Switch to English

ఆత్మ నిర్భర్‌ భారత్‌-3: రైతు బాగుపడేదెప్పుడు.?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీకి సంబంధించి మూడో ఎపిసోడ్‌ని నేడు దేశ ప్రజల ముందుంచారు. ఇందులో రైతు సంక్షేమం గురించి కేంద్రం చాలా విషయాలు చెప్పింది. రైతు ఆదాయాన్ని పెంచుతామని చెప్పింది. రైతుకు భరోసా ఇస్తూ ఈ ప్యాకేజీలో అనేక అంశాల్ని ప్రస్తావించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. రైతులు ఎక్కడ తమ వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్‌ వుంటే అక్కడ అమ్ముకునేలా కేంద్రం అవకాశం కల్పించడాన్ని అభినందించి తీరాలి.

లాక్‌ డౌన్‌ వ్యవధిలో కనీస మద్దతు ధరతో 74,300 కోట్ల రూపాయలకు పైగా కొనోగుళ్ళు చేయడం జరిగిందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి. ప్రధాన మంత్రి కిసాన్‌ ఫండ్‌ కింద 18,700 కోట్ల రూపాయలు బదిలీ చేశామన్నారు. పీఎం ఫసల్‌ బీమా యోజన కింద 6,400 కోట్లు చెల్లించినట్లూ చెప్పారు. పశు సంవర్ధక శాఖ కోసం అదనపు చర్యలు చేపట్టామన్నారు. 111 కోట్ల లీటర్ల పాలను అదనంగా సేకరించబడినట్లు వివరించారు. మత్స సంపద, రొయ్యల పరిశ్రమ విషయంలోనూ తమ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందని చెబుతూ, ఆయా రంగాలకు ప్రత్యేక కేటాయింపుల్నీ ప్రస్తావించారు. తేనె టీగల పెంపకం, పశువులకు టీకాలు వేయించడం.. ఇలా చాలా అంశాలున్నాయి కేంద్ర మంత్రి వెల్లడించిన మూడో ప్యాకేజీలో.

నిజానికి, ఇలాంటి లెక్కలు బడ్జెట్‌ సమయంలోనే చూస్తుంటాం. ‘అది చేసేశాం.. ఇది చేసేయబోతున్నాం..’ అని ప్రభుత్వాలు చెప్పడం కొత్తేమీ కాదు. ఆరేళ్ళ క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ, రైతు ఆదాయం తమ ప్రభుత్వ హయాంలో పెరగబోతోందని చెప్పారు. కానీ, ఏం జరిగింది.? రైతు ఆత్మ హత్యలు ఇంకా దేశంలో కొనసాగుతూనే వున్నాయి. రైతుకి గిట్టుబాటు ధర లభించడం లేదు. మరి, వినియోగదారులకైనా తక్కువ ధరకు బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులు వంటివి లభిస్తున్నాయా.? అంటే అదీ లేదు. ఎందుకిలా.? ఈ ప్రశ్నకు మాత్రం ఏ ప్రభుత్వం దగ్గరా సమాధానం దొరకదు. మొత్తమ్మీద, మరోమారు కేంద్రం అంకెల గారడీ చేసినట్లే కన్పిస్తోంది. రైతుకి ఏ ప్రభుత్వాలు ఎంత ఎక్కువ చేసినా అభినందించి తీరాల్సిందే. కానీ, వేల కోట్లు.. లక్షల కోట్లు.. అంటే లెక్కలు చెప్పడం తప్ప.. రైతుకి కింది స్థాయిలో సాయం అందుతుందా.? రైతు బాగుపడుతున్నాడా.? అన్నది మాత్రం ఏ ప్రభుత్వమూ పట్టించుకోదు. మనది రైతు భారతం.. రైతు కన్నీరు పెడుతున్న భారతం.

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

టాలీవుడ్‌కి తీపి కబురు సరే.. సోషల్‌ డిస్టెన్సింగ్‌ ఎలా.?

తెలుగు సినీ పరిశ్రమకు తీపి కబురు అందబోతోంది. త్వరలో షూటింగులకు అనుమతి లభించబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని, తమ ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు ముందుకొచ్చిందంటూ ఈ రోజు ప్రభుత్వ పెద్దలను కలిసిన...

బిగ్‌ స్టోరీ: ఎమ్మెల్యే బాలకృష్ణ బాధ్యత తీసుకోగలరా.?

ప్రముఖ సినీ నటుడు, టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి అలాగే టీడీపీ మహానాడు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్‌...

అనుమతులు ఇవ్వటమే ఆలస్యం..’లొకేషన్’లో ఉంటాను.!

తమిళ నటుడు మరియు నిర్మాత, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీని స్టార్ గా మార్చిన బ్లాక్ బస్టర్ సూపర్ చిత్రం ‘పిచ్చైకారన్’ తెలుగులో ‘బిచ్చగాడు’గా రిలీజై సెన్షేషనల్ సక్సెస్ దక్కించుకుంది. ఈ సినిమా...

బ్రేకింగ్ న్యూస్: బోరు బావిలో పడ్డ సాయి వర్ధన్ మృతి.!

గురువారం మార్నింగ్ అప్డేట్: గత సాయంత్రం మెదక్ జిల్లా, పాపన్నపేట మండలం, పోడ్చన్ పల్లిలో పంట పొలాల్లో సాగు చేయడం కోసం ఓ 120 అడుగుల బోరు బావి లో సాయి వర్ధన్ అనే...

లాక్ డౌన్ రెండో కోణం: 25 ఏళ్లలో కానిది.. రెండు నెలల్లో అయింది

ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు చాలా దేశాలు లాక్ డౌన్ బాట పట్టాయి. మనదేశంలో కూడా లాక్ డౌన్ విధించి రెండు నెలలు దాటింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగో దశ...