ఆకాష్ పూరి హీరోగా పరిచయం అయిన సినిమా మెహబూబా నిరాశ పర్చింది. దాంతో చిన్న గ్యాప్ తీసుకుని పూరి నటించిన సినిమా రొమాంటిక్. ఈ సినిమాకు పూరి జగన్నాద్ దర్శకత్వం వహించకుండా మిగిలిన అన్ని పనులు చేశాడు. అంటే కథ.. స్క్రీన్‌ప్లే.. డైలాగ్స్.. నిర్మాణం. ఇలా అన్ని తానై కొడుకు సినిమాను సక్సెస్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సినిమాకు ప్రభాస్.. విజయ్ దేవరకొండలు ప్రమోషన్స్ చేసేందుకు ముందుకు రావడంతో భారీగా అంచనాలు పెరిగాయి. మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
డబ్బు కోసం గోవాలో నేరాలు చేసే బ్యాచ్ సభ్యుడు వాస్కో డి గామా(పూరి ఆకాష్). ఇతడు డ్రగ్స్ మాఫియా నుండి అండర్ వరల్డ్ మాఫియా వరకు అన్నింట్లో కూడా ఉంటాడు. డ్రగ్స్.. నేరాలు అంటూ ముందుకు సాగుతున్న వాస్కో డి గామా ఒకానొక సమయంలో మ్యుజీషియన్ అయిన మౌనిక(కేతిక) తో ప్రేమలో పడతాడు. ఆమెను దక్కించుకునేందుకు ఎన్నో వెదవ ప్రయత్నాలు చేసి చివరకు సఫలం అవుతాడు. ఆ సమయంలోనే డ్రగ్స్ మాఫియాను పట్టుకునేందుకు కొత్త పోలీస్ ఆఫీసర్ రమ్య(రమ్యకృష్ణ) అక్కడ అడుగు పెడతారు. అప్పుడు వాస్కోడి గామ ఎలాంటి టర్న్ లతో జీవితం సాగుతుంది.. అతడి ప్రేమలో రమ్య ఇన్వాల్వ్ ఏంటీ అనేది సినిమా కథ.
నటీనటులుః
మొదటి సినిమాతో పోల్చితే ఈ సినిమాలో నటుడిగా ఆకాష్ పూరి మెప్పించాడు. ఈ సినిమాలో అతడి పాత్ర మరీ మాసీగా ఉంది. ఇలాంటి పాత్రలు చేయాలంటే కాస్త కష్టమైన విషయమై. పూరి హీరో అంటే మరీ కేర్ లెస్ గా.. అస్సలు బాధ్యత లేకుండా ఒక రకమైన యాటిట్యూడ్ తో ఉంటాడు. అలా పూరి ఆకాష్ సరిగ్గా సూట్ అయ్యాడు. మొదటి సినిమా తో పోల్చితే ఈ సినిమాలో చాలా వేరియేషన్స్ ను ఆకాష్ చూపించి నటుడిగా సక్సెస్ అయ్యాడు. ఇక ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ ఆకట్టుకునే విధంగా నటించింది. అందంతో పాటు అభినయం ఉన్న ముద్దుగుమ్మ. అందుకే ఈమెకు మంచి ఫ్యూచర్ ఉంది. ఇద్దరి మద్య రొమాన్స్ పీక్స్ లో ఉంది. ఇక పోలీసు ఆఫీసర్ పాత్రలో రమ్యకృష్ణ నటించిన తీరు చాలా బాగుంది. ఆకట్టుకునే ఆమె నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ అనడంలో సందేహం లేదు. మిగిలిన వారు వారి పాత్రల పరిధిలో నటించారు.
సాంకేతిక నిపుణులు:
సునీల్ కశ్యప్ అందించిన పాటలు పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి. అయితే అతడి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. సినిమాలోని పలు సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆసక్తిని బాగా పెంచడంలో ఉపయోగపడింది. ఎడిటింగ్ పర్వాలేదు అనిపించింది. కొన్ని సన్నివేశాల విషయంలో ఇంకాస్త కఠినంగా ఉంటే బాగుండేది. సినిమాటోగ్రాఫర్ గోవా లొకేషన్స్ ను చాలా చక్కగా చూపించే ప్రయత్నం చేశాడు. అనీల్ పాదూరి పర్వాలేదు అనిపించాడు. అయితే స్క్రీన్ ప్లే మరియు కథ పూర్తిగా పూరి జగన్నాద్ దే అవ్వడం వల్ల ఆయన పని తక్కువ అయ్యింది. తనకు అప్పగించిన పనిని బాధ్యత యుతంగా అనీల్ నెరవేర్చాడు అనడంలో సందేహం లేదు. నిర్మాణాత్మక విలువలు కథానుసారంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
- హీరో హీరోయిన్ మద్య వచ్చే రొమాంటిక్ సీన్స్
- పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ సంగీతం.
మైనస్ పాయింట్స్‌ః
- కథ లో నాచురాల్టీ లేదు,
- స్క్రీన్ ప్లే గందరగోళంగా ఉంది.
విశ్లేషణ:
యూత్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి.. అలాగే రొమాంటిక్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడేలా కూడా ఉంది. మొత్తంగా ఈ సినిమా ను ప్రేక్షకులు చూడాలంటే కాస్త ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే కథ విషయంలో క్లారిటీ లేదు.. స్క్రీన్ ప్లే కాస్త గందరగోళంగా ఉంది. కనుక పూరిపై అభిమానం ఉంటే ఒక సారి చూసేయవచ్చు.
తెలుగు బులెటిన్ రేటింగ్ః 2.5/5.0