Switch to English

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ముద్రగడ పద్మనాభం.

రాజకీయాలన్నాక విమర్శలు సహజం.! కానీ, ఇక్కడ ‘వైరం’ కనిపిస్తోంది.! వైరం అనాలా.? విద్వేషం అనాలా.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏనాడూ ముద్రగడ పద్మనాభంపై మాట తూలింది లేదు. పైగా, ‘పెద్దాయన’ అంటూ గౌరవమిచ్చారు కూడా.

కాపు సామాజిక వర్గానికే చెందిన ముద్రగడ పద్మనాభం, అదే కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ మీద ‘ద్వేషం’ పెంచుకున్నారు. అక్కసుతో రగిలిపోతున్నారు. దేనికోసం ఇంతలా పగబట్టేశారు.?

చివరికి, పవన్ కళ్యాణ్ గెలిస్తే, ‘ముద్రగడ పద్మనాభం రెడ్డి’గా తన పేరుని మార్చుకుంటాననీ, పవన్ కళ్యాణ్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించి తీరతానని ముద్రగడ పద్మనాభం సవాల్ విసరడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గం, ఈ ప్రకటనతో షాక్‌కి గురయ్యింది.

కొన్నాళ్ళ క్రితం ఓ సందర్భంలో, తాను రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అది ఆ సామాజిక వర్గంపై అభిమానం, గౌరవం.. అన్నిటికీ మించి, ఆ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులకు చలించిపోయి ఆ మాటలు జనసేనాని నోటి వెంట వచ్చాయి.

కానీ, ఇక్కడ ముద్రగడ పద్మనాభం ‘రెడ్డి’ సామాజిక వర్గంలోకి మారిపోతాననడం, మత మార్పిడిలా కుల మార్పిడి వ్యవహారం కింద చూడాలి.! ‘నేను లక్షలాది మందికి ఉప్మా పెట్టాను.. చిరంజీవిగానీ, పవన్ కళ్యాణ్‌గానీ.. వారితో సినిమాలు చేసే దర్శక నిర్మాతలకు టీ, కాఫీ అయినా ఇచ్చారా.?’ అని ముద్రగడ పద్మనాభం అమాయకంగా ప్రశ్నించేశారు.

చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాక్ నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కోట్లాది రూపాయల స్వార్జితాన్ని ‘సాయం కోసం ఎదురుచూసేవారికి’ అందిస్తున్నారు. కేవలం సినిమా స్టార్లుగా వున్న గుర్తింపు మాత్రమే కాదు, వ్యక్తిత్వంలోనూ చిరంజీవి, పవన్ కళ్యాణ్.. ఈ ఇద్దరూ చాలా చాలా ప్రత్యేకమని.. సినీ పరిశ్రమలో ఎవర్ని అడిగినా చెబుతారు.

ఇవన్నీ ముద్రగడ పద్మనాభంకి తెలియవా.? అంటే, తెలుసు.! గతంలో, ముద్రగడపై టీడీపీ హయాంలో పోలీసులు అణచివేత చర్యలకు దిగితే, మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. అది ముద్రగడ పద్మనాభం మర్చిపోతే ఎలా.? కాపు సామాజిక వర్గం నుంచి అప్పట్లో చిరంజీవి, ఇప్పుడు పవన్ కళ్యాణ్.. రాజ్యాధికారం దిశగా అడుగులేస్తే, ఆ కాపు సామాజిక వర్గంలో ముద్రగడ లాంటి కొందరు అడ్డు తగులుతున్నారు.

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? సమీప భవిష్యత్తులో కాపు సామాజిక వర్గానికి అధికారమే దక్కకూడదన్నట్లుగా వుంది ముద్రగడ పద్మనాభం రాజకీయ వ్యూహం.! సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్నట్లు కేవలం ఉప్మా కోసమే ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారా.? కాపు సామాజిక వర్గంపై ద్వేషంతో, రెడ్డి సామాజిక వర్గంలోకి మారిపోతున్నారా.?

ఒక్కటి మాత్రం నిజం, తన విమర్శలతో జనసేనకు చేటు చేయాలని ముద్రగడ అనుకుంటున్నారుగానీ, ‘ముద్రగడ పద్మనాభం రెడ్డి’ చేసే ప్రతి విమర్శా, జనసేన పార్టీకి కాపు సామాజిక వర్గంలో మైలేజ్ మరింత పెంచుతుందన్నది నిర్వివాదాంశం.

పుట్టిన కులంపై ఇంత ద్వేషమా ముద్రగడ పద్మనాభం.? అని కాపు సామాజిక వర్గం ప్రశ్నిస్తోంది.! ఈ ప్రశ్నకి ముద్రగడ పద్మనాభం రెడ్డిలా మారిపోతున్న ఒకప్పటి కాపు ఉద్యమ నేత ఏం బదులిస్తారు.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...