Switch to English

చిరంజీవి పుత్రోత్సాహంపైనా వాళ్ళంతా ఏడవాల్సిందేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి అంటే, ఒకటో రెండో సినిమాల్లో నటించిన సాధారణ నటుడు కాదు. 150కి పైగా సినిమాల్లో నటించి ‘మెగాస్టార్’గా తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. దేశవ్యాప్తంగా ఆయనకు కోట్లాదిమంది అభిమానులున్నారు. బిగ్-బి అమితాబ్ అంతటి గొప్ప నటుడే, ‘నేను చిరంజీవికి వీరాభిమానిని’ అని చెప్పడం చూశాం.

చిరంజీవి డాన్సులు.. చిరంజీవి తెరపై పండించే హ్యూమర్.. వాట్ నాట్. చిరంజీవి అంటే కంప్లీట్ మెగా ప్యాకేజ్. అయినా, చిరంజీవి గొప్ప తనం గురించి పదే పదే గొప్పగా చెప్పాలా.? ఏంటి.? ఒక్క సినిమా ‘ఆచార్య’తో చిరంజీవి పనైపోయిందనుకుని సంబరపడ్డారు చాలామంది. అలాంటోళ్ళందరికీ కంటి మీద కునుకు లేకుండా చేశారు చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో.

ఆ ‘వాల్తేరు వీరయ్య’ కొట్టిన దెబ్బకి సోకాల్డ్ హేటర్స్.. ఇంకా తేరుకోలేదు. చిరంజీవి స్థాయి ఏంటి.? అన్నది వాళ్ళకు అనవసరం. చిరంజీవి మీద నిత్యం పడి ఏడవడమే వాళ్ళ పని.!

ప్రపంచ సినీ దిగ్గజం జేమ్స్ కెమరూన్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి పదే పదే గొప్పగా మాట్లాడుతున్నారు. ఇటీవల విదేశాల్లో ‘ఆర్ఆర్ఆర్’ బృందంతో జేమ్స్ కెమరూన్ ఇంటరాక్ట్ అయ్యారు. రాజమౌళి పనితనాన్ని అభినందించారు. సినిమాలో నటించిన నటీనటుల గురించీ మాట్లాడారు.

అప్పట్లో సవివరంగా మాట్లాడటం కుదరకపోవడంతో, వీలు చిక్కినప్పుడల్లా ఒక్కో అంశం గురించీ సవివరంగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్ పాత్ర గురించి జేమ్స్ కెమరూన్ మాట్లాడటం పట్ల, మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. అంతే, మెగా హేటర్స్‌కి ఒళ్ళు మండిపోయింది. చిరంజీవికి వ్యతిరేకంగా కథనాల్ని వండి వడ్డించడం మొదలు పెట్టారు.

తన కుమారుడు నటించిన సినిమా గురించి గొప్ప గొప్ప ఫిలిం మేకర్స్ అభినందనల వర్షం కురిపిస్తే, చిరంజీవి స్పందించకూడదా.? పుత్రోత్సాహం పొందకూడదా.? ఇదెక్కడి వింత గోల.? ఇంకో హీరో విషయంలో అయితే, అతనితో ఎలాంటి బంధుత్వం లేకపోయినా.. జస్ట్ కుల పిచ్చితో.. సదరు వెకిలి మీడియా ఉప్పొంగిపోవచ్చా.? ఇదెక్కడి గోల.?

తన కుమారుడు సినీ రంగంలో తనకంటే ఎత్తుకు ఎదిగితే, ఏ తండ్రి అయినా ఆనందపడకుండా వుంటాడా.? జేమ్స్ కెమరూన్‌కి సోషల్ మీడియా వేదికగా చిరంజీవి థ్యాంక్స్ చెప్పడం నేరమైపోయింది. ‘తండ్రిగా, నా కొడుకు సాధించిన విజయం పట్ల గర్వపడుతున్నా..’ అని చెప్పడం పాపమైపోయింది.

పాపిష్టి లోకం.. అనడం కంటే, పాపిష్టి మీడియా అనడం సబబేమో.! ‘రామ్ చరణ్’ పాత్ర గురించీ, ఆ పాత్రలో రామ్ చరణ్ గురించీ.. చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పిన మాటలే.. ఇప్పుడు హాలీవుడ్ ఫిలిం మేకర్ జేమ్స్ కెమరూన్ కూడా చెబుతున్నారు. దాన్ని జీర్ణించుకోలేకపోవడమంటే.. ఏదో మానసిక అనారోగ్య సమస్యతో సోకాల్డ్ మీడియా బాధపడుతుందని అర్థం చేసుకోవాలేమో.!

సక్సెస్.. ఫెయిల్యూర్.. చిరంజీవికి కొత్త కాదు. విమర్శలు, ప్రశంసలూ ఆయనకు కొత్త కాదు. తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి ఎవరెస్టు శిఖరం.. అన్నది నిర్వివాదాంశం. సోకాల్డ్ గ్రామ సింహాలు మొరిగినంతమాత్రాన చిరంజీవి స్థాయి తగ్గిపోదు. ఎవరో ఏడ్చారని, చిరంజీవి తన కొడుకు సాధించిన ఘనతల్ని చూసి గర్వపడకుండా వుండిపోరు కదా.?

చిత్రమేంటంటే, ‘పూనకాలు లోడింగ్’ అని ‘వాల్తేరు వీరయ్య’ గురించి సినీ ప్రపంచం నినదిస్తున్న వేళ, ‘నీరసాలు లోడింగ్’ అంటూ సోకాల్డ్ కులపిచ్చి మీడియా మూలిగింది.! ఇప్పుడు కూడా చిరంజీవిని చూసి అదే మూలుగుడు.!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...