Switch to English

చిత్ర విచిత్ర వైపరీత్యం.. ఆంధ్రప్రదేశ్‌కి కరెంటు కష్టాలట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,438FansLike
57,764FollowersFollow

నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది ‘పెద్దల’ తీరు. పెద్దలంటే, అధికారాన్ని వెలగబెడుతున్న రాజకీయ పెద్దలని అర్థమిక్కడ. దేశంలో ఏ రాష్ట్రం కూడా ప్రస్తుతం కరెంటు కోతల సమస్యని ఎదుర్కోవడంలేదు. అసలు సమీప భవిష్యత్తులో కరెంటు కష్టాలనేవి దేశంలో వుండవనే అభిప్రాయం బలంగా వినిపిస్తున్న రోజులివి.

దేశంలో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు.. అంటే, ఎక్కువ ఉత్పత్తి వున్న రాష్ట్రాల నుంచి తక్కువ ఉత్పత్తి వున్న రాష్ట్రాలకు కరెంటు పంపిణీ సజావుగా సాగుతోంది. మరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరెంటు కష్టం ఎందుకొచ్చినట్లు.?

కేంద్రం వైఖరి కారణంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు కొరత ఏర్పడి, ఆ కారణంగా విద్యుత్ ఉత్పత్తిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయట. ఇదెక్కడి సమస్య.? దేశవ్యాప్తంగా ఏదన్నా ఇంకో రాష్ట్రం ఇలాంటి సమస్యను ఎదుర్కొంటోందా.? అని విద్యుత్ రంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు ఆరా తీస్తున్నారు.

మొన్నీమధ్యనే ఓ అధికారిక ప్రకటన అధికారుల నుంచి వచ్చింది. దానర్థమేంటంటే, ఓ నాలుగైదు గంటలపాటు.. సాయంత్రం దాటాక రాత్రి సమయంలో ఏసీలు ఆపెయ్యాలట, తద్వారా విద్యుత్ ఆదా చెయ్యాలట. ఇలాంటి ప్రకటన ఇంతకు ముందెన్నడైనా చూశామా.? అని జనం విస్తుపోతున్నారు.

రేప్పొద్దున్న వీధి లైట్లు ఆర్పేయండి.. అనొచ్చేమో. ఆ తర్వాత ఇంట్లో టీవీలూ, రిఫ్రిజిరేటర్లూ ఆపెయ్యమని కోరతారేమో. అయినా, ఇప్పుడంతా విద్యుత్ వాహనాల ట్రెండ్ షురూ అవుతోందాయె. మరి, వాటికి విద్యుత్ ఎలా అందించగలుగుతుంది ప్రభుత్వం.?

ముందు ముందు కరెంటు కోతలు తప్పకపోవచ్చునంటూ సాక్షాత్తూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడంతో, రాష్ట్రంలో అప్పుడే కరెంటు కోతల భయం మొదలైంది. ఇప్పుడే కరెంటు కోతల హెచ్చరికలంటే, శీతాకాలం తర్వాత వచ్చే వేసవి సంగతేంటి.? వరుణుడి కరుణతో ప్రాజెక్టులు నిండు కుండల్లా మారినా రాష్ట్రంలో ఈ విద్యుత్ వెతలేంటి.? అసలేం జరుగుతోంది రాష్ట్రంలో.!

అత్యద్భుతమైన పాలన.. అంటూ రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టేస్తోన్న జగన్ సర్కార్, కరెంటు సమస్యలపై ప్రజలకు సంజాయిషీ చెప్పుకుంటుందా.? చెప్పుకోదా.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌...

రాజకీయం

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

ఎక్కువ చదివినవి

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ పనిలో అయినా అలాగే ఆలోచింపజేస్తుంది. అంతే...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...