ఈ మధ్య సినిమాల విషయంలో ట్రెండ్ బాగా మారింది. ఒకప్పటి ఫక్తు కమర్షియాల్ ఫార్ములాను పక్కనపెట్టి సరికొత్త ఐడియాలతో కుర్ర దర్శకులు సంచలనాలు క్రియేట్ చేస్తున్నారు. తెలుగులో అయితే గత రెండేళ్లలో వచ్చినన్ని మార్పులు ఎప్పుడు చూడలేదు. ఇక బాలీవుడ్లో అయితే ఈ ప్రయోగాలు చేయడంలో ఎప్పుడు ముందుంటారు. ఇప్పటికే అక్కడ భిన్నమైన సినిమాలు తెరకెక్కుతూ సంచలనాలు రేపుతున్నాయి.
ఈ మద్యే లెస్బియన్ లవ్ నేపథ్యంలో సోనమ్ కపూర్, రెజినా కలిసి నటించిన ఏక్ లడికికో దేఖతో ఐసా లగా సినిమా ఓ పెద్ద దుమారమే రేపింది. తాజాగా అలాంటి ప్రయాత్నమే చేస్తుంది మరో హాట్ భామ ఆదా శర్మ? ఇంతకీ ఈ అమ్మడు రేపుతున్న సంచలనం ఏమిటో తెలుసా!! ఈ అమ్మడు లింగమార్పిడి కథతో సాగే ఓ లవ్ స్టోరీ సినిమాలో నటిస్తుండడమే !! ఏమిటి? లింగమార్పిడి కథా !! అంటూ షాక్ అవుతున్నారా. మీరు వింటున్నది నిజమే. తాజాగా బాలీవుడ్లో లింగమార్పిడి కథతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. మాన్ టూ మాన్ అనే టైటిల్ తో తెరకెక్కే ఈ సినిమాకి అభిర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
పుట్టుకతోనే అబ్బాయి అయిన ఓ వ్యక్తి తనకు అమ్మాయిగా మారాలన్న కోరికతో లింగ మార్పిడి ఆపరేషన్ ద్వారా అమ్మాయిగా మారుతుంది. కానీ ఈ విషయం తెలియక హీరో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వివాహం తరువాత అసలు విషయం తెలియడంతో అవాక్కయిన అయన ఆ తరువాత ఏమి చేసాడు? లాంటి ఆసక్తికర కథతో ఈ సినిమాను తెరక్కిస్తారట. లింగమార్పిడి చేయించుకున్న వారిని సమాజం ఎలా చులకనగా చూస్తుంది అన్న పాయింట్ తో ఈ కథ ఉంటుందని టాక్. నవీన్ కస్తూరియా హీరోగా, ఆదా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
1920 హర్రర్ సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్సిన అదా శర్మ అక్కడ కమాండో 2, కమాండో 3, లాంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక తెలుగులో నితిన్ సరసన హార్ట్ ఎటాక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ పలు చిత్రాల్లో నటించింది. అయితే ఇక్కడ పరాజయాలు వరుసగా రావడంతో ఈ అమ్మడు మళ్ళీ బాలీవుడ్ లోనే ప్రయత్నాలు చేస్తుంది. మరి మాన్ టూ మాన్ సినిమాతో అదా ఎలాంటి సంచలనం రేపుతుందో చూడాలి.
