తమిళనాడులో ఘోరం జరిగింది. ఇద్దరు వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్లో అత్యంత దారుణంగా హింసించారు. ఈ క్రమంలో ఆ తండ్రీ కొడుకులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తండ్రి వయసు యాభయ్యేళ్ళకు పైనే. తనయుడి వయసేమో సుమారు 30 ఏళ్ళు. అత్యంత పాశవికమైన ఘటన ఇది. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. పోలీసుల అరెస్టులూ జరుగుతున్నాయి. సెలబ్రిటీలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆ సంఘటనపై స్పందిస్తున్నారు. మంచిదే, సెలబ్రిటీల స్పందన.. సమస్య తీవ్రతను మరింత ఎలివేట్ చేస్తాయి.
కానీ, ఉత్తరప్రదేశ్లో 8 మంది పోలీసుల్ని కొందరు రౌడీ మూకలు చంపేస్తే.. సెలబ్రిటీల నుంచి ఇప్పటిదాకా పెద్దగా స్పందన రాకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. పైగా, పోలీసులు తమ విధి నిర్వహణలో భాగంగా ఓ రౌడీ షీటర్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన క్రమంలో.. రౌడీ షీటర్కి చెందిన రౌడీ మూక కాల్పులు జరపడంతో పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలు అస్సలేమాత్రం జరగకూడదు. జరిగాయంటే, ఇందులో ప్రభుత్వాల వైఫల్యం సుస్పష్టం. ప్రభుత్వాలకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ వుంటుంది. మరి, ఆ వ్యవస్థ ఇప్పుడు వున్నట్టా.? లేనట్టా.? బీజేపీ పాలిత రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది కాబట్టి.. పైగా, చనిపోయింది పోలీసులు కాబట్టి.. సెలబ్రిటీలు లైట్ తీసుకున్నారనుకోవాలేమో. మీడియాలో కూడా ఇది జస్ట్ ఓ వార్తగానే మిగిలిపోవడం శోచనీయం.
సదరు రౌడీ షీటర్ ‘ట్రాక్ రికార్డ్’ తీస్తే, 50కి పైగా కేసులు వాడి మీద వున్నాయని తేలింది. ఉత్తరప్రదేశ్లో ఈ తరహా ఘటనలు కొత్తేమీ కాదు. జరుగుతూనే వుంటాయి. పోలీసులు బలిపశువులుగా మారడం, రాజకీయ పార్టీల అండ చూసుకుని రౌడీ మూకలు చెలరేగిపోవడం అక్కడ సర్వసాధారణమే. సరిహద్దుల్లో 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం లాంటిదే ఇది కూడా. సరిహద్దులో సైన్యం దేశానికి పహారా కాస్తుంది. దేశంలో పోలీసులు మనల్ని రక్షిస్తుంటారు. అలాంటి పోలీసుల్ని చంపడమంటే చిన్న విషయం కాదు.
తమిళనాడు ఘటనతో పోలీసుల్ని ద్వేషిస్తూ సోషల్ మీడియాలో చెలరేగిపోయింది. కానీ, ఆ పోలీసు వ్యవస్థలో అందరూ అలాంటి క్రూరులే వుండరు. ఉత్తరప్రదేశ్లో జరిగిన క్రూరత్వాన్ని ఖండించాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వమే యాక్షన్ తీసుకుంటుందో, కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగుతుందో.. ఇలాంటి ఘటన ఇంకోటి జరగకుండా మొత్తంగా రౌడీ మూకల్ని ఏరిపారెయ్యాల్సిన సందర్భమిది. సెలబ్రిటీలూ.. కాస్తంత ఇలాంటి విషయాల మీద కూడా స్పందించండి.. లేకపోతే, మీ స్థాయి తగ్గిపోతుంది.
504800 608475Youre so cool! I dont suppose Ive learn something like this before. So very good to search out any person with some special thoughts on this subject. realy thanks for starting this up. this website is 1 thing thats wanted on the net, somebody with a bit originality. valuable job for bringing 1 thing new towards the internet! 143304