బీజేపీ ఎంపీ (రాజ్యసభ) జీవీఎల్ నరసింహారావు, ‘సంక్షేమ పథకాలకు ఆ ఇద్దరి పేర్లేనా.? అయితే ఆ కుటుంబం.. లేకపోతే ఈ కుటుంబం.. అయితే ఆ పార్టీ.. లేకపోతే ఈ పార్టీ..’ అంటూ టీడీపీని ఉద్దేశించి.. వైసీపీని ఉద్దేశించి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించి.. నందమూరి తారక రామారావుని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నిజానికి, ఆయన ‘ఆ ఇద్దరూ గొప్పవారే’ అని కూడా అన్నారండోయ్.!
కానీ, స్వర్గీయ ఎన్టీయార్ కుమార్తె పురంధేశ్వరికి కోపమొచ్చింది. ‘ఆ ఇద్దరు’ కాదు.. ‘ఆ మహానుభావులు’ అంటూ ట్వీటేశారు.. జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యల తాలూకు వీడియో షేర్ చేస్తూ. దాంతో, అసలు ‘మహానుభావులు’ అంటే ఏంటి.? అన్న చర్చ తెరపైకొచ్చింది. మహాత్మగాంధీని మహానుభావుడంటాం.. నేతాజీ శుభాష్ చంద్రబోస్‌ని మహానుభావుడంటాం. దేశం కోసం ప్రాణాలు అర్పించారు మరి.!
ఓ గురజాడ అప్పారావు.. ఓ పొట్టి శ్రీరాములు.. ఇలాంటోళ్ళను కదా మహానుభావులని అనాల్సింది.? ఓ పింగళి వెంకయ్య.. ఓ గుర్రం జాషువా.. వీళ్ళు కదా మహానుభావులంటే.? స్వర్గీయ ఎన్టీయార్ గొప్ప వ్యక్తి కాదనలేం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా.! సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీయార్ రాణిస్తే.. రాజకీయ రంగంలో రాజశేఖర్ రెడ్డి రాణించారు.
రెండ్రూపాయలకే కిలో బియ్యం.. అనేది స్వర్గీయ ఎన్టీయార్ హయాంలో తెరపైకొచ్చిన సంక్షేమ పథకం. ఆరోగ్య శ్రీ అనేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వచ్చిన సంక్షేమ పథకం. ఈ తరహా సంక్షేమ పథకాలు ఆ ఇద్దరి తర్వాత కుప్పలు తెప్పలుగా వచ్చాయి, వస్తూనే వున్నాయి. సంక్షేమ పథకాలు తెస్తే మహానుభావులా.? అలాగైతే, ఎవ్వరూ కష్టపడాల్సిన పనిలేదు.. అందర్నీ మేమే మేపుతాం.. నెలకి ఒక్కో కుటుంబానికి పది వేలో, పదిహేను వేలో ఇచ్చేస్తామని.. ముందు ముందు ఎవరైనా ప్రకటించొచ్చుగాక.
ఎలా వాటికి డబ్బులు తెస్తారు.? అంటే, రాష్ట్రాన్ని.. దేశాన్ని అమ్మేసి.! ఔను, సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలూ చేస్తున్న అప్పులను చూస్తున్నాం కదా.?
ఎన్టీయార్ అనబడే మహానుభావుడు.. తన ఆస్తుల్ని తన పిల్లలకు చెందేలా చేసుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆస్తిపాస్తులు ఆయన వారసులకు వచ్చాయ్. జనానికేమొచ్చాయ్.? జనం నెత్తిన ఆ సంక్షేమ పథకాల తాలూకు అప్పుల బారం పడింది. అంతేనా.? అంతకు మించి ఇంకేమన్నా వుందా.? ఇదీ సోషల్ మీడియాలో ‘మహానుభావులు’ అంశంపై జరుగుతున్న చర్చోపచర్చల సారాంశం.
642230 382276very good post. Neer knew this, thankyou for letting me know. 565154
918718 646650This internet website is truly a walk-through for all of the info you wanted about this and didnt know who to ask. Glimpse here, and you will certainly discover it. 223477
24752 444840Glad to be 1 of several visitants on this incredible internet web site : D. 987896
987291 6117Great post will be posting this on my weblog today maintain up the excellent work. 76642