Switch to English

ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం ‘లాయర్’ ఖర్చు ఎంత.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow

ప్రముఖ న్యాయవాది ముకుల్ రహ్తోగీ ఎంట్రీతో ఎట్టకేలకు బాలీవుడ్ సినీ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కి డ్రగ్స్ కేసులో బెయిల్ వచ్చింది. బెయిల్ రావడమంటే క్లీన్ చిట్ వచ్చినట్లు కాదు. కానీ, 21 రోజులుగా ఈ కేసులో ఇరుక్కుని జైల్లో మగ్గుతున్న ఆర్యన్ ఖాన్ ఎట్టకేలకు విడుదలయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది.

తెరవెనుక షారుక్ ఖాన్, తన కుమారుడికి బెయిల్ కోసం చాలా తపన పడ్డాడు. ఎంత కష్టమో తెలుసా.? చెప్పలేనంత.! ఎక్కడా ఆర్యన్ ఖాన్ వ్యవహారంపై షారుక్ ఖాన్ బయట మాట్లాడింది లేదు. తెరవెనుకాల మాత్రం, పెద్ద లీగల్ టీమ్ పనిచేసింది.

బెస్ట్ లాయర్స్‌ని రంగంలోకి దించాడు షారుక్ ఖాన్. ఇందుకోసం కనీ వినీ ఎరుగని స్థాయిలో ఖర్చు చేశాడట. అదెంత ఖర్చు.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దేశంలో ఇప్పటిదాకా ఎవరూ ఖర్చపెట్టనంత.. అనే చర్చ బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ వేల కోట్ల ఆర్థిక సామ్రాజ్యానికి అధిపతి. అలాంటప్పుడు, తన కుమారుడి కోసం వందల కోట్లైనా ఖర్చు చేయకుండా వుంటాడా.? అన్న ప్రశ్న తలెత్తుతోంది. మరీ వందల కోట్లు అయి వుండదుగానీ.. అంటూ కొందరు దీర్ఘాలు తీస్తున్నారు.

కేవలం ముకుల్ రహ్తోగీకే కోట్లు చెల్లించి వుండొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోపక్క, టీమ్ ఆఫ్ లీగల్ అడ్వైజర్స్ పని చేసిన దరిమిలా, వారి కోసం కూడా బాగానే ఖర్చయి వుంటుంది. ఎలాగైతేనేం, తన కుమారుడికి బెయిల్ రావడంతో, ఆ బెయిల్ కోసం కృషి చేసిన లీగల్ టీమ్‌కి ‘పార్టీ’ ఇచ్చాడట షారుక్ ఖాన్.

వేల కోట్ల అధిపతి కాబట్టి షారుక్ ఖాన్ కోట్లు ఖర్చు చేసి తన కుమారుడికి బెయిల్ తెప్పించుకున్నాడు. మరి, సామాన్యుడి పరిస్థితేంటి.? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బెయిల్ పొందడం అనేది ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి హక్కు. దానికి న్యాయస్థానం అనుమతించడం, అనుమతించకపోవడం అన్నది వాదోపవాదాల్లో ‘పస’ని బట్టి ఆధారపడి వుంటుంది. ఆ వాదనల కోసమే అంత పెద్ద మొత్తం ఖర్చు పెట్టాలా.? అన్నది విలువైన ప్రశ్నే మరి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...