Switch to English

జగన్‌ ‘రెండున్నర’ ఫార్ములా.. నవ్వుల పాలవుతున్న వేళ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,457FansLike
57,764FollowersFollow

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా సరికొత్త ఫార్ములాని తెరపైకి తెచ్చారు. మంత్రి పదవులు కేవలం రెండున్నరేళ్ళకేనంటూ ముందే ప్రకటించి, మొత్తం 25 మందిని తన క్యాబినెట్‌లో చేర్చుకున్నారు. 5 ఉప ముఖ్య మంత్రి పదవుల్నీ సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో పంపకాలు చేపట్టారు. మొత్తంగా చూస్తే, క్యాబినెట్‌ సామాజిక వర్గ సమీకరణాల కోణంలో చూస్తే అత్యద్భుతమే. కానీ, రెండున్నరేళ్ళ పంపకమేంటి.? రెండున్నరేళ్ళ తర్వాత 90 శాతం మంత్రులకు ఉద్వాసన పలకడమేంటి.? ఈ చర్చ రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్యుల్లోనూ జోరుగా సాగుతోంది.

రాష్ట్రానికి సంబంధించి తన క్యాబినెట్‌లో ఎవర్ని, ఎంతకాలం వుంచుకోవాలన్నదానిపై సర్వాధికారం ముఖ్యమంత్రిదే. కానీ, ప్రజల కోసం పనిచేయాల్సిన ఆ పదవుల్ని, పార్టీలో సమన్యాయం చేయడం కోసం పంపకం చేయడమంటే, తప్పుడు సంకేతాలు ఖచ్చితంగా వెళతాయి. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, ఇటీవలి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు అత్యంత ఖరీదైనవి. దేశ రాజకీయాల్లోనే ఇంతటి ఖరీదైన ఎన్నికలు ఇంతకు ముందెన్నడూ జరగలేదని ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో తేల్చేశారు. ఒక్కో నియోజకవర్గానికీ సగటున 50 కోట్లు ఖర్చుపెట్టేందుకూ రాజకీయ పార్టీలు వెనుకాడలేదనీ, అత్యధికంగా 150 కోట్లు ఓ నియోజకవర్గానికి ఖర్చుపెట్టిన పరిస్థితులూ వున్నాయని సాక్షాత్తూ రాజకీయ పార్టీలకు చెందిన నేతలే ప్రకటనలు చేస్తున్న పరిస్థితి.

సరిగ్గా ఈ టైమ్‌లో అవినీతి లేని పాలన అందిస్తానంటూనే, ‘రెండున్నరేళ్ళ పదవీ కాలం’ మంత్రులకు ముఖ్యమంత్రి నిర్దేశించడం ఆశ్చర్యకరం. అందరికీ సమాన అవకాశాల కోసమే ఈ ప్రయత్నమన్న అధికార పార్టీ వాదన బాగానే వుందిగానీ, ఆ ‘అవకాశం’ దేనికోసం.? అని సామాన్యులు సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. విపక్షాల విమర్శల సంగతి సరే సరి.

ఇప్పుడే కొత్తగా ప్రభుత్వం ఏర్పాటయ్యింది గనుక, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మీదా, ఆయన క్యాబినెట్‌ మీదా అడ్డగోలు విమర్శలు చేయడం సబబు కాకపోవచ్చు. కానీ, తెరపైకొస్తున్న సరికొత్త నిర్ణయాలపై అభ్యంతరాలు మామూలే కదా! మెరుగైన పాలన కోసం మంత్రులు ఎప్పటికప్పుడు మారితే నష్టం లేదేమో. కానీ, పార్టీ బలోపేతం చేసుకునేందుకు, ఎన్నికల్లో గెలవడానికి కష్టపడ్డవారి కష్టం ఫలించేందుకు.. రెండున్నరేళ్ళ గడువుతో కూడిన పదవులంటే ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యవస్థ దీన్ని సమర్థించదు. ఇప్పుడు ఈ నిర్ణయం ఇంతలా అనుమానాలకు తావిస్తోంటే, భవిష్యత్తులో ఇంకెంత నవ్వులపాలవుతుందో వేచి చూడాల్సిందే.

Related Posts

కులమే వారికి అడ్డొచ్చింది

రోజాకి జబర్‌దస్త్‌ వెన్నుపోటు.. పొడిచిందెవరు?

జగన్ ప్రసంగం: సూటిగా.. సుత్తి లేకుండా..

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...