Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్ హీరోల్లో చాలా మంది కేవలం హీరోలుగా మాత్రమే నటిస్తాం అంటూ మడి కట్టుకు కూర్చుంటున్నారు. కానీ నవీన్ చంద్ర మాత్రం హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా సినిమాలు చేశాడు, చేస్తున్నాడు.
విభిన్న పాత్రలు, సినిమాలు చేస్తూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న నవీన్ చంద్రకు అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ దక్కింది. ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ నటుడిగా అవార్డును నవీన్ చంద్ర సొంతం చేసుకున్నాడు.
మంత్ ఆఫ్ మధు సినిమాలో నవీన్ చంద్ర ప్రదర్శించిన నటనకు గాను ఈ గౌరవం దక్కించుకున్నాడు. ఫాల్కే అవార్డ్ రావడం పట్ల నవీన్ చంద్ర ఆనందం వ్యక్తం చేశాడు. జీవితంలో అత్యున్నత పురస్కారంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో పాటు పలు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. తమిళంలో నవీన్ చంద్రకు మంచి క్రేజ్ ఉంది. స్టార్ హీరోల సినిమాల్లో పిలిచి మరీ అవకాశం ఇస్తున్నారు. ఫాల్కే అవార్డు దక్కడంతో నవీన్ చంద్ర మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.