Switch to English

రాశి ఫలాలు: సోమవారం 01 ఆగస్ట్ 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం

సూర్యోదయం: ఉ.5:44
సూర్యాస్తమయం: సా.6:34
తిథి: శ్రావణ శుద్ధ చవితి రా.2:43 వరకు తదుపరి పంచమి
సంస్కృతవారం: ఇందు వాసరః (సోమవారం)
నక్షత్రము: పుబ్బ మ.2:55 వరకు తదుపరి ఉత్తర
యోగం: పరిఘ సా.6:49 వరకు తదుపరి శివం
కరణం: వణిజ మ.2:15 వరకు తదుపరి విష్టి
దుర్ముహూర్తం :మ.12:24 నుండి 1:12 వరకు
వర్జ్యం : రా.10:23 నుండి 12:02 వరకు
రాహుకాలం: ఉ.7;30 నుండి 9:00 వరకు
యమగండం: 10:30 నుండి మ.12:00 వరకు
గుళికా కాలం : మ.1:58 నుండి 3:34 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:23 నుండి 5:11 వరకు
అమృతఘడియలు:ఉ.8:06 నుండి 9:47 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:56 నుండి మ.12:48 వరకు

ఈరోజు (01-08-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

వృషభం: భాగస్తులతో మాటపట్టింపులు ఉంటాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి.

మిథునం : విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అవసరానికి ధనం చేతికి అందుతుంది. వ్యాపార ఉద్యోగాలలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది.

కర్కాటకం: దూర ప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఒక ముఖ్య విషయమైన మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్ధిక వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

సింహం: ఉద్యోగమున మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా లాభాలు అందుతాయి.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆత్మీయులు నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.

కన్య: కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. పాతరుణాల ఒత్తిడితో నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. నూతన వ్యాపార పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.

తుల: ధన ఆదాయం బాగుంటుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది.

వృశ్చికం: నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగుల కలలు సాకారమౌతాయి. ధన వ్యవహారాలు కలసివస్తాయి. దీర్ఘ కాలిక రుణాలు నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

ధనస్సు: సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గోవటం మంచిది. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. దీర్ఘ కాలిక ఋణాల ఒత్తిడి అధికమౌతుంది. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు

మకరం: ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు అంతగా కలసిరావు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలుంటాయి. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు.

కుంభం: చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యత కలుగుతుంది.నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.

మీనం: రాజకీయవర్గాల వారికీ పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి గృహమున శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరపు బంధువులతో పాత విషయాలు చర్చిస్తారు. గృహమున నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...