చేసిన కొద్ది సినిమాలతోనే యూత్ లో తనకంటూ క్రేజ్ ను తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం నుండి వస్తోన్న లేటెస్ట్ మూవీ వినరో భాగ్యము విష్ణుకథ. ప్రోమోలతో ఆకర్షించిన ఈ చిత్రం మరి ఎలా ఉందో చూద్దామా.
కథ:
తన చుట్టూ ఉన్నవాళ్లకు సహాయపడుతూ హ్యాపీ లైఫ్ లీడ్ చేసే విష్ణుకి జీవితంలో అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. తన ఫోన్ నెంబర్ లోని నైబర్ కాన్సెప్ట్ తో దర్శన్, శర్మ పరిచయమవుతారు.
దానివల్ల తన లైఫ్ ఎలా మారింది? వచ్చిన ఇబ్బందులను ఎలా అధిగమించాడు అన్నది చిత్ర కథ.
నటీనటులు:
విష్ణుగా కిరణ్ అబ్బవరం నీట్ గా నటించాడు. అయితే నటన పరంగా ఇంకా మెరుగుపడొచ్చు అని కొన్ని అంశాల్లో అనిపిస్తోంది. ముఖ్యంగా తన డైలాగ్ మోడ్యులేషన్ మీద వర్క్ చేయాల్సి ఉంది. ఏదేమైనా ఆడియన్స్ కు బోర్ కొట్టకుండా నటించడంలో సక్సెస్ అయ్యాడు విష్ణు. కాశ్మీర చూడటానికి బొమ్మలా ఉంది. చాలా అందంగా ఉంది కానీ నటించడానికి పెద్దగా స్కోప్ లేదు.
మురళీ శర్మకు వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్స్ లో ఇది ఒకటి అని చెప్పవచ్చు. తన పాత్రలోని అన్ని షేడ్స్ ను పండించాడు. మిగతా సపోర్టింగ్ కాస్ట్ కు పెద్దగా నటించడానికి అవకాశం దక్కలేదు.
సాంకేతిక నిపుణులు:
ఇది ఒక మల్టిపుల్ జోనర్ చిత్రం. ఇలాంటి వాటికి రైటింగ్ అనేది చాలా ముఖ్యం. అప్పుడే ఆడియన్స్ కథతో ట్రావెల్ అవ్వగలుగుతారు. కానీ ఈ సినిమాకు అదే మైనస్ గా మారింది. స్క్రీన్ ప్లే పరంగా ఫ్లాస్ బయటపడ్డాయి. అయితే దర్శకుడు తెలివిగా కమర్షియల్ ఎలిమెంట్స్ ను జొప్పించిన విధానం మెప్పిస్తుంది. ముఖ్యంగా ఆఖరి 30 నిముషాలు హైలైట్ గా నిలుస్తుంది.
చేతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఉన్న ప్రధాన బలాల్లో ఒకటి. సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే ప్రొడక్షన్ డిజైన్ కూడా. ఎడిటింగ్ ఇంకొంచెం బాగుంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్:
- కిరణ్ అబ్బవరం పెర్ఫార్మన్స్
- మురళి శర్మ కామెడి
- క్లైమాక్స్
- ఇంటర్వెల్ ట్విస్ట్
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- ఫస్ట్ హాఫ్
- కన్ఫ్యూజ్ చేసే స్క్రీన్ ప్లే
- బలవంతంగా వచ్చే ఫైట్స్, సాంగ్స్
విశ్లేషణ:
వినరో భాగ్యము విష్ణుకథ ఒక డీసెంట్ అటెంప్ట్. ప్రతీసారి తెలిసిన కథలానే అనిపించినా కానీ ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ సాధిస్తుంది ఈ చిత్రం. థియేటర్లో ఒక్కసారి చూడదగ్గ చిత్రమిది.
తెలుగు బులెటిన్ రేటింగ్: 2.75/5