ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ పైత్యం రోజు రోజుకీ పెరిగిపోతోంది. కాదేదీ పబ్లిసిటీకి అనర్హం అన్నట్లు.. స్మశానాలకీ, మరుగుదొడ్లకీ అధికార పార్టీ రంగులు పూసిన వైనం గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఇప్పుడు కరోనా వైరస్‌ని కూడా వదిలి పెట్టడంలేదు అధికార పార్టీ. ఇప్పటికే గ్రామ స్థాయిలో కరోనా వైరస్ పట్ల అవగాహన పేరుతో, అధికార పార్టీ జెండాల్ని అడ్డగోలుగా వాడేస్తోన్న విషయం విదితమే.
వైసీపీ జెండా రంగులతో మాస్క్‌లను ప్రాచుర్యంలోకి తెచ్చేశారు. తాజాగా శానిటైజర్ డబ్బాలపైనా అధికార పార్టీ రంగులు అద్దుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటోలతో, ప్రభుత్వ చిహ్నాలతో ఈ శానిటైజర్ డబ్బాలు ప్రాచుర్యంలోకి వస్తుండడంతో జనం ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. ఏమో, రేప్పొద్దున్న ఫినాయిల్ బాటిళ్ళపైనా అధికార పార్టీ జెండాలు, ముఖ్యమంత్రి ఫొటోలు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇవన్నీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే జరుగుతున్నాయా.? అంటే, అవుననీ చెప్పలేం.. కాదనీ చెప్పలేం.
కిందిస్థాయి కార్యకర్తలు, నేతల ఉత్సాహం.. దానికి తోడు, ప్రభుత్వంలో వున్నవారి అత్యుత్సాహం వెరసి.. ఈ పబ్లిసిటీ పైత్యంతో అధికార పార్టీ తన స్థాయిని తానే నాశనం చేసుకున్నట్లవుతోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ పబ్లిసిటీ పైత్యంపై తయారు చేస్తున్న మీమ్స్ అన్నీ ఇన్నీ కావు. ‘ఎవరెలా తిట్టుకున్నా.. అదీ ఓ కరకమైన పబ్లిసిటీనే..’ అని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకుంటే చేయగలిగిందేమీ లేదు. కానీ, పబ్లిసిటీ కోసం ఏ స్థాయికైనా దిగజారతాం.. అన్నట్లు వ్యవహరించడం అస్సలేమాత్రం సబబు కాదు.
చంద్రబాబు ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు చేసే తన గౌరవాన్ని చెడగొట్టుకున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నారా.? దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ తరహా కక్కుర్తి పబ్లిసిటీ రాజకీయాలుండవు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రమే ఈ దుర్ఘతి ఏంటో.!
941695 368859Couldn?t be produced any greater. Reading this post reminds me of my old room mate! He always kept talking about this. I will forward this report to him. Pretty certain he will possess a good read. Thanks for sharing! 517162
625555 43148This is a superb weblog, would you be involved in doing an interview about just how you created it? If so e-mail me! 939305
203194 719938We stumbled more than here coming from a different internet page and thought I may well check issues out. I like what I see so now im following you. Look forward to exploring your web page however once more. 819045
239512 272540Thanks for the wonderful post against your blog, it genuinely provides me with a look about this topic.??;~.?? 745914