Switch to English

రోజాకి జబర్‌దస్త్‌ వెన్నుపోటు.. పొడిచిందెవరు?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

సినీ నటి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా, వైస్‌ జగన్‌ మంత్రి వర్గంలో చోటు ఆశించి, భంగపడటం ఆమె అభిమానుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. సోషల్‌ మీడియా వేదికగా రోజాని చాలామంది అభిమానులు ఓదార్చుతున్నారు. మరికొందరు మాత్రం, రోజా ఓవరాక్షన్‌కి తగిన శాస్తే జరిగిందంటూ వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందంటూ ప్రచారంలోకి ప్రచారంలోకి వచ్చిన పేర్లలో రోజా అందరికంటే ముందున్నారు.

2014 ఎన్నికల్లో తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారామె. చట్ట సభలకు ప్రాతినిథ్యం వహించాలన్న కోరిక ఆమెకు అలా నెరవేరింది. అయితే, అసెంబ్లీ వేదికగా ఆమె చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. అసలు రోజాని అసెంబ్లీలో వుండకుండా చేయాలనేంతలా కుట్రలు జరిగాయి, అవి కొంతమేర ఫలించాయి కూడా. అయితే, అలా రోజా అడ్డంగా బుక్కవడం వెనుక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే కొందరు తెరవెనుక స్కెచ్‌ నడిపించి, రోజాని ఇరికించారంటారు కొందరు. అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ నేతలతో లాలూచీ పడ్డ కొందరు వైసీపీ నేతలు, రోజాని రెచ్చగొట్టి, అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ అయ్యేలా చేశారని చాలా వాదనలు విన్పించాయి. అది గతం.

ఇప్పుడామె మంత్రి అవుతారని అంతా అనుకున్నారుగానీ, ఇక్కడ మళ్ళీ అన్యాయం జరిగిందామెకి. ‘ఇదీ నిఖార్సయిన వెన్నుపోటు అంటే. రోజాని మునగ చెట్టు ఎక్కించేసి, కింద పడిపోయేలా చేశారు..’ అని రోజా మద్దతుదారులు వాపోతున్నారు. ‘మొదటి నుంచీ రోజాకి సొంత మనుషులుగా చెలామణీ అవుతున్నవారే శతృవులుగా మారతారు.. టీడీపీలో వున్నప్పుడూ అదే పరిస్థితి.. ఇప్పుడు వైఎస్సార్సీపీలోనూ అదే పరిస్థితి..’ అన్నది రోజా సన్నిహితుల వాదన. గడచిన ఐదేళ్ళ సమయాన్నే తీసుకుంటే, చంద్రబాబు పాలనలో అత్యంత దారుణంగా ఇబ్బంది పడ్డ వైఎస్సార్సీపీ నేత ఎవరన్నా వున్నారంటే, అది రోజా మాత్రమే. అంతలా పార్టీ కోసం రోజా చాలా కష్టాలు పడ్డారు.

మరి, వైఎస్‌ జగన్‌ తనను నమ్మినవారిని నట్టేట్లో ముంచేయరనీ, ఆదుకుంటారనీ ఆయన సన్నిహితులు చెప్పుకునే మాటే నిజమైతే, రోజాకి ఎందుకు మంత్రి పదవి దక్కలేదు.? ఇదే ఇప్పుడెవరికీ అర్థం కాని ప్రశ్న. ఇంతకీ, రోజాకి వైఎస్సార్సీపీలో మంత్రి పదవి దక్కనీయకుండా వెన్నుపోటు పొడిచిందెవరు.? అధినేత వైఎస్‌ జగన్‌ నిర్ణయాన్ని కాదనేవారు, ఆయన్ని పక్కదారి పట్టించేవారూ ఎవరూ వుండరన్నది వైఎస్సార్సీపీ నేతలు ముక్తకంఠంతో చెప్పే మాట.

రాజకీయంగా రోజా సమర్థతని వాడుకుని, ఇప్పుడామెకు స్వయంగా వైఎస్‌ జగన్‌ రాజకీయంగా వెన్నుపోటు పొడిచారని అనుకోవాలా! చూస్తోంటే, అదే నిజమని అన్పిస్తోంది. మరోపక్క, ఇదంతా గిట్టనివారు చేసే దుష్ప్రచారమనీ, రోజాతోపాటు చాలామంది ముఖ్య నేతలకు ఈసారి మంత్రి వర్గంలో అవకాశాలు దక్కలేదనీ, ముందు ముందు ఖచ్చితంగా పార్టీలో మంచి అవకాశాలుంటాయనీ వైసీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు రోజా విషయంలో.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి జగన్నాధ్’

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో స్టయిల్స్, మేనరిజమ్స్ ఫాలో అవుతారు ఫ్యాన్స్....