Switch to English

‘రఘురామ’పై స్పీకర్‌కి వైసీపీ ఫిర్యాదు: ఈ ‘బొచ్చులో’ గోలేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

‘స్వపక్షంలో వుంటూనే విపక్షంలా వ్యవహరిస్తున్నారు.. ప్రత్యర్థి పార్టీలతో కుమ్మక్కయి, సొంత పార్టీపై దుష్ప్రచారానికి దిగారు.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? పార్టీలో భావ ప్రకటనా స్వేచ్చ అనేది కొంతవరకే పరిమితం.. ఆ పరిమితులు దాటితే ఎవరిపైన అయినా క్రమశిక్షణా చర్యలు తప్పవు. స్పీకర్‌ని కలిసి రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని కోరాం. స్పీకర్‌ సానుకూలంగా స్పందించారు..’ ఇదీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి, ఈ రోజు స్పీకర్‌ని కలిసి సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదు చేసిన అనంతరం మీడియా ముందుకొచ్చి చెప్పిన విషయం.

విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ ఎంపీల బృందం ఈ రోజు స్పీకర్‌ని కలిసింది. ఇందుకోసం ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి ఢిల్లీకి వైసీపీ బృందం చేరుకున్న విషయం విదితమే. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, టీటీడీ భూముల విషయంలోనూ రఘురామకృష్ణరాజు తీరు పార్టీ నిర్ణయానికి వ్యతిరేంగా వుందన్నది వైసీపీ వాదన. ఇదిలా వుంటే, షోకాజ్‌ నోటీస్‌లో పేర్కొన్న ‘బొచ్చులో నాయకత్వం’ విషయాన్ని, విజయసాయిరెడ్డి ప్రెస్‌ మీట్‌లో కూడా ప్రస్తావించారు.

నిజానికి ఆ ‘బొచ్చులో నాయకత్వం’ అన్న మాట వైసీపీ అధినాయకత్వం మీద వాడలేదనీ, ఆ సందర్భమే వేరని ఇప్పటికే రఘురామకృష్ణరాజు వివరణ ఇచ్చారు. ఇది నిజానికి కాస్తంత జుగుప్సాకరమైన ప్రస్తావన. దాన్ని పదే పదే ప్రస్తావించకుండా వుండడమే మంచిది. కానీ, విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని మీడియా సాక్షిగా నొక్కి వక్కాణించడం అంటే.. ఎక్కడో తేడా కొట్టేస్తోందని వైసీపీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది.

ఇక, స్పీకర్‌ని కలిసొచ్చిన తర్వాత వైసీపీ ఎంపీల బృందంలో పెద్దగా ‘కళ’ కన్పించలేదు. అంతా డల్‌ మోడ్‌లోనే కన్పించారు. నిజానికి, ఢిల్లీలో ఇంతకు ముందే అన్ని వ్యవహారాల్నీ రఘురామకృష్ణరాజు చక్కబెట్టేశారు. పార్టీ పేరు విషయమై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా స్పష్టత తీసుకున్నారు. ఈ పేరు గురించి వైసీపీ ఎంపీల బృందం ప్రస్తావిస్తూ, ‘టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ.. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ.. అలాగే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ..’ అంటూ ‘కవరింగ్‌’ చేసుకునే ప్రయత్నం చేశారు. అందులో కొంత నిజం లేకపోలేదు.

కానీ, షోకాజ్‌ నోటీస్‌ వంటి కీలక విషయాల్లో ‘లెటర్‌ హెడ్‌’ వాడేటప్పుడు ఖచ్చితంగా ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ’ అనే మెన్షన్‌ చేయాలన్నది రఘురామకృష్ణంరాజు లీగల్‌ పాయింట్‌. మొత్తమ్మీద, ‘ముసుగులో గుద్దులాట’కి తెరపడింది. ఇక, ఇప్పుడు రఘురామకృష్ణంరాజు పార్టీపై చేయబోయే డైరెక్ట్‌ విమర్శలు ఎలా వుంటాయో వేచి చూడాల్సిందే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. మే 9న...

Ram Charan Birthday Special: నిజ జీవితంలో మానవతావాది.. రామ్ చరణ్

Ram Charan: తండ్రి నుంచి వారసత్వం మాత్రమే కాదు.. రాజసం కూడా పుణికిపుచ్చుకుంటే ఆ కొడుకును చూసి తండ్రి మురిసిపోతాడు. కుటుంబ పేరు ప్రతిష్టలను కూడా ముందుకు తీసుకెళ్తే సమాజం శెభాష్ అంటుంది....

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘చరణ్, నేనూ...

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్ చరణ్ ప్రశ్న

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ ఆ సుజిత్ ఎవరు.. ఫన్నీ సంభాషణ...

క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్యపాత్రలో యమధీర ఈ నెల 23న

కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ మన ముందుకు రానున్న చిత్రం యమధీర. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ నిర్మిస్తున్న తొలి...