Switch to English

అమరావతి పోరుకి 150 రోజులు.. ఏం సాధించినట్లు.?

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి కొనసాగాలంటూ అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న పోరాటం 150వ రోజుకి చేరుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ‘అమరావతి పోరు’కి సంబంధించిన వార్తలు ఎక్కడా కన్పించకపోయినా, అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు మాత్రం ఇంకా తమ ఆందోళన కొనసాగిస్తూనే వున్నారు.. అదీ సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటిస్తూ.. లాక్‌ డౌన్‌ నిబంధనల్ని పాటిస్తూ. చాలా ప్రత్యేకమైన పోరాటమిది. రాజధాని అమరావతి కోసం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన విజ్ఞప్తికి అనుగుణంగా అమరావతి ప్రాంత రైతులు ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. అయితే, చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని అయ్యింది గనుక, ఆ అమరావతి మీద అసహనం పుట్టుకొచ్చిందో ఏమోగానీ.. ముఖ్యమంత్రి అవుతూనే, అమరావతిపై తనదైన స్టయిల్లో రాజకీయం షురూ చేశారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.

అధికారంలోకి వస్తూనే అమరావతి ప్రాంతంలో ప్రజా వేదికను కూల్చేయడంతో మొదలయ్యింది అసలు ప్రసహనం. ప్రజా వేదిక మీద ‘అక్రమ కట్టడం’ అనే ముద్ర వేసి కూల్చేశారుగానీ, ఆ పక్కన వున్న ఏ ప్రైవేటు భవనాన్నీ ఇప్పటిదాకా కూల్చేయలేకపోయింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. ఇక, అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నంకి తరలించే క్రమంలో కర్నూలుని న్యాయ రాజధానిగా ప్రకటించారు. విశాఖపట్నంకి ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ అనే ముసుగు వేయాలనుకున్నారు. అమరావతిని శాసన రాజధానిగా మార్చారు. అసెంబ్లీలో బిల్లు కూడా పాస్‌ అయ్యింది. కానీ, వ్యవహారం శాసన మండలి దగ్గర ఆగిపోయింది. ప్రభుత్వ ఆలోచనల్ని వ్యతిరేకిస్తూ రైతులు ఎంత ఆందోళన చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.

అయితే, ప్రస్తుతం శాసన మండలి రద్దు వ్యవహారం కేంద్రం పరిధిలోకి వెళ్ళడంతో, ఆ శాసన మండలిలో ఆగిపోయిన ‘మూడు రాజధానుల వ్యవహారం’ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. మరోపక్క, తమకున్న విశేష అధికారాలతో కర్నూలుకి కొన్ని కార్యాలయాల్ని తరలించాలని జగన్‌ సర్కార్‌ భావించినా.. న్యాయస్థానంలో మొట్టికాయలు తప్పలేదు. ఇక, అమరావతి కోసం రక్తం చిందించాల్సి వచ్చింది రైతులు. పోలీసులు విచక్షణా రహితంగా దాడులు చేసినా, అమరావతి రైతులు తట్టుకుని నిలబడ్డారు. ఈ క్రమంలో జరిగిన యాగీ.. హైకోర్టు ప్రభుత్వానికి వేసిన మొట్టికాయలు తెలిసిన విషయాలే. అయితే, అమరావతి పోరాటంపై ‘కుల ముద్ర’ వేయడంలో కొంత మేర వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సఫలమయ్యిందనే చెప్పాలి.

అలాగని, ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో ముందడుగు వేయగలిగిందా.? అంటే అదీ లేదు. 150 రోజులు కాదు.. ఇంకెన్ని రోజులు పోరాటం చేయాల్సి వచ్చినా వెనక్కి తగ్గేది లేదని.. అమరావతి కోసం జరుగుతున్న పోరాటంలో ఇప్పటికే చాలామంది రైతులు ప్రాణాలు కోల్పోయారనీ, వారి త్యాగలు వృధా కానివ్వబోమని రైతులు నినదిస్తున్నారు. ఈ పోరాటం ఎక్కడిదాకా వెళుతుందోగానీ, అమరావతి కోసం జరుగుతున్న ఈ పోరు మాత్రం చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. సంక్షేమ పథకాల కోసం భూములు అమ్ముకుంటున్న ప్రభుత్వాన్ని చూస్తున్నాం. కానీ, రైతులు తమ రాష్ట్ర రాజధాని కోసం భూముల్ని త్యాగం చేశారు. ఇదీ చరిత్ర అంటే.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

కోలుకుంటున్న జనం.. కోరలు చాస్తున్న కరోనా

జనసాంద్రత ఎక్కువగా వున్న భారతదేశంలో కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) వ్యాప్తిని అడ్డుకోవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్ష దాటేసినా.. ప్రపంచంలోని చాలా దేశాలతో పోల్చితే...

బిగ్‌ బ్రేకింగ్‌: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎత్తివేత

టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్‌ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకి హైకోర్టు ఊరటనిచ్చింది. వైసీపీ రాజకీయ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సమయంలోనే ఏబీ వెంకటేశ్వరరావుని కేంద్ర ఎన్నికల సంఘం...

5 మీటర్ల దూరంలో తెగిపడ్డ తల

మెదక్ జిల్లాలో దారుణం యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ లో దుర్గయ్య తల తెగి 5 మీటర్ల దూరంలో పడటం స్థానికంగా కలకలం రేపింది. పెద్ద శంకరం పేట మండలం ఉత్తలూరు గ్రామానికి...

రంజాన్‌ స్పెషల్‌: ‘హలీం’కి ఊరట దక్కేనా.?

హలీం.. రంజాన్‌ స్పెషల్‌ వంటకం ఇది. కేవలం ముస్లింలకు మాత్రమే కాదు.. అన్ని మతాలకు చెందిన భోజన ప్రియుల్నీ తనవైపుకు తిప్పుకున్న ప్రత్యేక వంటకంగా హలీం గురించి చెప్పుకోవచ్చు. ఎక్కడో విదేశాల్లో పుట్టి,...

టీడీపీకి ఎన్టీఆరే దిక్కు.. కండిషన్స్‌ అప్లయ్‌.!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన తాత స్వర్గీయ నందమూరి తారకరామారావు తరహాలోనే ఖాకీ రంగు దుస్తులు ధరించి, రాజకీయ తెరపై కన్పించాల్సిందేనా.? ఆ సమయం ఆసన్నమయ్యిందా.? అంటే, అవుననే అంటున్నారు టీడీపీలో చాలామంది...