Switch to English

8 మంది పోలీసులు చనిపోతే ఎవ్వరికీ నోరు పెగలదేం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

తమిళనాడులో ఘోరం జరిగింది. ఇద్దరు వ్యక్తుల్ని పోలీస్‌ స్టేషన్‌లో అత్యంత దారుణంగా హింసించారు. ఈ క్రమంలో ఆ తండ్రీ కొడుకులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తండ్రి వయసు యాభయ్యేళ్ళకు పైనే. తనయుడి వయసేమో సుమారు 30 ఏళ్ళు. అత్యంత పాశవికమైన ఘటన ఇది. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. పోలీసుల అరెస్టులూ జరుగుతున్నాయి. సెలబ్రిటీలు ఇప్పటికీ సోషల్‌ మీడియాలో ఆ సంఘటనపై స్పందిస్తున్నారు. మంచిదే, సెలబ్రిటీల స్పందన.. సమస్య తీవ్రతను మరింత ఎలివేట్‌ చేస్తాయి.

కానీ, ఉత్తరప్రదేశ్‌లో 8 మంది పోలీసుల్ని కొందరు రౌడీ మూకలు చంపేస్తే.. సెలబ్రిటీల నుంచి ఇప్పటిదాకా పెద్దగా స్పందన రాకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. పైగా, పోలీసులు తమ విధి నిర్వహణలో భాగంగా ఓ రౌడీ షీటర్‌ని అరెస్ట్‌ చేయడానికి వెళ్ళిన క్రమంలో.. రౌడీ షీటర్‌కి చెందిన రౌడీ మూక కాల్పులు జరపడంతో పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలు అస్సలేమాత్రం జరగకూడదు. జరిగాయంటే, ఇందులో ప్రభుత్వాల వైఫల్యం సుస్పష్టం. ప్రభుత్వాలకు ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ వుంటుంది. మరి, ఆ వ్యవస్థ ఇప్పుడు వున్నట్టా.? లేనట్టా.? బీజేపీ పాలిత రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది కాబట్టి.. పైగా, చనిపోయింది పోలీసులు కాబట్టి.. సెలబ్రిటీలు లైట్‌ తీసుకున్నారనుకోవాలేమో. మీడియాలో కూడా ఇది జస్ట్‌ ఓ వార్తగానే మిగిలిపోవడం శోచనీయం.

సదరు రౌడీ షీటర్‌ ‘ట్రాక్‌ రికార్డ్‌’ తీస్తే, 50కి పైగా కేసులు వాడి మీద వున్నాయని తేలింది. ఉత్తరప్రదేశ్‌లో ఈ తరహా ఘటనలు కొత్తేమీ కాదు. జరుగుతూనే వుంటాయి. పోలీసులు బలిపశువులుగా మారడం, రాజకీయ పార్టీల అండ చూసుకుని రౌడీ మూకలు చెలరేగిపోవడం అక్కడ సర్వసాధారణమే. సరిహద్దుల్లో 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం లాంటిదే ఇది కూడా. సరిహద్దులో సైన్యం దేశానికి పహారా కాస్తుంది. దేశంలో పోలీసులు మనల్ని రక్షిస్తుంటారు. అలాంటి పోలీసుల్ని చంపడమంటే చిన్న విషయం కాదు.

తమిళనాడు ఘటనతో పోలీసుల్ని ద్వేషిస్తూ సోషల్‌ మీడియాలో చెలరేగిపోయింది. కానీ, ఆ పోలీసు వ్యవస్థలో అందరూ అలాంటి క్రూరులే వుండరు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన క్రూరత్వాన్ని ఖండించాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వమే యాక్షన్‌ తీసుకుంటుందో, కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగుతుందో.. ఇలాంటి ఘటన ఇంకోటి జరగకుండా మొత్తంగా రౌడీ మూకల్ని ఏరిపారెయ్యాల్సిన సందర్భమిది. సెలబ్రిటీలూ.. కాస్తంత ఇలాంటి విషయాల మీద కూడా స్పందించండి.. లేకపోతే, మీ స్థాయి తగ్గిపోతుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

ఎక్కువ చదివినవి

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...