇష్టమైతే ఎస్ లేకుంటే నో చెప్పడం మీ ఛాయిస్. నో చెప్పకూడదు అని ప్రశ్నించే రైట్ ఎవరికీ లేదు. ఇష్టపడటం ఇష్ట పడకపోవడం అమ్మాయి నిర్ణయానికి వదిలేయాలి. సినిమాలోనూ పవన్ గారు ఇదే విషయాన్ని చెప్పబోతున్నారు.

సెట్లో పవన్ గారు మెచ్చుకున్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా?

ట్రైలర్ లో ‘ అవును డబ్బులు తీసుకున్నాం’ అనే డైలాగ్ చెప్పిన సీన్ చేశాక పవన్ గారు క్లాప్ కొట్టి నన్ను అప్లాజ్ చేశారు. సాధారణంగా పవన్ గారు అంత ఎక్స్ ప్రెసివ్ గా ఉండరు. కానీ ఆయన ప్రశంసించాక ఎక్కడలేని సంతోషం కలిగింది.

ఫెమినిజం, ప్రీ మ్యారిటల్ సెక్స్ లాంటి విషయాలు ఈ సినిమాలో ఉంటాయి. వాటిపై మీ అభిప్రాయం?

ప్రీమారిటల్ సెక్స్ అనేది వ్యక్తిగత విషయం. వారి వారి ఇష్టాలు, ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. ఫెమినిజం అనే విషయాన్ని గుడ్ వేలో వాడితే మంచిదనేది నా ఉద్దేశం.

కెరీర్ ఎలా వెళ్తోంది మరియు మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి?

ఏ నాయికైనా తన కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటుంది అనే దానిపైనే ఆమె కెరీర్ ఆధారపడి ఉంటుంది. నాకు కెరీర్ లో ఎప్పుడూ గ్యాప్ లేకుండా నచ్చిన సినిమాలు చేసుకుంటూ వస్తున్నాను. నేను ఇప్పుడు ఏ దారిలో వెళ్తున్నానో భవిష్యత్ లోనూ అలాగే కంటిన్యూ చేస్తున్నాను. తెలుగు, తమిళంలో కొన్ని ఎగ్జైటింగ్ చిత్రాలు చేస్తున్నాను. వాటి వివరాలు త్వరలో చెబుతాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...