Switch to English

శానిటైజర్‌ డబ్బా మీదకెక్కిన పబ్లిసిటీ పైత్యం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ పైత్యం రోజు రోజుకీ పెరిగిపోతోంది. కాదేదీ పబ్లిసిటీకి అనర్హం అన్నట్లు.. స్మశానాలకీ, మరుగుదొడ్లకీ అధికార పార్టీ రంగులు పూసిన వైనం గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఇప్పుడు కరోనా వైరస్‌ని కూడా వదిలి పెట్టడంలేదు అధికార పార్టీ. ఇప్పటికే గ్రామ స్థాయిలో కరోనా వైరస్‌ పట్ల అవగాహన పేరుతో, అధికార పార్టీ జెండాల్ని అడ్డగోలుగా వాడేస్తోన్న విషయం విదితమే.

వైసీపీ జెండా రంగులతో మాస్క్‌లను ప్రాచుర్యంలోకి తెచ్చేశారు. తాజాగా శానిటైజర్‌ డబ్బాలపైనా అధికార పార్టీ రంగులు అద్దుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఫొటోలతో, ప్రభుత్వ చిహ్నాలతో ఈ శానిటైజర్‌ డబ్బాలు ప్రాచుర్యంలోకి వస్తుండడంతో జనం ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. ఏమో, రేప్పొద్దున్న ఫినాయిల్‌ బాటిళ్ళపైనా అధికార పార్టీ జెండాలు, ముఖ్యమంత్రి ఫొటోలు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇవన్నీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే జరుగుతున్నాయా.? అంటే, అవుననీ చెప్పలేం.. కాదనీ చెప్పలేం.

కిందిస్థాయి కార్యకర్తలు, నేతల ఉత్సాహం.. దానికి తోడు, ప్రభుత్వంలో వున్నవారి అత్యుత్సాహం వెరసి.. ఈ పబ్లిసిటీ పైత్యంతో అధికార పార్టీ తన స్థాయిని తానే నాశనం చేసుకున్నట్లవుతోంది. సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఈ పబ్లిసిటీ పైత్యంపై తయారు చేస్తున్న మీమ్స్ అన్నీ ఇన్నీ కావు. ‘ఎవరెలా తిట్టుకున్నా.. అదీ ఓ కరకమైన పబ్లిసిటీనే..’ అని అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సరిపెట్టుకుంటే చేయగలిగిందేమీ లేదు. కానీ, పబ్లిసిటీ కోసం ఏ స్థాయికైనా దిగజారతాం.. అన్నట్లు వ్యవహరించడం అస్సలేమాత్రం సబబు కాదు.

చంద్రబాబు ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు చేసే తన గౌరవాన్ని చెడగొట్టుకున్నారు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నారా.? దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ తరహా కక్కుర్తి పబ్లిసిటీ రాజకీయాలుండవు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మాత్రమే ఈ దుర్ఘతి ఏంటో.!

శానిటైజర్‌ డబ్బా మీదకెక్కిన పబ్లిసిటీ పైత్యం.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...