పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన వకీల్ సాబ్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఎల్లుండి శనివారం యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగి ఉండేది. కాని కరోనా కారణంగా ఈ వేడుక క్యాన్సిల్ అయ్యింది. కరోనా కారణంగా వకీల్ సాబ్ కు మరింతగా నష్టాలు తప్పవేమో అంటున్నారు. ఈ సినిమా కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో భారీ ఎత్తున మిడ్ నైట్ షో లు మరియు బెనిఫిట్ షో లు వేయాలనుకున్నారు. కాని అది సాధ్యం అయ్యేలా లేదంటున్నారు.
కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు చెబుతున్నారు. ఈ సమయంలోనే వారు రాత్రి సమయంలో షో లకు అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించే అవకాశం ఉంది అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వకీల్ సాబ్ సినిమా ప్రీ మియర్ షో లు మరియు బెనిఫిట్ షో లపై చాలా ఆశలు పెట్టుకుని నిర్మాతలు మరియు బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. కాని ఇప్పుడు పోలీసు వారు అనుమతులు ఇచ్చేది లేనిది క్లారిటీ లేకపోవడంతో ఏం జరుగుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
222763 134910Thanks for this fantastic post! It has long been really valuable. I wish that you will carry on posting your wisdom with us. 192301
811090 175973Really intriguing topic , appreciate it for posting . 749255